• April 21, 2026

రాశిఫలాలు 21 ఏప్రిల్ 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు ఆర్థిక లాభ సూచనలు

 రాశిఫలాలు 21 ఏప్రిల్ 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు ఆర్థిక లాభ సూచనలు

రాశిఫలాలు 21 ఏప్రిల్ 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు ఆర్థిక లాభ సూచనలు

horoscope today 21 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Apr21

horoscope today 21 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు కుజుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. మిథునంలో చంద్రుడు, గురుడి కలయికతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఇదే సమయంలో చంద్రుడి నుంచి శుక్రుడు పన్నెండో స్థానంలో సంచారం చేయడం కారణంగా అనఫ యోగం, శుక్రుడు తన సొంత రాశిలో ఉండటం కారణంగా మాళవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మేషం, మిథునం సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి నుంచి చంద్రుడు ఈరోజు మూడో స్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా మీకు సాధారణ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ పనులు నెమ్మదిగా సాగొచ్చు. అయితే ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు మీరు ఎలాంటి విషయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీ ఇంటికి కొత్త వాహనం రావొచ్చు.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మాలవ్య రాజయోగం ప్రభావంతో ఉద్యోగులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కోరికలలో ఒకటి ఈరోజు నెరవేరొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు బియ్యం దానం చేయడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధించొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మీ కోరికలలో ఒకటి ఈరోజు నెరవేరొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. పిల్లలకు సంబంధించిన మీ ఆందోళనలన్నీ తొలగిపోతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే, వారికి సన్నిహితుల నుంచి మద్దతు లభించొచ్చు. మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు సూర్యుడి అనుగ్రహం లభించనుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. వ్యాపారవేత్తలు ఈరోజు ఏవైనా పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి వ్యాపారం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఈరోజు హనుమంతుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం పెరగొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. గతంలో మీరు చేసిన తప్పుకు పశ్చాత్తాపపడొచ్చు. మీ పనిని ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలి. మీ కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుంచి అన్ని రంగాల్లో మద్దతు లభిస్తుంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు గురుడి అనుగ్రమంతో శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీ బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తారు. ఈరోజు మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనిలో కొంత ఒత్తిడి ఎదురవుతుంది. అయితే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని రంగాల్లో మద్దతు ఇస్తారు. మరోవైపు మీరు చేసే పనుల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు హనుమంతుడిని పూజించడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభించొచ్చు.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభ యోగాల కారణంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి సప్తమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడటం కారణంగా మీరు ఆశించిన ఫలితాలొస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. మీ పూర్వీకుల నుంచి సంపదను పొందే అవకాశాలున్నాయి. ఈరోజు కొన్నిశుభకార్యాల్లో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు శుభ యోగాల కారణంగా మీకు అనేక సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. ఈరోజు మీరు ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారు మీ పనులకు ఆటంకం కలిగించొచ్చు. ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీరు చేసే పనుల్లో ఎలాంటి మార్పులు చేసినా, అవి విజయవంతం అవుతాయి. వ్యాపారులు ఈరోజు ఆశించిన లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకూడదు. మీ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు శుభ యోగాల ప్రభావంతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. కొత్తగా ఏదైనా చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యా రంగంలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ ఆస్తికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినొచ్చు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *