రాశిఫలాలు 13 మే 2026: ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు బుధాదిత్య యోగం, రుచక యోగం ప్రభావంతో అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో కొంత గందరగోళం ఉన్నప్పటికీ, కఠోర శ్రమ కారణంగా సమస్యలన్నింటికీ పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు బహుళ వనరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు ఊహించని ఖర్చుల కారణంగా కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి పన్నెండో స్థానంలో బుధాదిత్య యోగం, పదకొండో స్థానంలో విషయోగం ఏర్పడటం వల్ల జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో సామరస్యాన్ని, పరస్పర అవగాహనను కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే చిన్న విషయాలకు విభేదాలు తలెత్తొచ్చు. ఈరోజు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం, ఆవేశంతో మాట్లాడటం వల్ల మీకే నష్టం జరగొచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి బుధాదిత్య యోగం ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. మీ పనులను ప్రణాళిక ప్రకారం కచ్చితంగా పూర్తి చేయొచ్చు. పెండింగులో ఉన్న కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశాలున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం బలపడే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ మాటల్లోనూ, ఆలోచనల్లోనూ ఒక కొత్త ఉత్సాహం తొణికిసలాడుతుంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ధ్యానం చేయడం మంచిది. తొందరపాటుతో తీసుకునే ఏ నిర్ణయమైనా మీకు ఇబ్బందిగా మారొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రాశి నుంచి దశమ స్థానంలో బుధాదిత్య యోగం, ఆదిత్య మంగళ యోగం ఏర్పడటం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుంచి చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ, ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు భాగ్యస్థానంలో కలవడం వల్ల మీకు ఊహించని ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి మీరు ప్రయోజనాలు పొందొచ్చు. విదేశీ వనరుల నుంచి, మీ తండ్రి నుంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి నుంచి చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం కారణంగా అశుభ గ్రహ కూటమి ‘విష యోగం’ ఏర్పడనుంది. ఈ కారణంగా మీకు ఆరోగ్య సమస్యలు రావొచ్చు. మానసికంగా కొంత ఆందోళన ఉండొచ్చు. మరోవైపు గురుడు కర్మ స్థానంలో, శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. మీరు ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మతపరమైన కార్యకలాపాల పట్ల మీరు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కొంత ఆందోళన ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందాలంటే మరింత కష్టపడాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు ప్రత్యర్థుల వ్యూహాలను సమర్థవంతంగా తిప్పికొట్టే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశి నుంచి సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం కారణంగా ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సానుకూల మద్దతు లభిస్తుంది.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్ట్ లేదా ప్రణాళికల్లో మీరు విజయం సాధించొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. శుభ యోగాల కారణంగా మీ కోరికలలో ఒకటి నెరవేరొచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలున్నాయి. ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో ఏర్పడే ‘బుధాదిత్య యోగం’ కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఇతరుల మాటలు విని, వారి ప్రేరణపై ఆధారపడి డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇదే రాశిలో రాహువు సంచారం చేయనున్నాడు. దీనికి తోడు విషయోగం కారణంగా మీకు మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి తగినంత మద్దతు లభిస్తుంది. మీకు బంధువుల నుంచి మద్దతు లభించే అవకాశాలున్నాయి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చంద్రుడు, శనితో కలయిక జరపడం వల్ల అనేక సమస్యలు ఎదురవ్వొచ్చు. ఏదో ఒక నిర్దిష్ట విషయంపై అనవసరమైన మానసిక ఒత్తిడిని, గందరగోళాన్ని అనుభవించొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ స్నేహితుల నుంచి కొన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. మీ తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు తొందరపాటుతో వ్యవహరించడం మానుకోవాలి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.