Podarillu Today మార్చి 30 ఎపిసోడ్: ఆదిని ఉతికారేసిన మహా.. ఐసీయూలో నారాయణ.. అర్ధరాత్రి మాధవతో గాయత్రి
Podarillu Today మార్చి 30 ఎపిసోడ్: ఆదిని ఉతికారేసిన మహా.. ఐసీయూలో నారాయణ.. అర్ధరాత్రి మాధవతో గాయత్రి

Podarillu March 30th Episode: సర్టిఫికేట్స్ అప్లై చేయడానికి మహాతో పాటు నారాయణ కూడా వెంటవెళ్తున్న సంగతి తెలిసిందే. ఎవరూ వద్దని చెప్పినా నారాయణ వెంట రావడంతో మహా.. మాధవకి ఫోన్ చేసి చెప్తుంది. దీంతో నువ్వేం టెన్షన్ పడకమ్మా నేను చూసుకుంటానని మాధవ అంటాడు. వెంటనే విషయం తెలియనట్లుగా మాట్లాడమని చక్రితో ఫోన్ చేయిస్తాడు. హలో ఎక్కడున్నావని చక్రి అంటే.. ఆన్ ది వే టూ యాదగిరి గుట్ట అంటూ ఇంగ్లీష్‌లో మాట్లాడతాడు నారాయణ. అసలు నిన్ను ఎవరు వెళ్లమన్నారని చక్రి ఫైర్ అవుతాడు. అసలు అడ్డగాడిదల్లా నలుగురు ఇంట్లో ఉన్నారు.. ఆడపిల్లని ఇంత దూరం ఒంటరిగా ఎలా పంపిచార్రా.. అందుకే నేను వచ్చానని చెప్పి నారాయణ ఫోన్ కట్ చేస్తాడు. చక్రి ఫ్రస్టేట్ అవుతుండటం చూసి మాధవ ఒక మంచి మాట చెప్తాడు. రేయ్ ఎలాగూ మనం మహాని ఒంటరిగా పంపించకూడదని అనుకున్నాం కదా.. ఎలాగూ నాన్న వెళ్లడం మంచిదే.. నాన్న ఉంటే మహా మీద ఈగ కూడా వాలనివ్వడు.. జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడని మాధవ అంటాడు. దీంతో అవును అదీ నిజమే అని చక్రి కూడా కూల్ అవుతాడు.
శైలు నాన్నకి ఫోన్ చేసిన కేశవ
శైలు నాన్నకి ఫోన్ చేసిన కేశవ
మరోవైపు తనని ఇంట్లో ఇరికించినందుకు శైలజకి ఝలక్ ఇవ్వాలని కేశవ డిసైడ్ చేస్తాడు. దీంతో శైలు నాన్నకి ఫోన్ చేసి కాలేజ్ లెక్చరర్‌ని మాట్లాడుతున్నానంటూ డ్రామా ఆడతాడు. హలో శైలు ఫాదరేనా.. నా పేరు ముంగీస మన్మథరావు.. నేను మీ అమ్మాయి కాలేజ్‌లో లెక్చరర్‌ని.. ఈ మధ్య మీ అమ్మాయి అసలు చదవడం లేదు.. ఎంతసేపు ఫోన్‌లు, రీల్స్.. ఇదే పని.. మీ అమ్మాయిపై మీకు ప్రేమ ఉండటంలో తప్పు లేదు కానీ ఇలా గారాబం చేస్తే తన చదువు అటకెక్కినట్లే.. ఎగ్జామ్స్ కూడా దగ్గరపడ్డాయ్.. ఆ ఫోన్ లాక్కొని బుద్ధిగా చదివించండి.. కాలేజ్‌కి కూడా ఈ మధ్య సరిగా రావడం లేదని కేశవ చెప్తాడు. మొత్తం వినేసి ఫోన్ కట్ చేసి శైలు వంక చూస్తాడు తన తండ్రి.
సారీ చెప్పించుకున్న కేశవ
ఏంటమ్మా.. నువ్వు అసలు చదవడం లేదు.. కాలేజ్‌కి సరిగా రావడం లేదని మీ లెక్చరర్ ఫోన్ చేసి చెప్తున్నారని శైలుని అడుగుతాడు. అలా చెప్పింది ఎవరు నాన్న అంటే ఎవరో ముంగీస మన్మథరావంట అని చెప్తాడు. ఈ మాట వినగానే శైలు ఉలిక్కిపడుతుంది. వామ్మో వీడు ఇరికించినట్లున్నాడని.. కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. నాన్న అంటే అది నేను కాదు మా క్లాస్‌లో మరో శైలజ కూడా ఉంది.. తనకి చేయబోయి మీకు చేశారేమో.. ఉండండి ఇప్పుడే నేను క్లారిటీ ఇపిస్తానని.. తిరిగి కేశవకి కాల్ చేస్తుంది. రేయ్ ఏంట్రా ఇది అని నెమ్మదిగా గుసగుసలాడుతుంది. నన్ను ఇరికించావ్ కదే బుస్సు.. ఎలా ఉంది ట్రీట్‌మెంట్ అని కేశవ అంటాడు. ప్లీజ్ ఫోన్ నాకు కాదు కే శైలజకి చేయబోయి మీకు చేశానని మా నాన్నకి చెప్పు.. అని బతిమాలుతుంది. సరే అయితే సారీ చెప్తే చెప్తా అంటాడు. దీంతో శైలు సారీ చెప్తుంది. ఇక శైలు చెప్పమన్నట్లే కేశవ కూడా ఫొన్‌లో చెప్తాడు.
ఈయన ఎవరు?
యాదగిరి గుట్ట వెళ్లేదారిలో డ్రైవర్‌ని ఓ ఆట ఆడుకుంటాడు నారాయణ. రేయ్ ఆ పాట పెట్టు.. ఈ పాట పెట్టు.. అంటూ విసిగిస్తాడు. ఇక దారిలో కారు ఆపుచేసి బిర్యానీ తెచ్చి పెట్టు అంటూ పనులు చెప్తాడు. కాసేపు నారాయణే డ్రైవింగ్ కూడా చేస్తాడు. ఇక మొత్తానికి కాలేజ్‌కి చేరుకుంటారు. కోడలు పిల్లు నువ్వు వెళ్లి త్వరగా పని పూర్తి చేసుకొని రా.. ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చెయ్ అని నారాయణ చెప్తాడు. ఇంతలో మహా ఫ్రెండ్ వస్తుంది. తనని పలకరించగానే ఈయన ఎవరని అడుగుతుంది. కానీ మహా ఏం మాట్లాడకుండా రా లోపలికి వెళ్దామని తీసుకెళ్లిపోతుంది. ఏంటే ఏదో ఉద్యోగం చేయాలి.. మరో స్థాయికి వెళ్లాలని ఏవేవో చెప్పేదానివి.. ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నావని అడుగుతుంది ఫ్రెండ్. అదంతా ఓ పెద్ద కథ తర్వాత చెప్తాలే అంటుంది.
ప్యూన్ అతి వినయం
లోపలికి వెళ్లగానే మహాని చూసి ప్యూన్ వస్తాడు. ఏంటి మహాలక్ష్మి గారు ఇలా వచ్చారని అడుగుతాడు. ఇలా సర్టిఫికేట్లు పోయాయ్.. అప్లై చేద్దామని వచ్చా అంటుంది. రండి అని చెప్పి ఆఫీసు స్టాఫ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక వాళ్లు సర్టిఫికేట్లు పోవడమేంటి.. మొన్నే కదా మీ డిగ్రీ అయింది.. ఎలా పోయాయని అడుగుతారు. అంటే ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పోయాయని మహా అంటుంది. సరే పేపర్ యాడ్ ఇచ్చారా.. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారా.. ఎఫ్ఐఆర్ కాపీ ఉందా అని అడుగుతారు. ఇవేం నాకు తెలియదని మహా అనడంతో.. ఇదేనమ్మా ప్రాసెస్.. సరే ముందు అయితే ఒక పేపర్ ఇస్తా అది ఫిల్ చేయండి.. అంటారు.
ఆదికి ఫోన్ చేసి చెప్పిన అటెండర్
మరోవైపు మహా కాలేజ్‌కి వచ్చిందనే విషయం ఆదికి ఫోన్ చేసి చెప్పేస్తాడు అటెండర్. సార్.. మీరు ఇచ్చిన డబ్బులకి ఇన్నాళ్లకి మీకు న్యాయం చేయబోతున్నాను.. మీ చెల్లెలు మహాలక్ష్మి ఎప్పుడైనా కాలేజ్‌కి వస్తే చెప్పమని చెప్పారు కదా.. ఇప్పుడు కాలేజ్‌లోనే ఉంది అంటాడు. అవునా ఎందుకొచ్చిందని ఆది అడిగితే అదే సార్ సర్టిఫికేట్లు అప్లై చేయడానికి వచ్చారట అంటాడు. ఓకే తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని ఆది అడుగుతాడు. లేదు సార్.. ఇక్కడే ఉంటే తన ఫ్రెండ్ ఒకమ్మాయి ఉంది అంతే అంటాడు అటెండర్. సరే నేను వచ్చేంత వరకూ వాళ్లని ఏదో ఒకటి చెప్పి ఆపు అని ఆది బయలుదేరతాడు.
ఏరా కళ్లు కనబడట్లేదా?
ఇక మహా కాలేజ్ వాళ్లు ఇచ్చిన ఒక రిసీప్ట్ తీసుకొని బయటికి వస్తుంది. ఇంతలో ఆది వేగంగా కారు తీసుకొచ్చి మహాకి ఒక్క ఇంచు దూరంలో బ్రేక్ ఇస్తాడు. దీంతో మహా బెదిరిపోతుంది. పక్కనే ఉన్న నారాయణ.. రేయ్ ఎవడ్రా ఆడు.. కళ్లు కనిపించట్లేదా అని తిడతాడు. కారులో నుంచి ఆది దిగగానే మహా షాకవుతుంది. ఏంటే ఏదో సాధించేంత వరకూ ఈ ఊరులోనే అడుగుపెట్టనని చెప్పావ్.. మళ్లీ ఇలా వాలావ్ ఏంటి అంటాడు. నేను సాధిస్తానని చెప్పా.. సాధిస్తా.. అయినా నేను అన్నది మీ ఇంట్లో అడుగుపెట్టనని ఈ ఊరిలో కాదని మహా అంటుంది. అయినా ఎంత ధైర్యం ుంటే మళ్లీ ఇక్కడికి వస్తావే అని ఆది అంటాడు.
నేను ఉన్నారా ఆపడానికి?
ఆది మాటలకి మహా రియాక్ట్ కాదు. దీంతో ఆది ఇంకా రెచ్చిపోతాడు. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా.. ఎప్పుడు నిన్ను తీసుకెళ్లి ఇంట్లో పడేద్దామా అని ఎదురుచూస్తున్నానే.. ఇన్నాళ్లకి తిరిగొచ్చావ్.. ఇప్పుడు నిన్ను తీసుకెళ్లకుండా ఆపేదెవరో నేనూ చూస్తానంటాడు. రేయ్ నువ్వు ఇంకా మారలేదా.. నిన్ను అంటూ కొట్టడానికి మహా చేయి ఎత్తుతుంది. చేయి పట్టుకొని ఆది లాక్కెళ్లడానికి ట్రై చేస్తాడు. దీంతో ఇద్దరి మధ్యలోకి వెళ్లి నారాయణ నిల్చుంటాడు. రేయ్ నేనుండగా తనని ఎలా తీసుకెళ్తావో నేనూ చూస్తా అంటాడు. ఎవడ్రా నువ్వు.. ఆ చక్రి గాడి నాన్నవే కదా..అయినా పెళ్లాన్ని హత్య చేసినోడితో నాకు మాటలేంట్రా నువ్వు పక్కకి పో అంటాడు.
పేపర్ చించేసిన ఆది
అవునురా నువ్వు అన్నది నిజమే.. కానీ నేను ఎప్పుడూ తోడబుట్టిన దాని మీద చేయి మాత్రం ఎత్తలేదు.. అది నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టినా కూడా భరిస్తూనే ఉన్నాను.. కానీ నువ్వు సొంత చెల్లిని ఇలా ఇబ్బంది పెడుతున్నావ్.. అంటూ ఆదిని తిడతాడు. దీంతో నువ్వేంట్రా నాకు చెప్పేదని నారాయణని తోసేస్తాడు. దీంతో నారాయణ కిందపడిపోయేసరికి మహా పైకి లేపి రేయ్ ఆది.. పెద్దాయన మీద చేయి చేసుకుంటావా అసలు నువ్వు మనిషివేనా అంటుంది. నిన్ను ఇలా కాదే అని మహా చేతిలో ఉన్న రిసీప్ట్ పేపర్ తీసుకొని చించిపారేస్తాడు ఆది. దీంతో మహా కోపంతో లాగి ఒక్కటిస్తుంది.
నారాయణని పొడిచేసిన ఆది
మహా కొట్టగానే ఆది ఇంకా రాక్షసంగా ప్రవర్తిస్తాడు. నన్నే కొడతావే రా.. నిన్ను ఇప్పుడే ఇంట్లో పడేస్తా రా.. అంటూ చేయి పట్టుకొని లాక్కెళ్లబోతాడు. దీంతో వెంటనే నారాయణ మధ్యలోకి వెళ్లి మహాని విడిపించి కారు ఎక్కిస్తాడు. నువ్వు కూర్చో అమ్మా నేను చూసుకుంటాను వీడి సంగతి అంటాడు. అలా ఆది-నారాయణ మధ్య తోపులాట జరుగుతుంది. మహా దగ్గరికి వెళ్లడానికి నారాయణ అడ్డుపడుతుండటంతో ఆది ఫైర్ అవుతాడు. వెంటనే కారు ఫ్రంట్ సీటులో ఉన్న ఫ్రూట్స్ కట్ చేసే కత్తి తీసుకొని నారాయణ పొట్టలో పొడిచేస్తాడు ఆది. దీంతో నారాయణ రక్తస్రావం అవుతుంది.
ఆదిని వాయించేసిన మహా
ఇక ఈ సీన్ చూడగానే మహా మహంకాళి అయిపోతుంది. కారు దిగి ఆది మీదకి దూసుకెళ్తుంది. రేయ్ ఎంతపని చేశావురా నిన్ను అంటూ ఆది చెంపలు వాయించేస్తుంది. మహా నేను చెప్పేది విను అంటుంటే ఏంట్రా వినేది అంటూ లాగి కొడుతూనే ఉంటుంది. ఇక అప్పటికే చుట్టూ జనాలు చేరిపోతారు. నారాయణకి బ్లడ్ పోతుండటం చూసి మహా వెళ్లి తన చున్నీతో కట్టు కడుతుంది. ఇక సార్ ఇక్కడే ఉంటే మర్డర్ కేసు అవుతుంది పారిపోండని ప్యూన్ సలహా ఇవ్వడంతో ఆది వెంటనే కారు తీసుకొని వెళ్లిపోతాడు. అక్కడున్న స్టూడెంట్స్ ఆపడానికి ట్రై చేస్తారు కానీ ఆది పారిపోతాడు.
ఇప్పుడైనా అర్థమైందా అమ్మా నేను ఎందుకొచ్చానో
ఇక కారు డ్రైవర్‌ని తిట్టి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని నారాయణని కారులో ఎక్కిస్తుంది మహా. ఇక వెళ్లేదారిలో నారాయణ కొంచెం మాట్లాడతాడు. సారీ అండి నా వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.. నన్ను క్షమించండి అంటుంది మహా. అదేం లేదమ్మా.. ఉంటే ఉంటాను పోతే పోతాను .. అయినా ఇది చిన్న పోటే ఏం కాదులే.. అయినా నేను ఎందుకు నీతో పాటు వచ్చానో ఇప్పుడైనా అర్థమైందా అని నారాయణ అంటాడు. అర్థమైందని తలాడిస్తుంది మహా. ఇక ఆసుపత్రికి తీసుకెళ్లగానే నారాయణని ఐసీయూలో పెడతారు. ఇక ఈ విషయం చెప్దామని చక్రికి కాల్ చేస్తుంది మహా. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.
మనం ఎక్కడికైనా లేచిపోదాం బావా
తరువాయి భాగం ప్రోమోలో అలారం పెట్టుకొని మరి లేచి నారాయణకి ట్యాబ్లెట్స్ ఇస్తుంది మహా. అయితే ఆ సమయంలో మాధవ కనిపించకపోయేసరికి ఎక్కడా పెద్ది అని చూస్తుంది. వెనకాల పెరట్లో మాధవని గట్టిగా పట్టుకొని గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. బావా పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు.. నాకు ఏం చేయాలో తెలియడం లేదు.. నువ్వే ఏమైనా చెయ్ అంటుంది. మనం కలవడం అనేది ఇక జరగని పని గాయత్రి అని మాధవ అంటాడు. అలా అయితే మనం ఎక్కడికైనా లేచిపోదాం బావా అంటుంది. ఇక ఇదంతా మహా చూస్తుంది. మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. (Jio Hotstar and Star Maa)