horoscope today 11 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఇంద్ర యోగం ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఈ 5 రాశులకు అపారమైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

horoscope today 11 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు ఇంద్ర, వైధ్రుతి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు గురు, శని గ్రహాల స్థానాలు మారనున్నాయి. సూర్య, చంద్రుల స్థానాలు అనుకూలంగా ఉండటం, కుజుడి శక్తి కారణంగా కర్కాటకం, సింహం సహా కొన్ని రాశుల వారికి విశేష లాభాలు రానున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా కర్కాటకం, సింహం సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

​మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి వారికి అధిపతిగా ఉండే కుజుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు పదకొండో స్థానంలో రవాణా చేయనున్నాడు. ఈ రెండు గ్రహాల ప్రభావంతో మీ ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ బంధువుల నుంచి కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. వాహనాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుక్రుడి ప్రభావంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ రాశి నుంచి దశమ స్థానంలో కుంభ రాశిలో సంచారం చేస్తున్న రాహువు కారణంగా మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. మీ మాటల్లో సంయమనం పాటించాలి. మీరు ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం ఉంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి నుంచి చంద్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు మనశ్శాంతి లభిస్తుంది. మరోవైపు పదకొండో స్థానంలో ఉన్న బుధుడి ప్రభావంతో శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు కీర్తి, ప్రతిష్టలు పెరగొచ్చు. మీరు సకాలంలో పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. మీకు బంధువుల నుంచి కొంత ఒత్తిడి ఎదురుకావొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. మీ పెండింగ్ పనులు పూర్తవ్వొచ్చు. ఉద్యోగులకు తాము చేసిన పనులకు ప్రశంసలు లభించొచ్చు. మీకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు పని నిమత్తం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. కోర్టు సంబంధిత కేసులలో మంచి విజయం లభించొచ్చు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు,రాహువు కుంభంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలున్నాయి. మీ వ్యక్తిత్వ జీవితం మెరుగుపడుతుంది. పనిలో మీ నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరగొచ్చు. పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి నుంచి ఈరోజు చంద్రుడు ఆరో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపారులు మంచి విజయాలు సాధించొచ్చు. తినడం, తాగడం విషయంలో సంయమనం పాటించాలి. ఈరోజు అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రత్యర్థులను ఓడించే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు మంచి విజయం లభించొచ్చు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించొచ్చు. మీరు చేసే పనుల్లో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచాలి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీకు స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి నుంచి చంద్రుడు నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు మీన రాశిలో సంచారం చేస్తున్న కుజుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశాలున్నాయి. మీ విలువైన వస్తువు పోగొట్టుకునే లేదా దొంగిలించబడే అవకాశాలున్నాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉండొచ్చు. మీరు అదనపు ఆదాయ వనరులు లభించొచ్చు. మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేయొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందొచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. మీకు పెద్దల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఆర్థిక పరంగా మెరుగైన లాభాలు పొందొచ్చు. మీ ఇల్లు, ఆస్తి లేదా వాహనానికి సంబంధించి నిర్ణయాలు సానుకూలంగా ఉండొచ్చు. మీ కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయొచ్చు. ఈరోజు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. మీ ప్రేమ జీవితంలో మెరుగ్గా ఉంటుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు చంద్రుడి ప్రభావంతో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం లభించొచ్చు. మీ ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. మీ ఆహారపు అలవాట్లలో సంయమనం పాటించాలి. మీ బంధువుల నుంచి మెరుగైన ఫలితాలు రావొచ్చు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

 మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. స్నేహానికి సంబంధించిన గురుడి ప్రభావంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీకు రాజకీయ మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీ మాటల్లో సంయమనం పాటించాలి.లి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *