రాశిఫలాలు 08 జూన్ 2026: ఈరోజు ప్రీతి యోగం వేళ శివయ్య అనుగ్రహం పొందే అదృష్ట రాశులు ఇవేనా?

 రాశిఫలాలు 08 జూన్ 2026: ఈరోజు ప్రీతి యోగం వేళ శివయ్య అనుగ్రహం పొందే అదృష్ట రాశులు ఇవేనా?

రాశిఫలాలు 08 జూన్ 2026: ఈరోజు ప్రీతి యోగం వేళ శివయ్య అనుగ్రహం పొందే అదృష్ట రాశులు ఇవేనా?

horoscope today 08 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు విష్కంభ, ప్రతి యోగాల ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Jun8
horoscope today 08 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు విష్కంభ, ప్రీతి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాలతో పాటు కొన్ని రాశుల వారికి శివయ్య ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథునం సహా కొన్నిరాశుల వారికి చంద్రుడి స్థానం బలపడి శివుని ఆశీస్సులు లభించొచ్చు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. ఈరోజు మీరు కొత్త ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయొచ్చు. పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లల ప్రతిభకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు త్వరలో కొన్ని శుభవార్తలు వింటారు. తీర్థయాత్రలకు వెళ్లేందుకు మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. అంతేకాదు శివయ్య అనుగ్రహం లభించనుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. కొన్ని పనుల గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే అవి నిరాశను మిగిల్చే అవకాశం ఉంది. ఏదైనా పత్రాలలో సంతకం చేసే ముందు, అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాలి. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం రావాలంటే, మీరు చాలా ఓపికగా ఉండాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. శుభయోగాల కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ పథకాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందొచ్చు. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఈరోజు అనేక కొత్త విషయాలను నేర్చుకుంటారు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుక్రుడు, గురుడి కలయిక కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి కొంత ఎక్కువగా ఖర్చులు చేయాల్సి రావొచ్చు. ఈరోజు అతివిశ్వాసానికి దూరంగా ఉండాలి. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ భాగస్వామి మద్దతుతో అనేక పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. అంతేకాదు శివయ్య ప్రత్యేక ఆశీస్సులు లభించే అవకాశాలున్నాయి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఎలాంటి మానసిక ఒత్తిడిని అనుభవించరు. సమాజంలో కొందరు ప్రత్యేక వ్యక్తులతో మీ సంభాషణలు పెరుగుతాయి. మీ సంబంధాలు బలపడే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీకు స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. శుక్రుని ప్రభావంతో క్రమంగా మీ ఆదాయ మార్గాలు పెరగొచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం ద్వారా మీరు కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఎలాంటి అవకాశాలను చేజార్చుకోవద్దు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ బంధాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో ప్రశంసలు లభిస్తాయి. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి. ఈరోజు ధార్మిక కార్యకలాపాలపై మరింత ఆసక్తి కనబరుస్తారు. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. చాలా ధైర్యంగా ఉండాలి. మీరు చేసే పనుల్లో ఏవైనా అడ్డంకులు ఎదురైతే చాలా ఓపికగా ఉండాలి. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీరు చేసే చిన్న ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. మీ పనికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనిలో పారదర్శకత పాటించాలి. రాజకీయాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా చేసే ఏ పని అయినా మీకు మనశ్శాంతిని ఇస్తుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవ్వొచ్చు. మీ ప్రతిభకు మంచి అవకాశం లభిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ సంభాషణలు పెరుగుతాయి. మీ అదృష్టం పెరిగే అవకాశం ఉంది. మీరు కష్టమైన పనులను సైతం సులభంగా పూర్తి చేయొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి క్లయింట్లతో సంబంధాలను మెరుగుపరచుకుంటారు. ఈరోజు మీరు కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం వల్ల భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పనులన్నీ అంకితభావంతో పూర్తి చేయడంతో మీ కీర్తి, ప్రతిష్టలు పెరగనున్నాయి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన లక్ష్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీ ఆదాయ మార్గాలను విస్తరించుకోవాలనే మీ కోరికలు నెరవేరొచ్చు. ఈరోజు ఎలాంటి తొందరపాటు పెట్టుబడులను పెట్టొద్దు. మీరు చేసే పనుల్లో కొంత ఒత్తిడి పెరగొచ్చు. మీరు చేసే వినూత్నమైన పనులు, ప్రత్యేకమైన ఆలోచనలు మీ బాస్‌ను ఆకట్టుకుంటాయి. మీరు చేసే పనుల్లో శక్తి, సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఏ పని చేసినా పూర్తి అంకితభావంతో, నిబద్ధతతో చేస్తే కచ్చితంగా విజయం లభిస్తుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుక్రుడి ప్రభావంతో శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. మీ శక్తి, సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంచాలి. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. భవిష్యత్తు కోసం పక్క ప్రణాళికలు వేసుకోవడానికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *