రాశిఫలాలు 18 మే 2026: ఈరోజు సుకర్మ యోగం ప్రభావంతో వృషభం, సింహం సహా ఈ 4 రాశుల వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు
రాశిఫలాలు 18 మే 2026: ఈరోజు సుకర్మ యోగం ప్రభావంతో వృషభం, సింహం సహా ఈ 4 రాశుల వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు
horoscope today 18 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సుకర్మ యోగం ప్రభావంతో సింహం సహా ఈ 5 రాశుల వారు ప్రత్యర్థులపై పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి అధిపతి అయిన కుజుడు, చంద్రుడు రెండు గ్రహాలు కలిసి లగ్న కేంద్రమైన మొదటి స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే ఖర్చులు కూడా పెరగొచ్చు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ ప్రత్యర్థుల పై ఆధిపత్యం చెలాయించొచ్చు. మీ వైవాహిక జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దానధర్మాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు బుధుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మంచి విజయాలు లభించొచ్చు. మీరు చేసే ప్రయత్నాల్లో మంచి విజయం సాధించొచ్చు. ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులను త్వరగా ముగించుకుని, సాయంత్రం మీ కుటుంబంతో కొంత సమయం గడపాలి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆదాయం పెంచుకోవడానికి కొత్త దారులు వెతుక్కుంటారు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తీర్థయాత్రకు వెళ్లేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రాశి వారికి అధిపతి అయిన బుధుడి ప్రభావంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి నుంచి సూర్యుడు పన్నెండో స్థానంలో సంచారం చేయడం కారణంగా మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధించొచ్చు. మీ తెలివితేటలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకార్యాల పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. మీ పిల్లల వివాహాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారు ఈరోజు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయం సాధించొచ్చ. మీ ప్రత్యర్థుల కుట్రలు విఫలమవుతాయి. మీ తెలివితేటలతో వారిపై ఆధిపత్యం చెలాయిస్తారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభం కలగొచ్చు. ఉద్యోగులకు, వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు కొన్ని పరిచయాలు స్నేహంగా మారొచ్చు. ఈరోజు కొన్ని శుభకార్యాల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సి రావొచ్చు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు ఉచ్చ రాశిలో సంచారం చేయడం కారణంగా మీరు చేసే పనుల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కుజుడి అనుగ్రహంతో మీరు చేసే పనుల్లో కొంత విజయం సాధించే అవకాశం ఉంది. అందరి అంచనాలకు అనుగుణంగా జీవించగల మీ సామర్థ్యం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు లభించనుంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు ఈ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో సంచారం చేయనున్నాడు. గురుడు కూడా మిథున రాశిలో ఇదే స్థానంలో ప్రత్యక్షంగా ప్రయాణం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాల ప్రభావంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే ఖర్చులు కూడా పెరగొచ్చు. ఈ సమయంలో మీ శత్రువుతుల చురుగ్గా ఉంటారు. వారు మీ పనులకు ఆటంకం కలిగించొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి నుంచి గురుడు అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. శని పంచమ స్థానంలో ఉండటం కారణంగా మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారులు ఊహించని విధంగా నష్టాలను చూసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు కొన్ని ఒప్పందాలు కుదరకపోవచ్చు. దీంతో కాస్త మీరు నిరాశ చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే మీరు చేసిన పనులకు ప్రశంసలు లభించొచ్చు.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి అధిపతి అయిన గురుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు ఈ రాశి నుంచి ఆరో స్థానంలో రవాణా చేస్తున్నాడు. ప్రభుత్వ పనులకు సంబంధించిన మంచి ఫలితాలు రావొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశాలున్నాయి. మీ కోరికలన్నీ నెరవేరొచ్చు. ఈరోజు రాత్రి కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో విజయం సాధిస్తారు.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి అధిపతి అయిన శని దేవుడు ఈ రాశి నుంచి మూడో స్థానంలో ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. ఇదే సమయంలో దైనందిన జీవితానికి ఆధారమైన చంద్రుడు పంచమ స్థానంలో రవాణా చేస్తున్నాడు. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రముఖ వ్యక్తులను కూడా కలిసే అవకాశాలున్నాయి. మీ ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నతాధికారులతో ఆశీస్సులతో పరిష్కరించబడతాయి. మీ ఆరోగ్యం కొంత క్షీణించొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంతో అద్భుతమైన సమయాన్ని గడిపే అవకాశాలున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి అధిపతి అయిన శని దేవుడు ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. పెద్దల నుంచి మీకు ఆశీస్సులు లభించనున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. మరోవైపు మీ తోబుట్టువులతో విభేదాలు పెరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు మతపరమైన లేదా ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి అధిపతి అయిన గురు గ్రహం ప్రస్తుతం మిథున రాశిలో నాలుగో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. మరోవైపు చంద్రుడు కూడా ఇదే రాశిలో ఉండటం కారణంగా మీకు శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీరు ప్రత్యర్థులను ఓడించే అవకాశాలున్నాయి. వ్యాపారులకు పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవకాశాలున్నాయి. దీంతో మీరు చాలా సంతోషంగా గడుపుతారు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను