Podarillu Today మార్చి 17 ఎపిసోడ్: ఆధార్ కార్డ్ లేకుండా మీ పెళ్లి ఎలా చేశారు.. లాయర్ ప్రశ్నతో మహాకి డౌట్.. కానిస్టేబుల్‌ని కాకాపట్టిన చక్రి
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో మహా-చక్రి ఇద్దరూ లాయర్‌ని కలుస్తారు. అయితే లాయర్ అడిగిన ఏ ప్రశ్నకి మహా సరైన సమాధానం ఇవ్వదు. అసలు విషయం చెప్పకుండా మాకు డైవర్స్ కావాలంటూ మహా అడగటంతో లాయర్ కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. చివరికి అంతా కలిసి ఆధార్ కార్డ్ వరకూ వస్తుంది. తన దగ్గర ఆధార్ లేకపోవడంతో మహా ఏం చేయలేక వెనక్కి వచ్చేస్తుంది. ఇలా
ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం.

ఆధార్ కార్డ్ లేకుండా మీ పెళ్లి ఎలా చేశారు.. లాయర్ ప్రశ్నతో మహాకి డౌట్.. కానిస్టేబుల్‌ని కాకాపట్టిన చక్రి
Podarillu March 17th Episode: హారిక ఇచ్చిన సలహా మేరకు లాయర్ దగ్గరికి చక్రిని తీసుకొని వెళ్తుంది మహాలక్ష్మి. అక్కడికి వెళ్లాక పక్కకి వచ్చి వదినకి కాల్ చేస్తుంది. ఏమైంది.. లాయర్‌ని కలిశారా.. ఏమన్నారని హారిక ఆత్రుతగా అడుగుతుంది. ఇంకా కలవలేదు వదిన ఇప్పుడే వచ్చాను.. కలిశాక ఏమన్నారో చెప్తానని మహా అంటుంది. ఇక లోపలికి వెళ్లగానే చెప్పండని లాయర్ అడుగుతాడు. నా పేరు మహాలక్ష్మి అని అనగానే సరే ఇతను మీకు ఏమవుతాడని లాయర్ అడుగుతాడు. దానికి ఏం చెప్పాలో తెలియక మహా సైలెంట్‌గా ఉంటుంది.. చివరికి ఇతను పేరు చక్రి అంటుంది. నేను అతని పేరు అడగలేదమ్మా అతను మీకేమవుతాడని అడిగా అంటాడు. మహా ఏం చెప్పలేక మాకు విడాకులు కావాలి అంటుంది. అతడ్ని నీ భర్త అని చెప్పడానికి కూడా నువ్వు ఇష్టపడటం లేదంటే అతను అంత చెడ్డవాడా అని లాయర్ అడుగుతాడు. అయ్యో అలాంటిదేం లేదు.. అతనికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అంటుంది. మరి గృహ హింస లాంటిదేమైనా అని అడుగుతాడు. లేదులేదు అవన్నీ ఏం కాదు.. మాకు విడాకులు కావాలి అంటుంది.
ఏంటి రెండు నెలలకే విడాకులా?
ఏంటి రెండు నెలలకే విడాకులా?
మాహా మాటలకి లాయర్‌కి ఏం చెప్పాలో అర్థం కాదు. సరే మీ పెళ్లయి ఎన్నేళ్లయిందని అడుగుతాడు. ఎన్నేళ్లా.. మాకు పెళ్లయి రెండు నెలలే అయింది అంటుంది. ఏంటమ్మా పెళ్లి అంటే తమాషాగా ఉందా.. రెండు నెలలకే విడాకులా.. అసలు ఏంటి మీ ప్రాబ్లమ్ అని అడుగుతాడు. చక్రి ఏదో చెప్పడానికి ట్రై చేస్తే మహా మీరు ఆగండని ఆపేస్తుంది. అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా చెప్పనివ్వమ్మా అని లాయర్ అంటే ఏం లేదని మహా అంటుంది. పెళ్లయి కనీసం ఏడాది పూర్తయితే తప్ప మనం విడాకులు అప్లై చేయడానికి బాగోదని లాయర్ అంటాడు. అవన్నీ ఎందుకు మ్యూచువల్ డైవర్స్‌కి (పరస్పర అంగీకారంతో) అప్లై చేయొచ్చు కదా అని మహా అంటుంది.
ఆధార్ కార్డ్ అడగ్గానే
మ్యూచువల్‌కి అప్లై చేయొచ్చు బానే ఉంది కానీ మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటో చెప్పమ్మా అని లాయర్ అడుగుతాడు. మా ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ లేదని చెప్తుంది. అలా అయితే కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తానని లాయర్ అంటాడు. అవేం వద్దు మాకు విడాకులు ఇప్పిస్తే చాలు లేదంటే వేరే లాయర్‌ని చూసుకుంటామని అంటుంది. దీంతో సరే అయితే మీ ఆధార్ కార్డులు ఇవ్వండని లాయర్ అంటాడు. ఇది వినగానే మహా సరిపోయింది అన్నట్లు ఫేస్ పెడుతుంది. చక్రి వెంటనే ఆధార్ కార్డ్ ఇస్తాడు. నా దగ్గర ఆధార్ లేదని మీకు తెలుసు కదా మరి అదే విషయం చెప్పొచ్చుగా అంటుంది మహా. నన్ను అసలు మీరు మాట్లాడనిస్తే కదా చెప్పడానికి అంటాడు చక్రి.
ఆధార్ కార్డ్ లేకుండా అసలు పెళ్లి ఎలా చేశారు?
ఆధార్ కార్డ్ లేకుండా అసలు పెళ్లి ఎలా చేశారు?
ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఆధాక్ కార్డ్ తీసుకోవడం మర్చిపోయా అని మహా అంటుంది. అంటే మీ పెళ్లి ఎక్కడ జరిగింది.. ఏది మీ పెళ్లి సర్టిఫికేట్ చూపించండి అంటూ లాయర్ అడుగుతాడు. సర్టిఫికేట్ చూసి ఓహో మీ పెళ్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిందా..? మరి పోలీసులు ఆధార్ కార్డ్ లేకుండా అసలు పెళ్లే చేయరుగా.. అని లాయర్ అడుగుతాడు. ఈ మాటతో చక్రి ఖంగుతింటాడు. ఎందుకంటే మహాకి తెలియకుండా చక్రినే ఆరోజు ఆధార్ కార్డ్ నంబర్, ఫొటో ఇస్తాడు. దీంతో మహాకి అనుమానం వస్తుంది. అదేంటండీ నన్ను చూస్తారు.. ఆరోజు మనం ఉన్న హడావిడిలో అసలు ఆధార్ అడగలేదని అంటాడు. ఏం మాట్లాడుతున్నారయ్యా.. ఆధార్ లేకుండా పెళ్లి చేయడానికి ఈ అమ్మాయి మైనర్, మేజర్ అని ఎలా తెలుస్తుంది.. అంటూ లాయర్ అడుగుతాడు. మొత్తానికి ఆధార్ తీసుకురండి అప్పుడు చూద్దామని లాయర్ అంటాడు.
ఎవరో ఆధార్ కార్డ్ ఇచ్చారు?
ఎవరో ఆధార్ కార్డ్ ఇచ్చారు?
బయటికి రాగానే చక్రిపై అనుమానంగా చూస్తుంది మహా. చక్రి మాత్రం విడాకుల మ్యాటర్ తప్పినందుకు మహా చూడకుండా తెగ డ్యాన్సులేస్తాడు. ఆయన చెప్పినదాన్ని బట్టి మీకేం అనుమానం రావడం లేదా అని మహా అంటుంది. ఏంటండీ దేని గురించని చక్రి అంటాడు. ఆధార్ కార్డ్ లేకపోతే కనీసం హాస్టల్‌లో రూమ్‌యే ఇవ్వడం లేదు.. అలాంటిది పోలీసులు మన పెళ్లి ఎలా చేసుంటారు.. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఎవరో ఇచ్చారు.. అదెవరో తెలుసుకోవాలని మహా అంటుంది. మీ నాన్న, అన్నయ్య లేదా ఆ పిలకోడు ఎవరో ఇచ్చుంటారని చక్రి అంటాడు. అవును మరి మా కూతురికి పెళ్లి చేయండని మా వాళ్లే ఇస్తారా ఆధార్ అంటూ మహా అంటుంది. సరే సరే నాకు ఒక ట్రిప్ ఉంది.. నేను వెళ్లాలి.. మీరు ఇంటికెళ్లండని చెప్పి చక్రి బయలుదేరతాడు.
మా దేవుడు నువ్వేనయ్యా
మా దేవుడు నువ్వేనయ్యా
పోలీస్ స్టేషన్‌లో దగ్గరుండి తమ పెళ్లి చేయించిన కానిస్టేబుల్ ధర్మేంద్రని కలవడానికి చక్రి వెళ్తాడు. ఏంటయ్యా ఏదో అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావని కానిస్టేబుల్ అడుగుతాడు. ఇక చక్రి మాములుగానే పులిహోర కలుపుతాడు. అవసరం ఉందంటే వదులుతాడా.. మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం వచ్చావయ్యా అంటూ ధర్మేంద్రని ఆకాశానికి ఎత్తేస్తాడు. ఏంటయ్యా నేను నీకు దేవుడ్నా అని అడిగితే మరి దగ్గరుండి నా పెళ్లి చేయించారు.. పుట్టబోయే బిడ్డకి మీ నాన్నగారి పేరు పెట్టుకుంటామని మీకు మాటిచ్చాను.. అది నెరవేర్చలేకపోతున్నందుకు బాధగా ఉంది సార్ అంటాడు. ఏమైందయ్యా ఏంటి ప్రాబ్లమ్ అని కానిస్టేబుల్ అడుగుతాడు.
నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటా?
నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటా?
నా భార్య విడాకులు అడుగుతుంది సార్ అని చక్రి అనగానే కానిస్టేబుల్ షాకవుతాడు. అదేంటయ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అప్పుడే విడాకులా అంటాడు. నువ్వు మీ ఆవిడ్ని బాగా చూసుకోవడం లేదా.. వేధిస్తున్నావా అని అడుగుతాడు. అయ్యో అలాంటిదేం లేదు సార్.. వాళ్ల అమ్మానాన్న తనతో ప్రేమగా మాట్లాడి ఇంటికి వచ్చేయాలని నాకు విడాకులు ఇవ్వాలని ఆ అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేస్తున్నారని చక్రి చెప్తాడు. అవునా మరి ఆ అమ్మాయి ఏమంటుందని అడుగుతాడు. అమ్మ ప్రేమ కదా సార్ కరిగిపోతుంది అంటాడు. సరే ఇప్పుడు మరి నన్ను ఏం చేయమంటావని కానిస్టేబుల్ అడుగుతాడు. మీరే నయానో భయానో ఆ అమ్మాయిని విడాకులకి అప్లై చేయకుండా ఫోన్ చేసి ఆపాలని చక్రి చెప్తాడు. దీంతో సరే నేను చూసుకుంటానంటూ ధర్మేంద్ర అభయం ఇస్తాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.