నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

 నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఫస్టియర్ పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషనం నిబంధన ఎత్తేశారు. విద్యార్థులను 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించనున్నారు.

హైలైట్:

నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

హాల్ టికెట్ చూపిస్తే బస్సుల్లో ఫ్రీ జర్నీ

Telangana Inter exams

తెలంగాణ ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. నేడు ఫస్టియర్‌ విద్యార్థులకు పరీక్షలు జరుగనుండగా.. రేపటి నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 9.97లక్షల విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఈ మేరకు 1,495 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు.

విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9.05 లోపు రావాల్సి ఉంటుంది. గతంలో 9.01 వరకే అనుమతి ఇచ్చేవారు. దీని వల్ల కొందరు స్టూడెంట్స్ పరీక్షలు మిస్ అయ్యేవారు. ఈసారి నిమిషం నిబంధన ఎత్తేవేసి.. 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అరగంట ముందే సెంటర్లకు రావాలని చెప్పారు. ఈసారి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ జరిగే ఛాన్స్ లేకుండా.. జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులు పూర్తి 3 గంటలూ పరీక్షా కేంద్రాల్లోనే ఉండాల్సి ఉంటుంది. ముందే పరీక్ష పూర్తి చేసినా.. మధ్యాహ్నం 12 గంటలు అయ్యే వరకూ పరీక్షా కేంద్రంలోనే ఉండాల్సి ఉంటుంది.

ఇక ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు.. అమ్మాయిలు ఆధార్ కార్డ్ చూపించాల్సిన అవసరం లేదు. వారి హాల్ టికెట్ చూపిస్తే చాలు.. వారికి ఉచిత టికెట్ ఇస్తారు. అదనపు ప్రత్యేక బస్సులను వేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పరీక్షల సమయంలో బస్టాండ్స్ దగ్గరే కాకుండా.. విద్యార్థులు ఎక్కడ ఆపినా ఆపాలన్నారు. వారు హాల్ టికెట్ చూపిస్తే చాలని.. పాసులు కూడా అడగొద్దని ఆదేశించారు. ఇక ఇంటర్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలు బాగా రాయాలని స్పెషల్ ట్వీట్ చేశారు.

ఇంటర్‌బోర్డు సమాధాన పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ను ప్రకటించింది. మార్చి 4 నుంచి సంస్కృతం పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుందని చెప్పారు. మార్చి 15నుంచి మొదటి విడత, మార్చి 18నుంచి రెండో విడత, మార్చి 20 నుంచి మూడో విడతలో పరీక్షా పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్‌ రెండో వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *