Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదిగో.. రిషి సార్‌తో పాటు వేద కూడా.. ఈసారి అంతా గట్టోళ్లే!!
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదిగో.. రిషి సార్‌తో పాటు వేద కూడా.. ఈసారి అంతా గట్టోళ్లే!!

అయితే కామనర్స్ నుంచి గత సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా ఐదారుగురు హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈసారి వైల్డ్ కార్డ్‌లు కూడా దండిగా ఉండటంతో.. మొత్తం పది మంది వరకూ సామాన్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది మంది అంటే.. సగం మంది కంటెస్టెంట్స్ దొరికేసినట్టే. ఇక అసలు ఆట సెలబ్రిటీలతోనే. ఇప్పుడు సెలబ్రిటీలు హౌస్‌లోకి ఎవరొస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే చాలామంది పేర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుండగా.. వారిలో కొన్ని పాపులర్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌తో పాపులర్ అయిన దేబ్జానీ మోదక్ (Debjani Modak) పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. నిజానికి ఈ బెంగాలీ భామ పేరు గత సీజన్లో కూడా గట్టిగానే వినిపించింది. రెమ్యూనరేషన్ ఇష్యూస్ వల్ల గత సీజన్‌కి రాలేకపోయిందనే వార్తలు వినిపించాయి. అయితే ఈ సీజన్‌కి బేరం సెట్ అయ్యిందో ఏమో కానీ.. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యిందంట.
మరో ఇంట్రస్టింగ్ పేరు ముఖేష్ గౌడ. అదేనండీ మన రిషి సార్. గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టేసిన ముఖేష్ గౌడ.. బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్‌గా రాబోతున్నారట. అయితే ఇతను వస్తాడా? రాడా? అన్నది మాత్రం డౌటానుమానే కానీ.. వస్తే మాత్రం వెళ్లి టాప్‌లో కూర్చోవడం ఖాయం. ఎందుకంటే ఆ స్థాయిలో రిషికి ఫ్యాన్స్ ఉన్నారు మరి తెలుగులో. టాప్‌లోనే కాదు.. విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే గుప్పెడంత మనసు తరువాత తెలుగులో పెద్ద సీరియల్ ఆఫర్స్ వచ్చినా కూడా వదిలేసి మరీ కన్నడలో సినిమాలు చేస్తున్నాడు ముఖేష్ గౌడ. ఇప్పుడు సినిమాలను వదలి.. బిగ్ బాస్‌లోకి వస్తాడా? అంటే డౌటే. ఎందుకంటే బిగ్ బాస్‌కి వచ్చిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే కదా.
వీరిద్దరితో పాటు.. ఈసారి జబర్దస్త్ కోటా నుంచి జబర్దస్త్ రాంప్రసాద్, పొట్టి నరేష్‌లో కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారట. నటుడు కృష్ణుడు,చైత్ర రాయ్, యాంకర్ వర్షిణి, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, నటుడు అదిత్ ఈశ్వరన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ మొదలైన ప్రతిసారి.. ఇలాంటి లిస్ట్‌లు చాలానే బయటకు వస్తుంటాయి. నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా.. వాటిలో కొన్ని ఫైనల్ కూడా అవుతుంటాయి. కానీ.. బిగ్ బాస్ లాంచింగ్ రోజు ఊహించని వాళ్లెవరో స్టేజ్ ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. చూద్దాం ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్లు ఎంతమంది ఫైనల్ అవుతారో.
Bigg Boss Telugu Season 10 Contestants List:
1. దేబ్జానీ మోదక్ (debjani modak)
2. ముఖేష్ గౌడ (Mukesh Gowda)
3. యాంకర్ వర్షిణి (anchor varshini)
4. జబర్దస్త్ నరేష్ (jabardasth naresh)
5. ‘జబర్దస్త్ రాం ప్రసాద్ (jabardasth ramprasad)
6. చైత్రా రాయ్ (chaitra rai)
7. నటుడు కృష్ణుడు (krishnudu actor)
8. యంకర్ సుధీర్ రెడ్డి (anchor sudheer reddy)
9. టెంపర్ వంశీ (temper vamsi)
10. అదిత్ ఈశ్వరన్ (adith eswaran)