Podarillu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: తాంబూలాలతో తాయారు ఇంటికి మహాలక్ష్మి.. గాయత్రి-మాధవ పెళ్లి కోసం రిస్క్.. అద్గదీ ధైర్యం అంటే

 Podarillu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: తాంబూలాలతో తాయారు ఇంటికి మహాలక్ష్మి.. గాయత్రి-మాధవ పెళ్లి కోసం రిస్క్.. అద్గదీ ధైర్యం అంటే

Podarillu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: తాంబూలాలతో తాయారు ఇంటికి మహాలక్ష్మి.. గాయత్రి-మాధవ పెళ్లి కోసం రిస్క్.. అద్గదీ ధైర్యం అంటే

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో నారాయణని బెదిరించి మరీ ట్యాబ్లెట్స్ వేయిస్తుంది మహాలక్ష్మి. అసలు ఎవడికి లొంగని నారాయణ.. మహాకి భయపడటం చూసి కొడుకులు కూడా అవాక్కవుతారు. మరోవైపు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని.. ఎక్కడికైనా లేచిపోదామని మాధవతో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది గాయత్రి. అయితే అర్ధరాత్రి జరిగిన ఈ సీన్ మహా కంట పడుతుంది.దీంతో ఎలాగైనా మాధవ-గాయత్రిలకి పెళ్లి చేయాలని మహా డిసైడ్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం.

Podarillu Today
తాంబూలాలతో తాయారు ఇంటికి మహాలక్ష్మి.. గాయత్రి-మాధవ పెళ్లి కోసం రిస్క్.. అద్గదీ ధైర్యం అంటే
తాంబూలాలతో తాయారు ఇంటికి మహాలక్ష్మి.. గాయత్రి-మాధవ పెళ్లి కోసం రిస్క్.. అద్గదీ ధైర్యం అంటే
Podarillu April 01st Episode: తమ పెళ్లి ఫొటో ఫోన్‌లో చూసి చక్రి తెగ మురిసిపోతుంటాడు. అయితే అప్పుడే వెనకాల నుంచి మహా వస్తుంది. ఎక్కడ ఫొటో చూసేసిందోనని చక్రి కాస్త భయపడతాడు. ఏంటి నన్ను చూసి అంత భయపడుతున్నారని మహా అడిగితే మీది మాములు నోరు కాదు కదా.. ఆ నోటికి భయపడని వాళ్లు ఈ ఇంట్లోనే లేరని చక్రి సరదాగా అంటాడు. అంటే నేను గయ్యాళి గంపననా మీ ఉద్దేశం అంటూ మహా ఫైర్ అవుతుంది. అంత కాదు కానీ ఎంతో కొంత అంటాడు చక్రి. అయినా మా మీద అరిచేసి మరీ సర్టిఫికేట్ల కోసం వెళ్లారు కదా ఇంతకీ ఇచ్చారా అని చక్రి అడుగుతాడు. ఏంటి ఇచ్చేది ముందు సర్టిఫికేట్లు పోయాయని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్లాలట.. అప్పుడే ఇస్తారట అంటుంది. అయితే కాలేజ్ వాళ్లు ఇచ్చిన రిసీప్ట్ కాపీని ఆది చించేసిన సంగతి మహాకి అప్పుడే గుర్తొస్తుంది. ఈ విషయం చక్రికి చెప్పగానే.. ఓహో అప్పుడు కాల్చేస్తే ఇప్పుడు చించేశారన్న మాట.. అందుకే అన్నిసార్లు నేను వస్తానని చెప్పింది.. కానీ మీరు మాట వినరు కదా అంటూ చక్రి మళ్లీ అదే చెప్తాడు.

నారాయణని బెదిరించి మరీ

నారాయణని బెదిరించి మరీ

నారాయణని బెదిరించి మరీ
మరోవైపు రాత్రి అల్లారం పెట్టుకొని మరీ మహాలక్ష్మి లేస్తుంది. నారాయణకి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్లు, వాటర్ బాటిల్ పట్టుకొని బయటికెళ్తుంటే మాధవ నిద్రలేస్తాడు. ఏంటమ్మా మహా.. ఈ టైమ్‌కి లేచావ్.. ఫోన్ ఏదో సౌండ్ వచ్చింది ఎవరైనా కాల్ చేశారా అని అడుగుతాడు. లేదు పెద్ది.. మీ నాన్నగారికి ఆరు గంటలకి ఒకసారి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి అందుకే అలారం పెట్టానంటుంది. నువ్వెందుకమ్మా నాకు చెప్పాల్సింది కదా నేను ఇచ్చేవాడ్ని అంటాడు. లేదులే పెద్ది మీరు పగలంతా పని చేసి వస్తారు.. రాత్రి నిద్రలేకపోతే ఇబ్బందిగా ఉంటుంది అంటుంది. ఇక నారాయణ దగ్గరికెళ్లి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి లేవండి అంటుంది. నాకేం వద్దంటూ నారాయణ బెట్టు చేస్తాడు. మహా గట్టిగా చెప్పేసరికి కాదనలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు. ఇక నలుగురు కొడుకులు ఈ సీన్ చాటుగా చూసి తెగ నవ్వుకుంటారు.

వచ్చే ముహూర్తానికే చేసేద్దాం
వచ్చే ముహూర్తానికే చేసేద్దాం

వచ్చే ముహూర్తానికే చేసేద్దాం
ఇంకోవైపు అర్ధరాత్రి ఇంటికొస్తాడు పురుషోత్తం. ఏంటయ్యా ఇప్పటివరకూ వియ్యాలవారి ఇంట్లోనే ఉన్నావా అని తాయారు అడుగుతుంది. అవునే.. అబ్బాయి కూడా ఉన్నాడు.. మన గాయత్రి అంటే పడి చస్తున్నాడు.. అయితే వాళ్లు మాత్రం ఒకటే మాట మీద ఉన్నారు.. అబ్బాయికి సెలవులు తక్కువ.. కనుక వచ్చే ముహూర్తానికే పెళ్లి జరిగిపోవాలంటున్నారని పురుషోత్తం చెప్తాడు. అదే మంచిదయ్యా.. నువ్వు ఎలాగూ బంగారం తీసుకొచ్చావ్.. ఇన్నాళ్లూ కష్టపడి దాని పెళ్లి కోసం డబ్బులు కూడబెట్టాం.. మా అన్నయ్యని అడిగితే 2-3 లక్షలు సర్దుతాడు.. ఇంకేం కావాలని తాయారు అంటుంది. అవును నిజమే అని పురుషోత్తం అంటాడు. అది బానే ఉందా మళ్లీ ఆ మాధవ గాడి పేరు ఎత్తింతా.. ఈసారి అలాంటిదేమైనా చేసిందంటే దాన్ని చంపేస్తానని పురుషోత్తం అరుస్తాడు. అయితే ఇదంతా చాటుగా గాయత్రి వింటుంది.

నిన్ను విడిచి బతకలేను బావా

నిన్ను విడిచి బతకలేను బావా
కాసేపటికి మహా మళ్లీ ట్యాబ్లెట్స్ ఇచ్చేందుకు లేస్తుంది. నారాయణకి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి లోపలికి వెళ్తుంటే మాధవ కనిపించడు. దీంతో పెద్ది ఈ టైమ్‌కి ఎక్కడికి వెళ్లాడా అని మహా అనుకుంటూ పెరటి డోరు ఓపెన్ చేస్తుంది. అక్కడ గాయత్రి-మాధవ మాట్లాడుకుంటూ ఉంటారు. బావా.. వచ్చే ముహూర్తానికే పెళ్లి చేసేయాలని మా వాళ్లు డిసైడ్ అయ్యారు.. అంటే ఎన్నో రోజులు లేదు బావా.. అసలు నేను నిన్ను విడిచి బతకలేను.. ఏదో ఒకటి చెయ్ బావా అని గాయత్రి కన్నీళ్లతో వేడుకుంటుంది. చిన్ననాటి నుంచి నిన్ను ఇష్టపడుతూనే ఉన్నాను.. నువ్వే నా భర్తవని అనుకుంటూ ఉన్నాను.. ఇప్పుడే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని నన్ను నేను, అతన్ని కూడా మోసం చేయలేనని గాయత్రి అంటుంది.

త్యాగం తప్ప ఇంకేం చేయలేను

త్యాగం తప్ప ఇంకేం చేయలేను
గాయత్రి మాటలకి మాధవ కూడా ఎమోషనల్ అవుతాడు. ఏం చేయనే.. చిన్నప్పటి నుంచి నేను కూడా నువ్వు నా సొంతమనే అనుకున్నాను.. కానీ మన ప్రేమతో పాటు మీ ఇంట్లో వాళ్లు మాపై పగ కూడా పెంచుకున్నారు.. ముఖ్యంగా మీ అమ్మకి నన్ను అల్లుడిగా చేసుకోవడం అసలు ఇష్టం లేదు.. చూశావుగా మొన్న నువ్వు నాతో మాట్లాడిన దానికే మా అందరినీ పోలీస్ స్టేషన్‌లో పెట్టించారు.. ఇప్పుడు మనం ఏమైనా చేస్తే ఏమవుతుంది.. నువ్వే ఊహించు.. నా కోసం నా తమ్ముళ్లని నేను ఇబ్బంది పెట్టలేను.. నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకొని నిన్ను త్యాగం చేయడం తప్ప ఇంకేం చేయలేనని మాధవ అంటాడు.

మనం లేచిపోదాం బావా

మనం లేచిపోదాం బావా
అంటే నువ్వు ఇంకేం చేయలేవా బావా.. మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటుంది. లేదు గాయత్రి.. మహా అలా చేసినందుకు ఇప్పటికీ వాళ్ల ఇంట్లో వాళ్లు మాపై పగ పెంచుకున్నారు.. తరుముతూనే ఉన్నారు.. నాన్నని చంపేంత పని చేశారు.. మనం కూడా అదే పని చేస్తే.. మీ అమ్మ నిన్ను చంపేస్తుంది.. కనుక అలాంటి పనులేం వద్దు.. నువ్వు ఇక ఈ ఇంటికి రావద్దు.. ఇదే మనం చివరిసారిగా కలిసే రోజు కావాలి.. నా మాట విని.. నువ్వు మనసు రాయి చేసుకో.. ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేదనుకుంటానని మాధవ ఎమోషనల్ అవుతాడు. ఇక ఈ సీన్ చూసి మహా కూడా బాధపడుతుంది.

సైకిల్‌కి తాళం వేసిన మహా

సైకిల్‌కి తాళం వేసిన మహా
ఉదయం కాగానే ఆరుబయటికి వచ్చి చూసేసరికి నారాయణ మంచం మీద కనిపించడు. ఇదేంటి ఈ మనిషి ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్లాడా అని మహా చూస్తుంది. ఇంతలో నారాయణ నోటిలో బీడీ పెట్టుకొని సైకిల్ తొక్కుతూ వస్తాడు. ఏంటి మాస్టారూ ఎక్కడికి పొద్దున్నే అలా దయచేశారని మహా వెటకారంగా అడుగుతుంది. ఎక్కడికెళ్తానమ్మా అలా ఊరికే సైకిల్ తొక్కుతూ వెళ్లి టీ తాగి వచ్చానంటాడు. ఆ టీ ఏదో నన్ను అడిగితే నేను పెట్టిస్తాను కదా.. ఆ పచ్చి దెబ్బతో అలా బయటికెళ్లాలా సైకిల్ మీదా అని మహా తిడుతుంది. ఓయ్ ఏంటి నన్నే కంట్రోల్ చేద్దామనుకుంటున్నావా అని నారాయణ అంటాడు. కంట్రోల్ చేయడం కాదు చేశాను కూడా.. ఇక సైకిల్ మీద ఎలా వెళ్తారో చూస్తానంటూ సైకిల్‌కి తాళం వేసి లోపలికి వెళ్లిపోతుంది మహా.

మీరు ముగ్గురూ ఇంట్లోనే ఉండండి మాట్లాడాలి

మీరు ముగ్గురూ ఇంట్లోనే ఉండండి మాట్లాడాలి
లోపలికి వెళ్లగానే ముగ్గురు తమ్ముళ్లూ హాయిగా టిఫిన్ చేస్తూ ఉంటారు. అది చూసి మహా అరుస్తుంది. ఏంట్రా నిన్ను పరీక్షలు అయ్యేవరకూ ఇడ్లీ మాత్రమే కదా తినమని చెప్పాను.. ఈ దోశలు తింటే మత్తుగా ఉంటుంది.. ఇంకేం చదువుతావని కన్నాని తిడుతుంది. ఇంతలో నీకు కూడా టిఫిన్ ఇచ్చేయనా మహా అంటాడు మాధవ. ఛ నేను వీళ్లలో గబ్బూస్ కాదుగా పెద్ది.. నేను స్నానం చేసే తింటాను అంటుంది. చూశావా అన్నయ్య నేను స్నానం చేసే తింటానని చెప్పా.. నువ్వే చల్లారిపోతాయ్ తినేమని చెప్పావ్.. చూడు గబ్బూస్ అంటుంది అంటూ కేశవ అంటాడు. ఓయ్ ఏంటి నోరు లేస్తుందని మహా అడిగేసరికి లేదు లేదు అమ్మ ఉంటే ఇలానే అనేదిలే అంటాడు కేశవ. సర్లే కానీ మీరు ముగ్గురూ ఎక్కడికీ వెళ్లకండి మాట్లాడాలని చెప్తుంది మహా.

పెద్ది- గాయత్రికి మనం పెళ్లి చేయాలి

పెద్ది- గాయత్రికి మనం పెళ్లి చేయాలి
ఇక మాధవ పనికి వెళ్లిపోయిన తర్వాత ముగ్గురు తమ్ముళ్లని పెరట్లోకి తీసుకెళ్లి మహా మాట్లాడుతుంది. రాత్రి జరిగినదంతా చెప్తుంది. అసలు రాత్రి వాళ్లిద్దరూ మాట్లాడుకున్నది చూస్తే నా గుండె బరువెక్కిపోయింది. పెద్దికి గాయత్రి అంటే ఎంత ఇష్టమో నిన్న రాత్రే తెలిసింది. అలాంటి వాళ్లని విడదీయడం కరెక్ట్ కాదు.. వాళ్లని కలపడానికి మనం ఏదైనా చేయాలి అంటుంది. వాళ్లకి ఒకరంటే ఒకరికి ఇష్టమని మాకు కూడా తెలుసండి.. కానీ మా అత్తయ్య ఈ పెళ్లికి అసలు ఒప్పుకోదు.. అదే వచ్చిన చిక్కు.. పోనీ మేము బలవంతంగా చేసినా మాపైన మళ్లీ పోలీసు కేసు పెడుతుంది అంటాడు చక్రి. మరి దీనికి వేరే మార్గం లేదా అని మహా అంటే.. ఉంది మా అత్తయ్యని లేపేయడమే అంటాడు చక్రి. ఇది వినగానే అందరూ అవాక్కవుతారు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.

తాంబూలాలు తీసుకొని తాయారు ఇంటికి

తాంబూలాలు తీసుకొని తాయారు ఇంటికి
తరువాయి భాగం ప్రోమోలో.. ముందు మన పెద్దికి గాయత్రిని ఇవ్వమని వాళ్ల ఇంటికెళ్లి అడుగుదామని మహా సలహా ఇస్తుంది. దీంతో చక్రి-కేశవ-కన్నాలని తీసుకొని తాంబూలాలు పట్టుకొని మహా.. గాయత్రి ఇంటికెళ్తుంది. ఇక వీళ్లని చూడగానే తాయారు సహా అందరూ అవాక్కవుతారు. గాయత్రి లోపలి నుంచి చూస్తూ ఏం జరుగుతుందా అనుకుంటుంది. మరి దీనికి తాయారు ఎలా రియాక్ట్ అవుతుంది.. మాధవ-గాయత్రి పెళ్లి ఎలా జరుగుతుందో చూడాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *