రాశిఫలాలు 19 ఏప్రిల్ 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో మేషం సహా ఈ 6 రాశులకు శుభ ఫలితాలు

horoscope today 19 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో మేషం, సింహం సహా ఈ 6 రాశులకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Apr19

horoscope today 19 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు ఆయుష్మాన్, సౌభాగ్య, మాళవ్య రాజయోగాలతో పాటు గౌరీ యోగం, కాలనిధి, వశీ యోగాలు ఏర్పడనున్నాయి. చంద్రుడు తన ఉచ్ఛరాశి అయిన వృషభంలోకి ప్రవేశించడంతో గౌరీ యోగం ఏర్పడనుంది. అదేవిధంగా శుక్రుడు కూడా తన సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మేషం, తులా సహా కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా లభించొచ్చు. ఈ శుభ యోగాల కారణంగా మేషం, కర్కాటకం సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశిలో సూర్యుడు తన ఉచ్చరాశిలోకి ప్రవేశించడంతో ఆదిత్య యోగం ఏర్పడనుంది. సూర్యుని అనుగ్రహంతో వీరికి ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభించొచ్చు. కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు శుభ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి అన్ని రంగాల్లో మద్దతు లభిస్తుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​తన సొంత రాశి అయిన వృషభరాశిలో శుక్రుడు ప్రవేశించడంతో మాళవ్య రాజయోగం, ధన యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రావొచ్చు. ఈరోజు మీ పనులను చాలా ఉత్సాహంగా పూర్తి చేసే అవకాశం ఉంది. మతపరమైన, సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మరోవైపు ఉద్యోగులకు కొంత పని ఒత్తిడి ఉంటుంది. అయితే సాయంత్రం నాటికి మీ ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తూనే ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల నుంచి మంచి విజయం సాధిస్తారు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఈరోజు కొత్త వాహనం లేదా కొత్త ఇల్లు కొనే అవకాశాలున్నాయి. మీ ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉంటుది. మీ తల్లి నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు స్వల్ప దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈరోజు వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పెద్ద కోరికలు నెరవేరే అవకాశాలున్నాయి. సూర్యుడి అనుగ్రహంతో మీకు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరగొచ్చు. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు. ఈరోజు మీరు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఏదైనా విహారయాత్రలకు కూడా ప్లాన్ చేస్తారు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీ ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. మీరు ఏదైనా కోర్సులో చేరడానికి ప్రయత్నాలు చేస్తుంటే, మంచి విజయం సాధిస్తారు. ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా లభ్ది పొందే అవకాశాలున్నాయి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి శుక్రుడు అష్టమ స్థానంలో, సూర్యుడు సప్తమ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు కొన్ని శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలున్నాయి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి నుంచి శుక్రుడు, చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. భాగస్వామ్యంతో చేసే పనుల నుంచి మంచి లాభాలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంది. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. మీకు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు మతపరమైన, ధార్మిక పనుల పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనే అవకాశాలున్నాయి. గురు గ్రహం అనుగ్రహంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవ్వొచ్చు. మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరొచ్చు. మీకు తండ్రి నుంచి సహకారం లభిస్తుంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీ ప్రత్యర్థులు మీ పురోగతిని చూసి అసూయ చెందుతారు. పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి నుంచి శుక్ర, చంద్రులు శుభ స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ కారణంగా మీ ఆనందం, శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ తల్లి నుంచి ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలలో చాలా సంతోషంగా ఉంటుంది. కొత్త ఇల్లు కట్టుకోవాలన్న కలను సాకారం చేసేందుకు అడుగులు ముందుకు పడతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించే అవకాశం ఉంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి లాభాలు రావొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి అనేక రంగాల్లో మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు పనికి సంబంధించి స్వల్ప లేదా దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఈరోజు ఏదైనా శుభకార్యంలో పాల్గొనే అవకాశం కూడా మీకు లభిస్తుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

 

 

 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *