Gundeninda Gudigantalu Serial Today June 18th Episode: విషం కక్కిన ప్రభావతి.. ఛీ నీదీ ఒక ఆడ జన్మేనా?.. చెంపలు వాయించబోయిన సత్యం
Gundeninda Gudigantalu Serial Today June 18th Episode:
Gundeninda Gudigantalu Serial Today June 18th Episode: విషం కక్కిన ప్రభావతి.. ఛీ నీదీ ఒక ఆడ జన్మేనా?.. చెంపలు వాయించబోయిన సత్యం
Gundeninda Gudigantalu Serial 2026 June 18th Episode Preview గుండెనిండా గుడిగంటలు సీరియల్లో గురువారం నాడు ప్రభావతిని హాల్లో దోషిలా నిలబెట్టాడు బాలు. నాటకం ఎందుకు ఆడావు.. కోడలు ఎదగడం నీకు ఇష్టం లేదు.. ఇలాంటి తల్లి, అత్త ఎక్కడైనా ఉంటుందా? అని బాలు తిడతాడు. ఇక ఇదంతా నేనే చేశాను.. నాటకం ఆడాను అని ఒప్పుకుని మీనాని నిందిస్తుంది ప్రభావతి. ఆ మాటలకు సత్యం ఆగ్రహిస్తాడు. చీ నీది ఒక ఆడజన్మేనా అని దారుణంగా తిట్టేస్తాడు సత్యం.

చేయి నొప్పి అంటూ ప్రభావతి డ్రామాలు ఆడటంతో అత్తకి మీనా సేవలు చేస్తూ ఉంటుంది. అయితే కిచెన్‌లో వీడియో కాల్ మాట్లాడుతూనే డెకరేషన్ పనుల్ని కంప్లీట్ చేస్తుంది మీనా. ఈ విషయాలు ప్రభావతికి తెలియవు. ఇక డెకరేషన్ కాంట్రాక్ట్ పోయి ఉంటుంది.. ఈ ప్రభావతి అంటే ఏం అనుకుంటున్నావే.. పిచ్చిది.. అన్నీ నమ్మేసింది అని ప్రభావతి సంబరపడుతుంది. అదే టైంలో చింతామణి ఫోన్ చేస్తుంది. నీ కోడలు అసాధ్యురాలు.. అక్కడే ఉండి.. ఇక్కడ డెకరేషన్ పనుల్ని ఫినిష్ చేసింది.. నిన్ను నమ్ముకోవడం నాది తప్పు అని చెడమడా తిట్టేస్తుంది చింతామణి. ఇదంతా ఎలా సాధ్యమైంది.. నాకు చన్నీళ్లు, వేడి నీళ్ల కాపడం పెట్టింది.. సూప్ తాగించింది.. మరి ఆ పనులు ఎప్పుడు చేసింది.. ఇదంతా తెలిసి ఉంటే నా ముందే కూర్చోబెట్టుకునే దాన్ని అని ప్రభావతి అంటుంది. ఎలా అయితేనేం మీ కోడలు సాధించింది.. నా నోట్లో మట్టి కొట్టింది.. అని చింతామణి అంటుంది. ఇదంతా కూడా మీనా వింటుంది. అంటే ఇదంతా నాటకం.. కావాలనే నన్ను ఆపిందా? అని మీనా బాధపడుతుంది. ఇంకో వైపు నీతూ కొత్త అసిస్టెంట్ కోసం ఇంటర్వ్యూలు చేస్తుంది.
శాలరీ కోసం చేయడం లేదు..
నీతూ తన కోసం ఓ అసిస్టెంట్ కావాలని అందరినీ ఇంటర్వ్యూలు చేస్తుంది. అందులో ఒకామె రెండేళ్ల అనుభవం ఉండగానే యాభై వేలు కావాలని అడుగుతుంది. ఇదే విషయాన్ని రవికి చెబుతుంది. ఆమె అంత అడిగితే నేను ఎంత అడగాలి అని నువ్వు అనుకుంటున్నావ్ కదా రవి అని నీతూ అంటుంది. నేను డబ్బుల కోసం పని చేయడం లేదు.. అనుభవం కోసం చేస్తున్నా.. రెస్టారెంట్ ఎలా నడపాలో ఇక్కడ ఉండి తెలుసుకుంటున్నాను.. శాలరీ కోసం నేను పని చేయడం లేదు అని రవి అంటాడు. అందుకే నీ వర్క్ అంటే నాకు ఇష్టం అని నీతూ అంటుంది.
జాబ్ కోసం వచ్చిన శ్రుతి..
ఎంత మందిని చూసినా సరైన వ్యక్తి దొరకడం లేదని నీతూ అనుకుంటుంది. ఇంతలో శ్రుతి వస్తుంది. నేను జాబ్ కోసం వచ్చాను అని శ్రుతి అంటుంది. మరి నీ డబ్బింగ్ వర్క్ అని నీతూ అడుగుతుంది. ఇది పార్ట్ టైం కదా.. పైగా రవితో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను అని శ్రుతి అంటుంది. అది అసలు కారణం.. రవి కోసం వచ్చావ్ అన్న మాట అని నీతూ అంటుంది. అవును రవి ఎక్కువగా రెస్టారెంట్లోనే ఉంటున్నాడు.. ఈ మధ్య మాకు టైం గ్యాప్ వస్తోంది.. అందుకే జాబ్ చేయడానికి వచ్చాను అని శ్రుతి చెబుతుంది. దీంతో నీతూ ఓకే చెప్పేస్తుంది.
శ్రుతి జాబ్ చేయడానికి వచ్చిందని తెలియడంతో రవి షాక్ అవుతాడు. అవును నేనే ఓకే చేశాను అని నీతూ అంటుంది. మరి నాకు ఎందుకు చెప్పలేదు అని రవి అంటాడు. శ్రుతి చెప్పిన రీజన్ నాకు నచ్చింది అందుకే ఓకే చేశాను అని నీతూ అంటుంది. ఇక్కడ నీతో ఎక్కువ టైం గడపొచ్చు.. ఎవరితో క్లోజ్‌గా ఉంటున్నావో చూడొచ్చు అని శ్రుతి కౌంటర్లు వేస్తుంది. అంటే నా గురించే అంటున్నావా? అని నీతూ అంటుంది. సర్లే ఇకపై జాగ్రత్తగా ఉంటాం అని నీతూ అంటే.. అదే మంచిది అని శ్రుతి అంటుంది. ఏయ్ అలా అనొద్దు అని రవి అంటాడు. మీ ఇద్దరినీ చూస్తే కొత్త ప్రేమ జంటలా ఉన్నారు.. త్వరగా వర్క్ స్టార్ట్ చేసుకోండని చెప్పి వెళ్తుంది నీతూ.
పప్పులో ఉప్పు కూడా వేయదు..
పప్పులో ఉప్పు కూడా వేయదు..
పూల దండను తీసుకు వచ్చి.. ఇంట్లో అందరినీ పిలుస్తాడు బాలు. ఈ పూల దండ అమ్మకి వేయాలి.. ఎంతో పెద్ద ఘన కార్యం చేసింది.. అందరూ చప్పట్లు కొట్టండని బాలు అంటాడు. ఏం జరిగింది అని ప్రభావతి, సత్యం ఇలా అందరూ ఆలోచిస్తుంటారు. పప్పులో ఉప్పు కూడా వేయదు.. ఎవరికి సాయం చేసింది.. అని రవి అంటాడు. ఎవరిని సాధించింది.. అదే ఏం సాధించింది అని శ్రుతి కౌంటర్లు వేస్తుంది. ఎందుకు అలా నాటకం ఆడారు అత్తయ్య అని మీనా అంటుంది. ఏం నాటకం అని ఏమీ తెలియని దానిలా అడుగుతుంది ప్రభావతి.
వెళ్లకుండా ఆపింది..
నీ కోడలు ఎదగడం నీకు ఇష్టం లేదా.. మేం బాగు పడటం నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా చేశావ్ అని బాలు అంటాడు. చేయి బెణికింది అంటూ నాటకం ఆడింది.. ఉదయం నుంచి సేవలు చేయించుకుంటూనే వచ్చింది.. నా డెకరేషన్ పనులకు వెళ్లకుండా అడ్డుకుంది అని మీనా చెప్పుకుంటూ బాధపడింది. ఇదంతా ఎందుకు చేశావ్ అని బాలు నిలదీస్తాడు. అడుగుతున్నారు కదా.. చెప్పు అని సత్యం అంటాడు. అదంతా అబద్దం అండి అని ప్రభావతి బుకాయించే ప్రయత్నం చేస్తుంది. దీంతో మీనా ఉదయం జరిగిందంతా చెబుతుంది.
ఆడపిల్ల ఎదగడం మీకు ఇష్టం లేదా?
ఒక ఆడపిల్ల సొంతంగా ఎదగడం మీకు నచ్చడం లేదు.. చదువు లేకపోయినా తెలిసిన విద్యతో ఎదుగుతుంటే తట్టుకోలేకపోతోన్నారా.. ఎప్పటికీ మీ కాళ్ల కిందే ఉండాలని చూస్తున్నారా.. ఆ వంట గదికే పరిమితం అవ్వాలని చూస్తున్నారా.. ఎందుకు ఇలా చేశారు.. నేను మీకేం అన్యాయం చేశాను అని మీనా ఏడ్చేస్తుంది. కానీ ప్రభావతి మాత్రం నోరు విప్పదు. బాలు కూడా ప్రభావతిని నిలదీస్తాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రభావతి అలా నిలబడి వింటూ ఉంటుంది. అమ్మ అలా ఎందుకు చేస్తుంది అని మనోజ్ అంటాడు.
ఆమె హస్తం ఉంది..
ఆవిడ కచ్చితంగా చేసి ఉంటారు.. మొదటి నుంచి ఆవిడ ఎన్ని పనులు చేశారో చెప్పాలా.. మీరు చేసిన ప్రతీ తప్పు వెనకాల ఆమె హస్తం ఉంది.. సీరియల్, సినిమాల్లో చూపించినట్టుగా ఇంతటి క్రూయల్, క్రిమినల్ థాట్స్ ఉన్న అత్తని నేను ఎక్కడా చూడలేదు అని శ్రుతి అంటుంది. వదిన ఎంతో కష్టపడి అన్నయ్యకి కార్లు కొనిచ్చింది.. ఫోన్ కొనిచ్చింది.. మెడలో పసుపుతాడుతో తిరుగుతోంది.. కష్టపడి ఎదుగుతుంటే ఓర్వలేకపోతోన్నావా? అమ్మా అని రవి కూడా తిడతాడు. అడుగుతున్నారు కదా.. మాట్లాడు అని సత్యం కూడా ప్రభావతిని నిలదీస్తాడు.
నిలదీసిన సత్యం..
కోడలే అయినా కూతురిలా అన్ని సేవలు చేసింది కదా.. అప్పుడైనా నీకు అనిపించలేదా? ఎందుకు మోసం చేయడం.. నిజం చెప్పేద్దాం అని అనుకోలేదా?.. కూతురిలా ప్రేమను పంచి సేవలు చేస్తుంటే నీకు మోసం చేయాలని ఎలా అనిపించింది అని ప్రభావతిని నిలదీస్తాడు బాలు. చెప్పు అడుగుతున్నారు కదా అని సత్యం ఫైర్ అవుతాడు. అసలు మీకు మనస్సాక్షి ఉందా? అని శ్రుతి, రవి కూడా తిడతారు. దీంతో ప్రభావతికి కోపం వస్తుంది. ఆపండి అని అందరి మీద ఒక్కసారిగా అరిచేస్తుంది. ఇన్ని రోజులు దాచి పెట్టుకున్న విషాన్ని ప్రభావతి బయటకు కక్కేస్తుంది.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం..
అవును మీనాని ఆపేందుకు అలా చేశాను.. మీ భాషలో చెప్పాలంటే నాటకం ఆడాను.. ఇది ఇంటి ముందు పూల దుకాణం పెట్టినప్పటి నుంచి బరువు, బాధ్యతల్ని మర్చిపోయింది.. ఇంటి పనులు చేయడం లేదు.. పూల గంప ఏసుకుని ఊర్ల మీదకు వెళ్తోంది.. ఇప్పుడు డెకరేషన్ పని అంటే పూర్తిగా వదిలేస్తుంది.. అందుకే ఆపాను అని ప్రభావతి తన కుళ్లుని బయట పెడుతుంది. దీంతో సత్యంకి పట్టరాని కోపం వస్తుంది. చేయి ఎత్తి ప్రభావతిని కొట్టాలని చూస్తాడు. కానీ ఛీ అని కొట్టకుండా ఆగిపోతాడు సత్యం. సత్యం ఆగ్రహం చూసి ప్రభావతి భయపడుతుంది.
నీది ఒక బతుకేనా?
నీది ఒక ఆడ జన్మేనా? నీది ఒక బతుకేనా? నీకసలు మనస్సాక్షే లేదా? మూడు పూటలా అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి కోడల్ని ఆపుతావా? నీకు నిజంగానే కాళ్లుచేతులు పడిపోతే.. దిక్కులేని చావు చస్తావు.. నీ మెడలో దండ ఎందుకే.. అని తెంపి పారేస్తాడు సత్యం. నేను వంట చేయడం లేదా? అని మీనా అంటుంది. ఉడికీ ఉడకని కూరలు చేస్తున్నావ్ అని అంటుంది ప్రభావతి. నాకు అయితే వడ్డించదు.. అని మనోజ్ అంటాడు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్టుగా ఉందని రోహిణి అంటుంది. చీ మీకసలు అంతరాత్మలు అనేవే లేవు అని రోహిణి, మనోజ్, ప్రభావతిలను బాలు తిడతాడు..
గుణపాఠం చెప్పకుండా వదిలి పెట్టను
ఇంట్లోనే ఆపినా.. వంటింట్లోనే ఉన్నా కూడా మండపం దగ్గర డెకరేషన్ చేయించింది.. వీడిగయో కాల్‌లోనే అన్ని పనులు చేసేసింది.. మేనేజర్ మెప్పు కూడా పొందింది.. విజయం సాధించింది.. అని అంటాడు బాలు. దీంతో శ్రుతి, రవి చప్పట్లు కొడతారు. దీని వల్ల కొత్త అనుభవం ఏర్పడింది.. ఇదంతా అమ్మ వల్లే జరిగింది.. ఇంకో నాలుగు డెకరేషన్స్ ఒకేసారి వచ్చినా కూడా చేసేంత అనుభవం వచ్చింది.. ఈ విషయంలో అమ్మకి రుణపడి ఉంటాను.. కానీ రోజు చేసిన దానికి మాత్రం గుణపాఠం చెప్పకుండా వదిలి పెట్టను అని బాలు అంటాడు.