Podarillu Serial Today June 18th Episode: మహాలక్ష్మీకి సర్ ప్రైజ్ గిఫ్ట్.. అంతలోనే భంగపడ్డ చక్రి.. శైలు ప్రేమలో కేశవ
Podarillu Serial 2026 June 18th Episode Preview పొదరిల్లు సీరియల్లో గురువారం నాడు మహాలక్ష్మీకి చక్రి స్కూటీ గిఫ్ట్ ఇచ్చాడు. అయితే మహాకి మాత్రం సైకిల్ కూడా రాదని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇక మెల్లిగా స్కూటీ నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. చక్రి నేర్పుతాను అంటాడు. కానీ మహా వద్దని చెబుతుంది. చివరకు చక్రి వచ్చి నేర్పించే క్రమంలో మహాని కింద పడేస్తాడు. అందరూ కలిసి చక్రిని తిడతారు. కన్నా గాడి సలహాతో ఒంటరిగానే మహా స్కూటీ నడపడం నేర్చుకుంటుంది.

స్కూటీ కొన్న తర్వాత కేశవ, చక్రి ఇంటికి వస్తారు. అందరినీ బయటకు రమ్మని చెప్పు.. నేను వెళ్లి మహాలక్ష్మీని తీసుకు వస్తాను అని చక్రి అంటాడు. అంత వరకు ఈ స్కూటీ మీద ఏదైనా కప్పండి అని చెబుతాడు చక్రి. ఇక మహాని పిలిచి సర్ ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోండని అంటాడు చక్రి. కళ్లు మూసుకున్న మహాని అలా తీసుకు వస్తుంటాడు చక్రి. స్కూటీ మీద వేసిన పాత గుడ్డని చూసి చక్రి షాక్ అవుతాడు. ఆ గుడ్డని తీసి పారేసి.. స్కూటీకి అడ్డంగా పెద్ది, కేశవ, కన్నాలను నిలబెడతాడు. కళ్లు తెరవండని మహాకి చెబితే.. ముందు అన్నదమ్ములంతా కనిపిస్తారు. వీళ్లని చూడటానికి కళ్లు తెరవమన్నారా? అని చక్రితో మహా అంటుంది. కాదండి.. సర్ ప్రైజ్ అని స్కూటీని చూపిస్తారు. స్కూటీ బాగుంది.. ఎవరికి కన్నా గాడికా? అని మహా అంటుంది. వాడికి సర్ ప్రైజ్ అయితే మీకు ఎందుకు చెబుతాను అని చక్రి అంటాడు. ఇది నాకు ఎందుకు అని మహా ఏదో చెప్పేలోపు అందరూ కంగ్రాట్స్ కంగ్రాట్స్ అని చెబుతుంటారు. చివరకు చక్రి కూడా కంగ్రాట్స్ అని చెబుతాడు.
కన్నా నేర్పిస్తాడు..
కన్నా నేర్పిస్తాడు..
ఎహె ఆపండి.. అసలు నాకు స్కూటీ రాదు.. సైకిల్ కూడా రాదు.. కింద పడతాను అని నేర్పించలేదు అని మహా చెప్పడంతో అంతా షాక్ అవుతారు. చక్రి మొహం చూసి నారాయణ నవ్వుతాడు. ఈ విషయం తెలియకుండానే స్కూటీ కొన్నావా? అని పెద్ది అంటాడు. ఈ కాలంలో స్కూటీ రాని వారు ఎవరుంటారు అన్నయ్య.. అని చక్రి అంటాడు. అదేం పెద్ద విషయం కాదు ఇప్పుడు నేర్చుకో అమ్మ అని పెద్ది అంటాడు. నేను నేర్పిస్తాను అని చక్రి అంటే.. నువ్వు వద్దు కన్నా నేర్పిస్తాడు అని మహా అంటుంది. దీంతో చక్రి మొహం మాడిపోతుంది.
బాధపడ్డ చక్రి..
కన్నా గాడు స్కూటీ ఎలా స్టార్ట్ చేయాలి.. ఎలా డ్రైవ్ చేయాలని చెబుతుంటాడు. మహా ఒక్కసారిగా స్టార్ట్ చేసి యాక్సిలేటర్ ఎక్కువ చేస్తుంది. దీంతో మహా పడిపోతుందేమో అని అందరూ భయపడిపోతారు. మెల్లిగా అనాలి వదినా అని కన్నా చెబుతుంటాడు. ఇక మెల్లిగా గ్రౌండ్‌కి తీసుకు వెళ్తాడు కన్నా. అలా వారిద్దరూ వెళ్తుంటే.. చక్రి మాడిపోయిన మొహంతో చూస్తుంటాడు. నేను నేర్పించాలని అనుకున్నాను.. కన్నా గాడే నేర్పిస్తాడు అని వాడ్ని తీసుకు వెళ్లింది అని పెద్ది, కేశవలతో చక్రి అంటాడు. వారు ఏం మాట్లాడకుండా లోపలకు వెళ్లిపోతారు.
సారీ చెప్పిన కేశవ..
ఎందుకు పదే పదే కాల్ చేస్తున్నావ్.. ఒకసారి కట్ చేస్తే బిజీగా ఉన్నానని నీకు అర్థం కాదా.. అని కేశవ మీద రివేంజ్ తీర్చుకున్నట్టుగా తిట్టేస్తుంది శైలు. కేశవ మాత్రం నీకు సారీ చెప్పాలని చేశా.. ఆ రోజు అర్థం చేసుకోకుండా నిన్ను కొట్టాను.. తర్వాత చాలా బాధపడ్డాను.. సారీ అని అంటాడు. కేశవ మాటలకు శైలు మైండ్ బ్లాక్ అవుతుంది. అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతుంది. పాము, ముంగీసలు ప్రేమించుకుంటాయా? అన్నా అని చోటు అంటాడు. అవి బద్ద శత్రువులు ఎప్పటికీ ప్రేమించుకోవు అని కేశవ ముసి ముసి నవ్వులు నవ్వేస్తాడు. చూస్తుంటే శైలుని కేశవ కూడా ఇష్టపడుతున్నట్టుగానే కనిపిస్తుంది.
చక్రిని తిట్టిన నారాయణ..
మహాకి డ్రైవింగ్ ఎలా చేయాలో గ్రౌండ్లో నేర్పిస్తుంటాడు కన్నా. మహా కష్టపడుతూ అటూ ఇటూ నడిపిస్తూ ఉంటుంది. మరో వైపు చక్రి కోపంగా ఉంటాడు. నారాయణ వచ్చి బీడీ కాలుస్తూ ఉంటే ఆ కోపాన్ని తీర్చుకుంటాడు చక్రి. ఎక్కడి కోపాన్నో ఇక్కడ చూపించకు.. స్కూటీ నేర్పించాలనే ప్లాన్ ఫ్లాఫ్ అయింది.. ఆ కోపాన్ని నా మీద చూపిస్తున్నావా? అసలు నీకు సిగ్గుందా? ఇన్ని రోజులు అయినా ఓ అమ్మాయి మనసులో స్థానం సంపాదించలేకపోతోన్నావ్.. మాధవని నాన్నగా.. నన్ను కొడుకుగా చూస్తోంది.. నిన్ను మాత్రం ఇక్కడే నిలబెట్టిందని చక్రిని తిట్టేస్తాడు నారాయణ. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి తనంతట తానే ఇక్కడ ఉండేలా చేసుకో.. భర్తగా స్థానం సంపాదించుకో అని చెబుతాడు.
నేర్పించేందుకు వచ్చిన చక్రి..
నారాయణ మాటలకు చక్రికి రోషం వస్తుంది. గ్రౌండ్లో మహా స్కూటీకి అడ్డంగా నిల్చుంటాడు. ఎవరైనా సడెన్‌గా ఇలా వస్తారా? అని మహా, కన్నా ఇద్దరూ చక్రిని తిట్టేస్తారు. నేను నేర్పిస్తాను.. అని చక్రి అంటాడు. మీరేం వద్దు.. మీకు డ్రైవింగ్ బాగా వచ్చినా కూడా.. ఎగతాళి చేయడం కూడా చాలా వచ్చు.. మీరేం నేర్పించొద్దు అని అంటుంది మహా. అన్నయ్య అయితే వెనకాల కూర్చుని నేర్పిస్తాడు.. బాగానే నేర్పిస్తాడు నేర్చుకో వదిన అని కన్నా అంటాడు. దీంతో మహా సరే అంటుంది. ఇక దొరికిందే ఛాన్స్ అనుకుని మహా ముందు కూర్చుంటే చక్రి వెనకాల కూర్చుని సంబరపడిపోతాడు.
కింద పడేసిన చక్రి..
కింద పడేసిన చక్రి..
మహాకి స్కూటీ నేర్పించే క్రమంలో చక్రి ఏదో లోకంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. మహా అలా నడిపిస్తూ ఉంటే బ్యాలెన్స్ చేయాల్సిన చక్రి.. మిస్ చేస్తాడు. దీంతో స్కూటీతో పాటు మహా, చక్రి ఇద్దరూ కింద పడతారు. మహా చేతికి గాయం అవుతుంది. వదినకు గాయం అయింది అని కన్నా గాడు చక్రిని తిడతాడు. మీరే పడేశారు.. మీ వల్లే జరిగిందని చక్రిని మహా తిడుతుంది. ఇక స్కూటీని, చక్రిని అక్కడే వదిలేసి వస్తారు. ఏం జరిగిందని నారాయణ అంటే.. కింద పడ్డాను అని చెబుతుంది. ఇలా పడటం మామూలే.. పట్టుదలతో ప్రయత్నించాలని నారాయణ అంటాడు. నేను స్కూటీ నేర్చుకుని చూపిస్తాను అని మహా అంటుంది.
చక్రిని మందలించిన పెద్ది..
ఇంటికి వచ్చిన చక్రిని నారాయణ తిడతాడు. కనీసం అమ్మాయికి స్కూటీ కూడా నేర్పించడం రాదా? కింద పడేసి తీసుకు వస్తావా? అని అంటాడు. వదినని కింద పడేశాడు అని పెద్దికి కన్నా చెబుతాడు. లేదు నేను పడిపోయాను అని మహా అంటుంది. నేను నేర్పిస్తాను అంటే భూమికి జానెడు లేని కన్నా గాడ్ని తీసుకువెళ్లావ్ అని చక్రి అంటాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నావ్.. అసలు నన్ను కింద పడేసిందే నువ్వు అని మహా అంటుంది. అసలు నువ్వు ఎందుకు వెళ్లావ్ రా అని పెద్ది తిడతాడు. ప్రయత్నిస్తే వస్తుంది అమ్మా.. కన్నా నేర్పిస్తాడు.. లేదంటే నేను నేర్పిస్తాను అని పెద్ది అంటాడు.
నాకు స్పేస్ ఇవ్వడం లేదు..
మీరు మహాతో అంత క్లోజ్‌గా ఉంటే నాకు నచ్చడం లేదు.. అసలు నన్ను పట్టించుకోవడం లేదు.. నిన్ను పెద్ది అని అంత ప్రేమగా పిలుస్తుంటే నాకు నచ్చడం లేదు.. అసలు మీరు నాకు స్పేస్ ఇవ్వడం లేదు అని చక్రి ఫీల్ అవుతుంటాడు. ఆ మాటలకు పెద్ది, కన్నా నవ్వుకుంటారు. చక్రికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. చక్రి ఉడుక్కుంటున్నాడని పెద్ది, కన్నాకి అర్థం అవుతుంది. పెద్ది, కన్నా అలా సైలెంట్‌గా వెళ్లిపోవడంతో చక్రి ఓ రకంగా చూస్తాడు. మరో వైపు కేశవ గురించి శైలు ఆలోచిస్తుంటుంది.
శైలుకి కీర్తి సలహా..
కేశవ నాకు సారీ చెప్పాడు.. వాడు నన్ను కొట్టినందుకు ఫీల్ అయ్యాడట.. సారీ చెప్పేందుకే అన్ని సార్లు ఫోన్ చేశాడట.. నేనింకా వాడ్ని అవాయిడ్ చేస్తున్నాను.. అది గమనించి.. ఐ లవ్యూ చెప్తాడని అనుకున్నానే అని కీర్తితో శైలు అంటుంది. కేశవ అందరి లాంటి వాడు కాదు.. ఏదైనా స్ట్రెయిట్ ఫార్వార్డ్.. నువ్వే వెళ్లి ఐ లవ్యూ అని చెప్పు అని కీర్తి సలహా ఇస్తుంది. అమ్మో ఏమైనా అంటాడేమో అని శైలు భయపడుతుంది. అయితే ఇంకొన్ని రోజులు చుట్టూ తిరుగు.. ఏదో ఒక టైం చూసుకుని నీ ప్రేమ సంగతి చెప్పు అని కీర్తి అంటుంది.
స్కూటీ నేర్చుకున్న మహా..
చివరకు కన్నా గాడి సూచనలతోనే మహా స్కూటీ నేర్చేసుకుంటుంది. కన్నా వెనకాల కూర్చుంటే మెల్లిగా స్కూటీని స్టార్ట్ చేస్తుంది మహా. మెల్లిగా యాక్సిలేటర్ ఇవ్వండి వదిన.. మెల్లిగా స్టార్ట్ చేయండని కన్నా చెబుతుంటాడు. అలా కన్నా చెప్పినట్టుగా మెల్లిగా స్కూటీని నడుపుతుంది మహా. అలా ఓ రౌండ్ కూడా వేసుకుని వస్తుంది. ఇక స్కూటీ వచ్చేసినట్టే అని అంతా సంబరపడతారు. అలా మహా స్కూటీ నడుపుతూ ఉంటే.. అందరూ ఆమె చుట్టూ చేరి నడుస్తూ, పరిగెడుతూ ఉంటారు. మొత్తానికి మహా స్కూటీని నడపడం నేర్చేసుకుంది.