Gundeninda Gudigantalu Serial Today 27 August Episode: డబ్బులతో ప్రభావతికి రోహిణి ఎర.. సుమతి, అరుణ్‌లపై పార్వతికి అనుమానం.. మీనాతో పోటీగా చింతామణి
Gundeninda Gudigantalu Serial Today 27 August Episode: డబ్బులతో ప్రభావతికి రోహిణి ఎర.. సుమతి, అరుణ్‌లపై పార్వతికి అనుమానం.. మీనాతో పోటీగా చింతామణి
Gundeninda Gudigantalu Serial Today Episode గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో గురువారం నాటి ఎపిసోడ్‌లో ప్రభావతికి డబ్బుని ఎరగా వేసి.. తన వైపు తిప్పుకోవాలని రోహిణి ప్రయత్నిస్తుంది. ఇంకో వైపు అరుణ్‌కి థాంక్స్ చెప్పడానికి పార్వతి, సుమతి కలిసి అతని ఇంటికి వెళ్తారు. మరోవైపు ఓ పెద్ద ఆర్డర్ కోసం మీనా ప్రయత్నిస్తుంది. ఆ పోటీలో చింతామణి కూడా ఉంటుంది. మరి ఆ ఆర్డర్‌ను ఎవరు దక్కించుకుంటారు? అన్నది చూడాలి.

అప్పుడే ఎలా చెల్లు అవుతుంది..
తీసుకో అమ్మా అని మనోజ్ అంటే.. ఇది నన్ను డబ్బుతో కొనాలని చూస్తోంది రా.. అని ప్రభావతి అంటుంది. ఆ తర్వాత మీ ఇద్దరినీ అమ్ముతుందేమో చూడండి అని బాలు అంటాడు. బాలు కాస్త సైలెంట్‌గా ఉంటావా? అని రోహిణి అంటుంది. నేను చేసిన తప్పులకి ఇస్తున్నా అని రోహిణి అంటే.. తీసుకోమ్మా అని మనోజ్ అంటాడు. సర నా కొడుకు తీసుకోమన్నాడు కాబట్టి తీసుకుంటా అని అంటుంది ప్రభావతి. అంటే అన్నీ చెల్లా? అని సత్యం అంటాడు. అప్పుడే ఎలా చెల్లు అవుతుంది.. ఇంకా పెనాల్టీలు కడుతూనే ఉండాలని ప్రభావతి అంటుంది. అయితే చెలాన్ల బుక్ తెచ్చి పెట్టుకో అని బాలు కౌంటర్లు వేస్తాడు.
అమ్మ లేదు కదా..
నీ కష్టార్జితాన్ని నీ భర్తకు ఇవ్వాలి కానీ.. మీ అత్తకు ఇవ్వడం ఏంటమ్మా అని సత్యం అడుగుతాడు. నాకు అమ్మ లేదు కదా మామయ్య గారు.. అత్తయ్యే అమ్మ.. అమ్మ అనుకుని ఇచ్చాను అని రోహిణి ఓవర్ చేస్తుంది. పార్లరమ్మ సిక్సర్ కొట్టింది అని బాలు కౌంటర్లు వేస్తాడు. అత్తని అమ్మ, భర్తని అన్ని అని ఇంకా వరసలు కలపలేదు.. అయినా మనకు ఎందుకు బాలు.. మనం ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడితే.. మన మీదే రివర్స్ అయి.. ఆమె అత్తకి సపోర్ట్‌గా మాట్లాడుతుంది అని శ్రుతి అంటుంది.
నాలా నాలుగు డిగ్రీలు..
ఇంతలో మీనా వస్తుంది. తన తమ్ముడు డిగ్రీ పాస్ అవుతాడు అని చాక్లెట్స్ ఇస్తుంది. మీ తమ్ముడు డిగ్రీ పాస్ అవుతాడా? అదేదో కలెక్టర్ అయినట్టుగా చెబుతున్నావ్.. రోహిణి చూశావా? ఇరవై వేలు ఇచ్చింది అని చూపిస్తుంది ప్రభావతి. అసలు ఆ డబ్బులు మీరెందుకు తీసుకున్నారు? అని మీనా అంటుంది. ఇప్పుడు మళ్లీ నువ్వు స్టార్ట్ చేయకు అని బాలు అంటాడు. ఒక డిగ్రీ చదివితే ఏం వస్తుంది.. నాలా నాలుగు డిగ్రీలు చేయాలని మనోజ్ అంటాడు. అవును అప్పుడు లక్షలు మింగొచ్చు, భార్య చాటుగా ఉండొచ్చు.. భార్య కష్టార్జితాన్ని తల్లికి ఇవ్వొచ్చు అని బాలు కౌంటర్లు వేస్తాడు.
మంచివాళ్లకి ఎప్పుడూ మంచే..
మీరు మా తమ్ముడ్ని కాపాడారు అని మీనా స్పెషల్‌గా తేనే వేసిన పాలను తీసుకు వచ్చి ఇస్తుంది. నేను కాదు.. మనకు కరెక్ట్ టైంకి లొకేషన్ పంపించిన వ్యక్తి కాపాడాడు అని బాలు అంటాడు. అవును.. సుమతిని అడిగిన.. ఆ వ్యక్తిని మనం కలవాలి.. కలిసి.. థాంక్స్ చెప్పాలి అని అంటుంది మీనా. మంచి వాళ్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది.. మీ అమ్మ మంచిది.. మీరు మంచి వాళ్లు.. అందుకే మీకు మంచి జరుగుతుంది.. అదే మా అమ్మ చూడు.. ఎప్పుడూ ఎదుటి వారిని చూస్తూ కుళ్లుకుంటూనే ఉంటుంది.. అందుకే ప్రశాంతంగా ఉండలేకపోతుందని బాలు అంటాడు.
అలా అనొద్దు అండి.. అయినా అత్తయ్య చేతిలో ఆ డబ్బు ఎక్కడిది? అని మీనా అడుగుతుంది. రోహిణి ఇచ్చిందని బాలు అంటే.. ఎందుకు అని మీనా అడుగుతుంది. కుక్కకి బిస్కెట్లు ఎందుకు వేస్తాం.. అని బాలు అడిగితే.. మచ్చిక చేసుకోడానికి అని మీనా అంటుంది. అవును, అందుకే డబ్బులు ఇచ్చింది.. ఇకపై కూడా ఇస్తాను అంటోంది అని బాలు చెప్తాడు. అలా చేస్తే అత్తయ్య నిజంగానే మారిపోతారా? అని మీనా అడుగుతుంది. మా అమ్మ అంత త్వరగా మారదు.. ఆమెకి ఉన్న డబ్బు వీక్ నెస్ మీద రోహిణి కొడుతోందని బాలు అంటాడు.
పెద్ద ఆర్డర్ వచ్చింది..
ఈ టాపిక్ వద్దు గానీ.. ఏదైనా మంచి వార్త ఉంటే చెప్పు అని బాలు అడుగుతాడు. రేపు ఒక పెద్ద ఆర్డర్ ఉంది.. దానికి వెళ్లాలి.. పెద్ద కాంపిటీషన్ ఉంటుందట అని మీనా అంటుంది. ఏ కాంపిటీషన్ అయినా సరే నువ్వే గెలుస్తావ్.. ఆర్డర్ సంపాదిస్తావ్ అని బాలు అంటాడు. మీరు నాకు ఒక మాట ఇస్తారా? మనం సంతోషంగా ఉన్నాం కదా.. మీరు మందు తాగొద్దు.. తాగాలనిపిస్తే నాకు చెప్పండి.. ఇలా వేడి పాలు ఇస్తా అని మీనా అంటుంది. మందు బాబుని ఇలా మిల్క్ బాయ్‌ని చేశావ్ అని బాలు కామెడీ చేస్తాడు.
నా కొడుకుని కాపాడారు..
పార్వతి, సుమతి పూలు, పండ్లు తీసుకుని అరుణ్ ఇంటికి వస్తారు. ఇలా పూలు, పండ్లు తీసుకు వస్తే అర్థం తెలుసా? అని రాజేశ్వరి అడుగుతుంది. ఏంటి? ఆంటీ అని సుమతి అడిగేలోపు అరుణ్ వస్తాడు. మా కొడుకుని కాపాడేందుకు సాయం చేసిన మీకు థాంక్స్ చెప్పాలని వచ్చాం అని పార్వతి అంటుంది. దీనికే థాంక్స్ ఎందుకు అండి అని అరుణ్.. అది వాడి డ్యూటీ అని రాజేశ్వరి అంటుంది. మీరే సాయం చేసి ఉండకపోతే వాడి చదువు, ఎగ్జామ్స్ అన్నీ వృథా అయ్యేవి అని పార్వతి అంటుంది. మీకు ఇల్లు చూపిస్తా పదండి అని పార్వతిని పక్కకి తీసుకు వెళ్తుంది రాజేశ్వరి.
చీర, పూలు ఇచ్చిన రాజేశ్వరి..
పార్వతి, రాజేశ్వరి పక్కకి వెళ్లిన తర్వాత సుమతి, అరుణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అమ్మ గారు వచ్చారు.. మన పెళ్లి గురించి కూడా మాట్లాడేయండి అని అరుణ్ అంటాడు. ముందు మా అక్కకి, బావకి చెప్పాలి.. వాళ్లతో మాట్లాడాలని సుమతి అంటుంది. వారికి నేను నచ్చుతానా? అని అరుణ్ అడిగితే.. మీరు ఎవ్వరికైనా నచ్చుతారు అని సుమతి అంటుంది. ఇలానే మాట్లాడతారు.. కానీ విషయం మాత్రం పెళ్లి వరకు వెళ్లడం లేదు అని అరుణ్ అంటాడు. ఇంతలో పార్వతి, రాజేశ్వరి వస్తారు. వెళ్లేముందు పార్వతికి చీర, సుమతికి పూలు పెడుతుంది రాజేశ్వరి. ఏంటే వాళ్లు అంత ప్రేమగా చూస్తున్నారు.. నీకు మాత్రమే సాయం చేస్తాడా? అందరికీ సాయం చేస్తాడా? అని అనుమానంతో అడుగుతుంది పార్వతి. ఆటో వచ్చిందని కవర్ చేస్తుంది సుమతి.
మీనా చేసిన న్యూ మోడల్స్ నచ్చాయి..
ఇంకో వైపు పెద్ద ఆర్డర్ కోసం చింతామణి కూడా వస్తుంది. ఏంటి సుందరి కొత్తగా ఇలా చేస్తున్నారు.. ఎప్పుడూ ఆర్డర్ నాకే ఇస్తున్నారు కదా అని చింతామణి అడుగుతుంది. ఇది కార్పోరేట్ కంపెనీ కోసం చేస్తున్నాం.. వా ళ్లకి మీనా చేసిన న్యూ మోడల్స్ నచ్చాయి.. అయినా వాళ్ల రూల్ ప్రకారం ఇలాంటి పెట్టాం.. అని అంటాడు. మా అక్కవేమో.. మా అక్క పుట్టిన కాలం నాటి మోడల్స్ అని పక్కన ఉండే అసిస్టెంట్ గాడు కౌంటర్లు వేస్తుంటాడు. అయినా ఇలా రోడ్డు పక్కన మూరెడు పూలు అమ్ముకునే వారితో మమ్మల్ని పెట్టి అవమానిస్తారా? అని చింతామణి అంటుంది. అంతటితో ఎపిపోడ్ ముగుస్తుంది