రాశిఫలాలు 06 జూలై 2026: ఈరోజు సౌభాగ్య యోగం వేళ సింహం, మకరం సహా ఏ రాశులకు కలిసొస్తుంది?

 రాశిఫలాలు 06 జూలై 2026: ఈరోజు సౌభాగ్య యోగం వేళ సింహం, మకరం సహా ఏ రాశులకు కలిసొస్తుంది?

రాశిఫలాలు 06 జూలై 2026: ఈరోజు సౌభాగ్య యోగం వేళ సింహం, మకరం సహా ఏ రాశులకు కలిసొస్తుంది?

horoscope today 06 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సౌభాగ్య యోగం ప్రభావంతో సింహం, మకరం సహా ఈ 5 రాశులకు అద్భుతమైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

horoscope today 06 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సౌభాగ్య, శోభన యోగాలతో పాటు అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఇదే రోజున శివునికి అంకితం చేయబడింది. అంతేకాదు సూర్యుడు తన స్థానాన్ని పునర్వసు నక్షత్రంలోకి మార్పు చేయనున్నాడు. ఈ సమయంలో సింహం సహా కొన్ని రాశుల వారికి సూర్యుడు, శివయ్య అనుగ్రహం లభించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు సూర్యుని నక్షత్రం మారడం కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీకు ధనలాభ యోగం ఏర్పడొచ్చు. మీరు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో నాయకత్వానికి సంబంధించి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది. హనుమంతుడు, సూర్య దేవుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభరాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీరు చేసే పనిలో చాలా ఓపికగా ఉండాలి. ఉద్యోగులు సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండాలి. మీకు అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉండదు. మీ ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీకు పని ఒత్తిడి కారణంగా, కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చు.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ప్రమోషన్ లభించొచ్చు. మీ పనితీరు మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావొచ్చు. మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధించొచ్చు. శత్రువులు మీ పనులకు ఆటంకం కలిగించొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు పొందుతారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు శుభవార్తలు వినిపించొచ్చు. తల్లిదండ్రుల మద్దతుతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పిల్లల విజయాలు, మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సూర్యుని అనుగ్రహంతో వల్ల సింహ రాశి వారికి చెందిన పెండింగులో ఉన్న పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. మీ సంబంధాలలో భావోద్వేగపరమైన బలమైన బంధం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో శుభవార్తలు వినిపించొచ్చు. మీరు భూమి, ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్న వారికి శుభ యోగం లభిస్తుంది. ఈరోజు మీ కోరికలు కూడా నెరవేరే అవకాశాలున్నాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా అర్ఘ్యం సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు సూర్య నక్షత్ర మార్పు కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రాబడి వచ్చే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీకు శివయ్య అనుగ్రహం లభించనుంది. ఉద్యోగులు తాము చేపట్టే కొత్త ప్రాజెక్టుల్లో మంచి విజయం సాధించొచ్చు. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీకు పాత అప్పుల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. మీ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివయ్య అనుగ్రహంతో మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఏదైనా ముఖ్యమైన పత్రాల ముందు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీ ఇంటికి అతిథుల రాకతో సందడిగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. విదేశీ కంపెనీలలో పని చేసే వారికి, ఐటీ ఉద్యోగులకు అత్యంత అనుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మీకు తోబుట్టువులతో మంచి సంబంధాలు పెరగొచ్చు. మీకు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు సూర్య నక్షత్ర మార్పు కారణంగా అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది. మీ బంధువుల నుంచి ప్రయోజనాలు లభించొచ్చు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీకు సన్నిహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. శుభ యోగాల వల్ల మీకు ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి. శని దేవుడిని పూజించడం ద్వారా గొప్ప ప్రయోజనాలు పొందొచ్చు.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. కొన్ని విభిన్నమైన పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులు ప్రత్యర్థుల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీకు ఆదాయం కన్నా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ ప్రకారం డబ్బులు ఖర్చు చేయాలి. మీరు చేసే ప్రతి పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభించే అవకాశాలున్నాయి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు అదృష్ట ద్వారాలు తెరచుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మరోవైపు ఇప్పటికే ఉద్యోగంలో ఉండే వ్యక్తులు తమ స్థానాన్ని మారేందుకు అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగడమే ఉత్తమం. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ పనులన్నీ సజావుగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *