రాశిఫలాలు 09 జూన్ 2026: ఈరోజు నవపంచమ యోగం ప్రభావంతో సింహం, మకరం సహా ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు

 రాశిఫలాలు 09 జూన్ 2026: ఈరోజు నవపంచమ యోగం ప్రభావంతో సింహం, మకరం సహా ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు

రాశిఫలాలు 09 జూన్ 2026: ఈరోజు నవపంచమ యోగం ప్రభావంతో సింహం, మకరం సహా ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు

horoscope today 09 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఆయుష్మాన్, నవపంచమ యోగాల ప్రభావంతో సింహం, మకరం సహా ఈ 5 రాశుల వారికి రెట్టింపు లాభాలు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope inTel Jun9
horoscope today 09 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కుంభం నుంచి మీన రాశిలో ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. మీన రాశిలో శని, చంద్రుడు కలయిక జరగనుంది. ఇదే సమయంలో గురు గ్రహం దృష్టి కారణంగా గురు చంద్రుల మధ్య నవ పంచమ యోగం ఏర్పడనుంది. దీంతో పాటు గజలక్ష్మీ యోగం, రుచక యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు వృషభంలో సూర్యుడు తన బలమైన స్థానాన్ని కొనసాగిస్తున్నాడు. మరోవైపు కర్కాటక రాశిలో శుక్రుడు, గురుడు భవిష్యత్తు కోసం సంపదను కూడబెట్టుకోవడానికి అద్భుతమైన అవకాశాలు అందించనున్నాడు. అయితే ఇలాంటి సమయంలో తొందరపడకుండా సక్రమంగా పనులు చేయాలి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన పనుల కోసం ఖర్చులు పెరగొచ్చు. శుక్రుడు, గురుడు నాలుగో స్థానంలో ఉండటం వల్ల, భవిష్యత్తు కోసం గణనీయమైన సంపదను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. అయితే తొందరపడకుండా ుండాలి. కుజుడి ప్రభావంతో మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. అయితే ఎవరితోనూ అనవసరమైన వాదనలు పెట్టుకోకూడదు. గొడవలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీరు చేసే ప్రయాణాల వల్ల సానుకూల ఫలితాలొస్తాయి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశిలో సూర్యుడు బలమైన స్థానంలో ఉండటం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు స్నేహితుల నుంచి రావాల్సిన బకాయిలు అందుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ గుడ్డిగా అప్పులు ఇవ్వకండి. మరోవైపు మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో సమన్వయంతో పని చేయాలి. అప్పుడే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)​

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)​
మిథున రాశిలో బుధుడి సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధించొచ్చు. అంతేకాదు ఎక్కువగా పొదుపు చేసేందుకు కొత్త మార్గాలను కనుగొనడంలో సక్సెస్ సాధిస్తారు. అయితే భావోద్వేగాలతో ఖర్చులు చేయడం మానుకోవాలి. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. అంతేకాదు మీకు ప్రమోషన్ కూడా లభించొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మిక పనులపై ఎక్కువ ఆసక్తి పెరగొచ్చు. మీరు కోల్పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు రావొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుక్రుడు, గురుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఈరోజు ఇల్లు, విద్య లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు కొంత కఠినంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నష్టభయం ఉన్న వ్యాపారాలు లేదా పెట్టుబడులకు దూరంగా ఉండటం ఉత్తమం. మీరు పని చేసే చోట బాధ్యతలు మరింత పెరగొచ్చు. శని దేవుని ప్రభావంతో మీరు కష్టపడి పని చేయడం నేర్చుకుంటారు. మీరు చేసే పనిలో అహం ప్రదర్శించొద్దు. ఉద్యోగులు ఆఫీసులో ఎదురయ్యే సమస్యలను చాలా ఓపికగా ఉండి, ప్రశాంతంగా ఎదుర్కోవాలి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు ఉన్న పరిచయాల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మీ ప్రణాళికలు ఆచరణలో పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయానికి మించి వాగ్దానాలు చేయడం మానుకోవాలి. పొదుపు, సరైన పెట్టుబడులు క్రమంగా మిమ్మల్ని సంపన్నులను చేస్తాయి. ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చు. మీరు చేసిన పనులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ తెలివితేటలతో క్లిష్టమైన పనులను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా గడుపుతారు. మీరు చేసే పనిలో గణనీయమైన విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈరోజు విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి. మీరు చేసే పనిలో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆయుష్మాన్ ప్రభావంతో మీ పనులు సకాలంలో పూర్తవ్వొచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయాణం వల్ల అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ప్రణాళికల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో మంచి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అయితే అతివిశ్వాసంతో ఉండకండి. మీరు చేసే పనిలో పురోగతి లభించొచ్చు. అదేవిధంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు ఒక మార్గదర్శి లేదా గురువు సలహా చాలా సహాయకరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రావొచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీకు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు లభించే అవకాశాలున్నాయి. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. అయితే భాగస్వామ్యం, ఉమ్మడి ఆర్థిక విషయాల గురించి సుదీర్ఘ చర్చలు జరగొచ్చు. మీ ఇంటి ఖర్చులు కూడా పెరగొచ్చు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి పని చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. మీ వాగ్దానాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీకు పనిభారం పెరగొచ్చు. కాబట్టి మీ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు చేసే పనిలో పరిశుభ్రత, ఏకాగ్రతను పాటించాలి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శని, చంద్రుడి అనుగ్రహంతో ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. మీరు బడ్జెట్, పొదుపుకు సంబంధించి మంచి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగంతో పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు క్రమశిక్షణతో పని చేస్తే, ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *