Podarillu Serial Today 27 August Episode: ఏ అమ్మాయి అయినా పర్లేదు.. పెళ్లి చేసుకునేందుకు రెడీగా మాధవ.. చక్రిని తిట్టిన మహా
Podarillu Serial Today 27 August Episode: ఏ అమ్మాయి అయినా పర్లేదు.. పెళ్లి చేసుకునేందుకు రెడీగా మాధవ.. చక్రిని తిట్టిన మహా

ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం..
జ్వరం ఎన్ని డిగ్రీలు వచ్చింది? ఎలా ఉన్నారు? అని అటాక్ చేస్తుంది మహా. ఏం మాట్లాడుతున్నానరండి.. నాకేం అర్థం కావడం లేదు అని చక్రి అంటాడు. విక్కీకి ఎందుకు అబద్దం చెప్పారు.. అని మహా తిడుతుంది. చెప్పొద్దన్నా వాడు చెప్పాడా? అని లోలోపల కోప్పడతాడు చక్రి. ఏం లేదు.. ఎక్కువ కేరింగ్ అవసరమా? ఆఫీస్‌కి వస్తారని తెలిసినా ఫోన్ చేయడం అవసరమా? అని అడుగుతాడు చక్రి. అలా కేరింగ్‌గా చూసుకునే బాస్ ఉండటం గ్రేట్.. అయినా మీరు నా విషయాల్లో ఎందుకు తల దూర్చుతున్నారు? ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు అని చక్రికి వార్నింగ్ ఇస్తుంది మహా.
ఎవరి లోకంలో వాళ్లు..
భోజనానికి అందరూ కూర్చుంటారు. కానీ ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉంటారు. శైలు మాటల్ని మాధవ, చక్రి చేసిన పనిని మహా, మహా తిట్టిన తిట్లను చక్రి.. శైలు రిజిష్టర్ మ్యారేజ్ మ్యాటర్‌ను కేశవ.. బస్టాండ్‌లో అమ్మాయిల్ని తల్చుకుంటూ కన్నా.. ఇలా ఎవరి ధ్యాసలో వాళ్లు ఉంటారు. ఏంటి? అంతా మౌనం పాటిస్తున్నారు.. మీ తాయారు అత్త చచ్చిందా? అని నారాయణ వచ్చి కౌంటర్ వేస్తాడు. అదేం లేదు అని నారాయణకు ఫుడ్డు పెడతాడు పెద్ది. చికెన్ లేదా? పప్పేనా? అని అడుగుతాడు నారాయణ. ఎప్పుడూ తిండి గోలే కానీ అన్నయ్య పెళ్లి గురించి ఆలోచించవా? అని చక్రి తిడతాడు.
చక్రిని తిట్టిన మహా..
ఎవరికి వాళ్లే అమ్మాయిల్ని చూసుకుంటున్నారు కదా అని నారాయణ అంటాడు. ఈ బండోడు అయితే ఏకంగా తాతనే చేస్తున్నాడు అని నారాయణ అంటాడు. ఇక మధ్యలో చక్రి దూరుతాడు. దీంతో మహా ఓ రేంజ్‌లో వాయిస్తుంది. ఎప్పుడూ పక్క వారి విషయాల్లో తల దూర్చడమేనా? అని తిడుతూనే ఉంటుంది. దీంతో చక్రి చెవులు మూసుకుంటాడు. ఇదంతా కాదు.. మనం పెద్దికి ఓ మంచి సంబంధం చూడాలి.. మళ్లీ ఓ కొత్త మ్యాట్రిమోనీలో వెతుకుదాం అని మహా చెబుతుంది. అన్నయ్యకి ఈ సారి పల్లెటూరి నుంచి అమ్మాయిని తీసుకు వద్దాం అని అంటాడు చక్రి. ఏ.. సిటీ నుంచి వచ్చిన మేం మంచి వాళ్లం కాదా అని మళ్లీ తిడుతుంది.
పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన పెద్ది..
అవును అన్నయ్యకి పెళ్లి చేయాలి.. అని కేశవ అంటాడు. పెద్దికి ఏమో శైలు మాటలు గుర్తుకు వస్తాయి. నీకు సిటీ నుంచి అమ్మాయి కావాలా? పల్లెటూరు నుంచి అమ్మాయి కావాలా? అన్నయ్య అని కన్నా అడుగుతాడు. అమ్మాయి కావాలి రా అని కేశవ అంటాడు. ఇక అక్కడి నుంచి పెద్ది లేచి వెళ్లిపోతాడు. ఇక ఉదయాన్నే సైట్‌కి వెళ్లిన పెద్ది.. పెళ్లిళ్ల బ్రోెకర్‌కి ఫోన్ చేసి రమ్మంటాడు. నాకు ఓ సంబంధం చూడండి.. ఎలాంటి అమ్మాయి అయినా పర్లేదు అని మాధవ చెప్తాడు. ఏంటి? ఇంత సడెన్‌గా మార్పు? అని ఆ పెళ్లిళ్ల బ్రోకర్ అడుగుతాడు.
నా తమ్ముడికి అడ్డుగా ఉన్నా..
నేను నా తమ్ముడికి అడ్డుగా ఉంటున్నాను.. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు.. నా పెళ్లి అయితే గానీ వాడు చేసుకోనని అంటున్నాడు.. నా వల్ల వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు అని పెద్ది చెప్తాడు. నీ పెద్ద తమ్ముడు చేసుకున్నాడు కదా అని మాధవని ఆ బ్రోకర్ అడుగుతాడు. అవును వాడు చేసుకున్నాడు కాబట్టే.. వీడు చేసుకోవద్దని గట్టిగా నిర్ణయించుకున్నాడు.. నేను వాళ్లకి అడ్డుగా ఉండకూడదని అనుకుంటున్నా.. అందుకే త్వరగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నా.. సంబంధం ఉంటే చెప్పండని మాధవ అడుగుతాడు. సరే చెప్తా అని అంటాడు.
రెండో పెళ్లి..
ఇంతలో ఆ పెళ్లిళ్ల బ్రోకర్‌కి ఓ అమ్మాయి కాల్ చేస్తుంది. విడాకులకు అప్లై చేశాం.. నేను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.. ఎవరైనా అబ్బాయి ఉంటే చెప్పండని అడుగుతుంది. ఆ అమ్మాయిని నేను చేసుకుంటాను అని మాధవ అడుగుతాడు. నీకు రెండో పెళ్లి అమ్మాయిని చూశానని మీ నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు.. అయినా నీకు ఆ కర్మ ఎందుకు పట్టింది మాధవ అని అడుగుతాడు. మా ఇంటికి పిల్లని వెతకడం కష్టం అని మీరే అన్నారు కదా.. వాళ్లు అయితే అవన్నీ అడగరు కదా అని పెద్ది అంటాడు. ఇంట్లో వాళ్లని నేను ఒప్పిస్తాను.. అని మాధవ అంటాడు.
బస్టాండ్‌లో చక్రి, మహా, కన్నా..
బస్టాండ్ దగ్గరకు మళ్లీ మహా, చక్రి, కన్నావస్తారు. ఆ అమ్మాయిలు ఇంకా రాలేదేంట్రా అని చక్రి అడుగుతాడు. నీకు తొందర ఉండి.. పని లేక వస్తే.. వాళ్లు కూడా రావాలా? అని మహా తిడుతుంది. అయినా నీకు అంత కంగారు ఏంటి.? అని మహా అడిగితే.. వాడు ఒక అమ్మాయిని ఫిక్స్ అయితే మిగిలిన అమ్మాయిని నేను చూసుకుందాం అని అంటాడు చక్రి. అన్నయ్య.. నువ్వు నాకు కాంపిటీషన్ ఏంటి.. అని కన్నా అంటాడు. ఇంతలో ఇద్దరు అమ్మాయిలు వస్తుంటారు. అదిగోరా ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు అని కన్నాకి చెప్తాడు చక్రి.
మీ అన్న నంబర్ కావాలి..
ఆ ఇద్దరమ్మాయిలు బస్టాండ్‌కి వచ్చి కన్నాని చూస్తుంటారు. ఇద్దరిలో ఒక అమ్మాయి ధైర్యం చేసి ముందుకు వస్తుంది. నీ కోసం వెళ్లి నంబర్ కనుక్కుంటాను అని అంటుంది. నాకు భయం ఎందుకు.. మా నాన్న ఎవరో తెలుసు కదా అని అంటుంది. ఇక కన్నా గాడు కూడా కాస్త ముందుకు వస్తాడు. ఇద్దరూ కాస్త మాట్లాడుకుంటారు. మీరు నన్ను ఏదైనా అడగాలని అనుకుంటున్నారా? అని కన్నా ప్రశ్నిస్తే.. మీ అన్న నంబర్ కావాలి.. అందుకే నీ చుట్టూ తిరుగుతున్నాం అని అంటుంది. దీంతో కన్నా గాడు షాక్ అవుతాడు.