Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్‌

 Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్‌

Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్‌

Dasoju Sravan Kumar | వెయ్యి మంది కేసీఆర్‌లు కాదు రేవంత్ రెడ్డీ.. నిన్ను, కాంగ్రెస్ పార్టీని బొగ్గుపాలు చెయ్యనీకి నువ్వు ఒక్కడివి చాలని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ ఫైర‌య్యారు. నీ అడ్డూ అదుపులేని అవినీతి, నీతి నిజాయితీ లేని నిరంకుశత్వం, ఆధిపత్య అహంకారమే నీ పాలిట భస్మాసుర హస్తమ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్‌
Advertisement

  • 32 నెలల్లో సెలవు తీసుకోలేదని సుద్దులు చెబుతున్నవ్
  • నీది సోషల్ జస్టిస్ కాదు.. సొంత జేబుల జస్టిస్
  • ప్రజల ఆగ్రహాగ్నిలో నీవు, నీ సర్కార్ భస్మం కావడం ఖాయం
  • మీడియా స‌మావేశంలో రేవంత్ ఊగిపోయిన ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్

Dasoju Sravan Kumar | వెయ్యి మంది కేసీఆర్‌లు కాదు రేవంత్ రెడ్డీ.. నిన్ను, కాంగ్రెస్ పార్టీని బొగ్గుపాలు చెయ్యనీకి నువ్వు ఒక్కడివి చాలని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ ఫైర‌య్యారు. నీ అడ్డూ అదుపులేని అవినీతి, నీతి నిజాయితీ లేని నిరంకుశత్వం, ఆధిపత్య అహంకారమే నీ పాలిట భస్మాసుర హస్తమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ వచ్చి నిన్ను ముట్టుకోవాల్సిన పనే లేదన్నారు. నెత్తిమీద చెయ్యి పెట్టుకుని బూడిదైపోయిన భస్మాసురుడి లెక్క‌.. నీ నోటి దురుసు, అహంకారం, అసమర్థ అవినీతి పాలనతో నిన్ను నువ్వు, నీ కాంగ్రెస్ పార్టీని నిలువునా దహనం చేసుకుంటున్నావ‌న్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ తీరుపై చెడుగుడు ఆడుకున్నారు.

వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా నన్నేమీ చేయలేర‌ని గప్పాలు కొట్టుకుంటున్నవ్. అబద్ధాలు.. ఆర్భాటాలు తప్ప ఆచరణ ఏది? 32 నెలల్లో సెలవు తీసుకోలేదని సుద్దులు చెబుతున్నవ్.. మరి ఈ నెలల కాలంలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేంది? రైతుల రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టిండ్రు, రైతుభరోసా ఎటుపోయిందో తెల్వదు, ఆరు గ్యారెంటీల ఊసే లేదు. లోటు బడ్జెట్, ప్రజలు నిలదీస్తుంటే ‘సోషల్ మీడియా అబద్ధాలు’ అని తప్పించుకునే చిల్లర వేషాలు ఎన్నాళ్లు సాగుతాయి?

బోల్తా పడ్డ బండి కాదు.. రాష్ట్రాన్నే ముంచేసిన పాలన నీది. ‘బోల్తా పడ్డ బండిని పట్టాలెక్కించినం’ అని డైలాగులు కొడుతున్నవ్. పచ్చగా ఉన్న తెలంగాణను ఆగమాగం చేసి, పెట్టుబడులు రాకుండా చేసి, రైతులను గోసపెట్టి, యువతను రోడ్లెక్కిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది నువ్వు కాదా? ఉద్యోగాల భర్తీ మీద మీరిచ్చిన హామీలు గాల్లో కలిసిపోలేదా?

ప్ర‌జ‌ల ముందు నిల‌బ‌డే ధైర్యం ఉందా?

సామాజిక న్యాయం గురించి నువ్వు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. ఉద్యమకారులను పక్కనపెట్టి, పదవుల పంపకాల్లో గ్రూపు రాజకీయాలు నడుపుతూ, పార్టీలోని సీనియర్లకే దిక్కులేకుండా చేస్తున్న నీ స్వార్థమే కాంగ్రెస్ పునాదులను కదిలిస్తోంది. సెప్టెంబర్‌లో అసెంబ్లీలో తేల్చుకుందాం రా అంటూ కేసీఆర్‌కు సవాల్ విసురుతున్నవ్.. అసెంబ్లీ దాకా ఎందుకు, సెక్యూరిటీ లేకుండా పల్లెల్లోకి వెళ్లి ప్రజల ఎదుట నిలబడే ధైర్యం ఉందా?

ఆ రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది..

గ్యారెంటీలు అమలు కాలేదని ప్రజలు తిరగబడుతుంటే చూసి తట్టుకోలేక, డైవర్షన్ రాజకీయాల కోసం కేసీఆర్ పేరును కలవరిస్తున్నవ్. గుర్తుంచుకో రేవంత్ రెడ్డీ… తెలంగాణ సమాజం నీవనుకుంటున్నంత అమాయకులేం కాదు. అబద్ధాల పునాదుల మీద కట్టిన నీ ప్రచార కోటలు, నీ దోపిడీ సామ్రాజ్యం కూలిపోయే రోజు దగ్గర్లోనే ఉంది. తెలంగాణ ప్రజల ఆగ్రహాగ్నిలో నీవు, నీ సర్కార్ భస్మం కావడం ఖాయం! తస్మాత్ జాగ్రత్త!! అని దాసోజు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *