Today Horoscope in Telugu: ధృతి యోగం వేళ మేషం, సింహం సహా ఈ 5 రాశులకు శనీశ్వరుని ఆశీస్సులు!
Today Horoscope in Telugu: ధృతి యోగం వేళ మేషం, సింహం సహా ఈ 5 రాశులకు శనీశ్వరుని ఆశీస్సులు!
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేషరాశి వారికి ఈరోజు శనిదేవుని అనుగ్రహంతో అనేక కొత్త అవకాశాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో మంచి విజయం లభిస్తుంది. మీ ప్రణాళికలపై విశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి.
మార్కెటింగ్, సేల్స్ రంగంలో పని చేసే వారికి ప్రత్యేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు శని దేవుడికి నువ్వుల నూనెతో దీపారాధాన చేయాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి మూడో స్థానంలో గురుడు సంచారం చేయడం కారణంగా ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ పరిమితులను తెలుసుకోండి.
ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలు అప్పగించబడొచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. మీ అంకితభావానికి ఉన్నతాధికారులు ముగ్ధులవుతారు. మీ పనిలో నాణ్యత మెరుగుపరచుకోవడం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పరిహారం : ఈరోజు శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో కొత్త బాధ్యతలు కూడా అప్పగించొచ్చు. వ్యాపారుల పెండింగులో ఉన్న పనులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.
మీ ప్రేమ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు గురు గ్రహం ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. అయితే అతివిశ్వాసం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో రిస్కులు తీసుకోవడం మానుకోవాలి.
గతంలో చేసిన పనులకు ఇప్పుడు మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. సూర్యుడు, బుధుడి కలయికతో మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు తొందరపాటులో ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి.
పరిహారం : ఈరోజు శని దేవుడికి నువ్వులను దానం చేయాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు లభిస్తాయి. మీరు పాల్గొనే ప్రాజెక్టులన్నింట్లో అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.
వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. కొత్త అవకాశాల వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి కొత్త బాధ్యతలు లభిస్తాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శని దేవుడిని స్మరించుకూంటూ దానధర్మాలు చేయాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుక్రుడు బలహీన స్థితిలో ఉండటం వల్ల ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి, మీ ప్రాధాన్యతలను స్పష్టంగా ఉంచుకోవాలి. అవసరమైన పనులను మాత్రమే చేయాలి.
ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకూడదు. శని తిరోగమనం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో పెండింగ్ పనులు తిరిగి ప్రారంభించేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి.
పరిహారం : ఈరోజు శని చాలీసా పఠించాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీకు పాత పరిచయాల నుంచి మంచి అవకాశం లభించొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభించొచ్చు.
మీ భాగస్వాముల నుంచి అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభించొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో అవసరమైన వారికి సాయం చేయడం వల్ల సంతోషంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు శని దేవుడికి ఆవాల నూనె సమర్పించాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులకు మంచి రాబడి రానుంది. తొమ్మిదో స్థానంలో గురుడి సంచారం కారణంగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు.
ఈ రాశి నుంచి శని ఐదో స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ పనులు నెమ్మదిగా సాగొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి.
పరిహారం : ఈరోజు శని మంత్రాలను పఠించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లభించొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.
మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. మీ ఒత్తిడి తగ్గుతుంది. మీ భాగస్వామితో మంచి క్షణాలను గడిపే అవకాశం లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పరిహారం :ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు కొనుగోళ్లు చేయడం మానుకోవాలి. ఏడో స్థానంలో గురు గ్రహం సంచారం కారణంగా మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శని దేవుడు మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీ పనులను పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శని మంత్రాలను పఠించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశిలోనే చంద్రుడు సంచారం చేయడం కారణంగా ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ మనసులో కొంత ఆందోళన ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవలి. ఈరోజు రాత్రికి ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే రాశిలో రాహువు ఉండటం వల్ల కొంత పురోగతి లభించే అవకాశం ఉంది. మీ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పరిహారం :ఈరోజు శని చాలీసా పఠించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. చంద్రుడు ఈ రాశిలోకి ప్రవేశించడంతో భద్రతకు సంబంధించిన భావోద్వేగపరమైన ఆందోళనలు పెరుగుతాయి. ఇదే రాశిలో శని తిరోగమనం కారణంగా మీ ఖర్చులు పెరగొచ్చు.
మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం మానేయాలి.
పరిహారం : ఈరోజు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
గమనిక : ఇక్కడ అందించిన భక్తి, జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.