కవిత పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణ రాష్ట్ర సేన పేరులో మార్పు
కవిత పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణ రాష్ట్ర సేన పేరులో మార్పు
ఇటీవలె కొత్త పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తన కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత పేరు పెట్టుకోగా.. దానికి కాకుండా మరో పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుకు బదులుగా తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పార్టీ పేరు టీఆర్ఎస్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.
హైలైట్:
కవిత పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణ రాష్ట్ర సేనకు కాకుండా తెలంగాణ రక్షణ సేనగా మార్పు
అధికారిక ఉత్తర్వులు వెలువరించిన ఎన్నికల సంఘం
Kavitha
కవిత పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలె ఒక కొత్త పార్టీ అవతరించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన కవిత.. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో ఈనెల 25వ తేదీన గ్రాండ్‌గా పార్టీ పేరును ప్రకటించారు. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తమ పార్టీ పేరును రిజిస్ట్రేషన్ కోసం పంపించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన కాకుండా తెలంగాణ రక్షణ సేన పేరును అధికారికంగా కల్వకుంట్ల కవిత పార్టీకి కేటాయిస్తూ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రక్షక సేన పార్టీని గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
టీఆర్‌ఎస్ పార్టీకి అనుమతి ఇస్తూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కల్వకుంట్ల కవిత నివాసంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖను అందించారు. ఈ నెల 25వ తేదీన మేడ్చల్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)గా కవిత ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పేరు ప్రస్తుతం అధికారికంగా కవిత పార్టీకి దక్కడంతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పిగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో కొత్త పొలిటికల్ పార్టీ.. టీఆర్ఎస్ పేరుతో ప్రకటించిన కవిత
మరోవైపు.. పార్టీ పేరును ప్రకటించిన కవిత.. ఇక తన పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది యువకులు.. కవిత పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో వారంతా పార్టీ కండువా కప్పుకున్నారు.