Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: వేట కత్తితో శివ దాడి! రోడ్లపై ప్రాణాలకోసం ప్రభావతి పరుగులు.. లక్షల్లో ఖర్చు..

 Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: వేట కత్తితో శివ దాడి! రోడ్లపై ప్రాణాలకోసం ప్రభావతి పరుగులు.. లక్షల్లో ఖర్చు..

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: వేట కత్తితో శివ దాడి! రోడ్లపై ప్రాణాలకోసం ప్రభావతి పరుగులు.. లక్షల్లో ఖర్చు..

Gunde Ninda Gudi Gantalu 2026 April 02 Episode: బాలు, మీనాలు శివ కేసు విషయంలో ఒక లాయర్‌ని కలుస్తారు. అతడు రెండే దారులు అంటూ.. మొదటి ‘కేసు పెట్టింది మీ ఫ్యామిలీ మెంబరే కాబట్టి.. ఆమెను ఒప్పించి కేసు విత్ డ్రా చేయిస్తే సరిపోతుంది’ అని.. రెండొవది డబ్బుతో కూడిన పని అని చెబుతాడు. అయితే మొదటి ప్రయత్నం చేస్తాం అంటూ.. బాలు, మీనాలు.. ప్రభావతి కేసు వెనక్కి తీసుకునేలా మాట్లాడాలి అంటూ సత్యాన్ని రిక్వస్ట్ చేస్తారు. దాంతో సత్యం.. కామాక్షి ఇంట్లో ఉన్న ప్రభావతి దగ్గరకు వెళ్తాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. నేడు (ఏప్రిల్ 02) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. (photo courtesy by star maa and JioHotstar)

Gunde Ninda Gudi Gantalu 2026 April 02 Episode (photo courtesy by star maa and JioHotstar)
గుండెనిండా గుడిగంటలు సీరియల్(photo courtesy by star maa and JioHotstar)
Gunde Ninda Gudi Gantalu 2026 April 02 Episode: సత్యం తన కోసం వచ్చాడనే ఆనందాన్ని ప్రభావతి పైకి కనిపించకుండా గంబీరంగా నటిస్తూ.. ఎందుకొచ్చారు అంటుంది. కేసు వెనక్కి తీసుకో అని రిక్వస్ట్ చేస్తాడు. ‘సరే కేసు వెనక్కి తీసుకుంటాను.. అయితే ఆ బాలు, మీనా నా ఇంట్లో ఉండకూడదు.. వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోతే నేను కేసు వెనక్కి తీసుకుంటాను’ అని కండీషన్ పెడుతుంది ప్రభావతి. దాంతో సత్యానికి కోపం వస్తుంది. కోపాన్ని ఆపుకుంటూ.. ‘నిన్నులాగిపెట్టి కొట్టాలనే ఉంది.. కానీ కామాక్షి ముందు కొట్టడం ఇష్టం లేక వెళ్లిపోతున్నా’ అనే అర్థం వచ్చేలా మాట్లాడి.. అక్కడి వెళ్లిపోతాడు. ప్రభావతి.. కామాక్షితో.. ‘వెళ్లిపోయారంటావా కామాక్షీ.. కాస్త చూసిరా’ అంటుంది. ‘నాకేం పని నువ్వే చూసుకో’ అంటుంది కామాక్షి. దాంతో ప్రభావతి వెనుకే పరుగుతీస్తుంది. సత్యం గుమ్మం బయట ఉండగానే.. రోహిణీ, మనోజ్ ఎదురుపడతారు. ‘మీరేంటి నాన్నాఇక్కడా?’ అంటాడు మనోజ్ సత్యంతో. గుమ్మం దాకా వచ్చిన ప్రభావతి కోపంగా.. ‘వాడెవరో దొంగ ఉన్నాడు కదా..వాడి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోమని కోరడానికి వచ్చారు’ అంటుంది వెటకారంగా.

సత్యం కోపం..

సత్యం కోపం..

సత్యం కోపం..
దాంతో మనోజ్.. ‘ఏంటి నాన్నా మీరు.. ఎవరి కోసమే అమ్మని బాధపెడతారు.. ముందు అమ్మ గురించి ఆలోచించండి’ అని వాగుతాడు. రోహిణీ కూడా అదే మాట అంటుంది. దాంతో సత్యం కోపంగా ఆ ముగ్గురినీ ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ప్రభావతి విసుగ్గా లోపలికి వెళ్తుంది. వెనుకే వెళ్లిన రోహిణీ, మనోజ్‌లు.. ప్రభావతిని ఇంటికి రమ్మని బతిమలాడతారు. ‘అమ్మా నువ్వు ఇంటికి వచ్చెయ్ అమ్మా.. నువ్వు లేకపోతే అక్కడ మాకు విలువే లేకుండా చూస్తున్నారు’ అంటూ మనోజ్ రిక్వస్ట్ చేస్తాడు.

కామాక్షీ చురకలతో ఫుల్ కామెడీ..
కామాక్షీ చురకలతో ఫుల్ కామెడీ..

కామాక్షీ చురకలతో ఫుల్ కామెడీ..
రోహిణీ కూడా.. ప్రభావతితో.. ‘అత్తయ్యా మీరు ఇంట్లో లేకపోతే ఇల్లు ఇల్లులా లేదు’ అంటుంది. అక్కడే ఉన్న కామాక్షీ.. ‘ఎప్పుడూ రచ్చ రచ్చగా ఉండే ఇల్లూ.. ఒక్కసారి నువ్వులేక నిశబ్దంగా మారేసరికి పాపం పిల్లలు తట్టులేకపోతున్నారనుకుంటా వదినా’ అని చురకలు వేస్తుంది. రగిలిపోయిన ప్రభావతి.. ‘నువ్వుఆగు కామాక్షీ’ అంటూనే..‘నేను వద్దు అంటున్నారు కదా.. చూస్తాను నేను ఎంత కాలం వద్దో.. నేను ఆ మీనా ఉన్న కొంపకు రానంటే రాను’ అంటుంది. వెంటనే కామాక్షీ.. ‘ఇదిగో మనోజూ.. కాస్త వృద్ధాశ్రమంలో మీ అమ్మకు ఒక సీట్ ఉంచమని ముందే మాట్లాడు’ అంటూ చరుకలు వేస్తుంది. ‘కామాక్షీ’ అంటూ ప్రభావతి రగిలిపోతుంది. అక్కడితో ఆ సీన్ ముగిసింది.

శ్రుతి ఐడియా..

శ్రుతి ఐడియా..
మరోవైపు సత్యం ఇంటికి వెళ్లి.. మీనా బాలులకు జరిగింది చెబుతాడు. ‘మీ అమ్మ కేసు వెనక్కి తీసుకోదట.. తీసుకోవాలంటే మీరిద్దరూ ఇంట్లో ఉండకూడదట’ అంటాడు. బాలు, మీనా అల్లాడిపోతుంటే.. అక్కడే ఉన్న శ్రుతి, రవిలు.. ప్రభావతికి మనసే లేదు అని తిడతారు. శ్రుతి అయితే.. ‘మీనా లేకుండా ఈ ఇంట్లో పనులే నడవవు కదా.. అసలు కేసు తీసుకునేదాకా నాలుగు రోజులు బాలు, మీనాలను బయటికి పంపించండి అంకుల్.. నేను, రోహిణీ ఎలాగో పనులు చెయ్యం కాబట్టి చచ్చినట్లు ఆంటీనే మీనా, బాలులను వెనక్కి తీసుకొస్తుంది’ అంటుంది.

ఇక నేను చూసుకుంటానులే నాన్నా..

ఇక నేను చూసుకుంటానులే నాన్నా..
శ్రుతి అలా ఐడియా ఇవ్వగానే.. రవి అనుమానంగా.. ‘నువ్వు చెప్పినట్లు కాకుండా.. మా అమ్మ పని మనిషిని పెట్టుకుంటే?’ అంటాడు. ‘మీ అమ్మ టార్చర్‌కి ఏ పని మనిషి వస్తుంది? మీనానే కావాలంటుంది చివరికి’ అంటుంది శ్రుతి. అంతా విన్న సత్యం.. ‘అసలు నా కొడుకుని నేను బయటికి పంపిస్తే కదా.. వాడు లేకుండా నేను ఉండగలనా’ అంటాడు ఆవేదనగా. దాంతో బాలు ఎమోషనల్ అవుతాడు. తండ్రి చేతుల్ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘ఇక నేను చూసుకుంటానులే నాన్నా ఆలోచించొద్దు’ అనేసి మీనాను తీసుకుని మళ్లీ లాయర్ దగ్గరకు వెళ్తాడు.

రూ. 5 లక్షలు రెడీ చేసుకోండి.. నేను చూసుకుంటాను.. లాయర్ క్లారిటీ..

రూ. 5 లక్షలు రెడీ చేసుకోండి.. నేను చూసుకుంటాను.. లాయర్ క్లారిటీ..
ఇక ఆ లాయర్‌తో.. ‘మా అమ్మగారు కేసు వెనక్కి తీసుకునేలా లేదు.. ఎలా అయినా శివను మీరే కాపాడాలి.. చిన్న పిల్లాడు.. వాడి భవిష్యత్ పాడు కాకూడదు’ అంటాడు. దాంతో లాయర్.. ‘అలా అయితే రూ.5 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు డబ్బు ఏర్పాటు చేసుకోండి.. మిగిలింది నేను చూసుకుంటాను’ అంటాడు. సార్ అంత డబ్బు మా వల్ల కాదు అని మీనా, బాలు రిక్వస్ట్ చేసినా.. కనీసం రూ.5 లక్షలు లేకపోతే పని జరగదు అంటాడు లాయర్. దాంతో మీనా, బాలు బయటికి వెళ్లిపోతారు. ఒక వడ్డీ వ్యాపారి దగ్గర రెండు లక్షలు అప్పుగా తీసుకుంటాడు బాలు. రాజేష్ తన దగ్గరున్న 25 వేలు ఇస్తాడు. పార్వతమ్మ కూడా విషయం తెలుసుకుని తన దగ్గరున్న డబ్బుని సమకూరుస్తుంది.

కేసు వెనక్కి తీసుకోమని లాయర్ రిక్వస్ట్..

కేసు వెనక్కి తీసుకోమని లాయర్ రిక్వస్ట్..
మరోవైపు సత్యం కూడా తాను దాచుకున్న రూ.50 వేలు బాలుకి ఇస్తాడు. అక్కడితో రూ.4 లక్షల 50 వేలు అవుతాయి మొత్తం. దాంతో బాలు, మీనాలు లాయర్ దగ్గరకు వెళ్లి.. ‘మిగిలిన రూ.50 వేలు రెండు రోజుల్లో సద్దుతాం.. పని పూర్తి చేయండి’ అని చాలా రిక్వస్ట్ చేస్తారు. దాంతో అతడు సరే అంటాడు. ఇక లాయర్ తన అసిస్టెంట్‌ని తీసుకుని కామాక్షి ఇంట్లో ఉన్న ప్రభావతి దగ్గరకు వెళ్తాడు. అప్పటికే ప్రభావతి మనస్తత్వం, ఆమె పూర్తి వివరాలు లాయర్ సంపాదిస్తాడు. ‘కేసు వెనక్కి తీసుకోవాలని మొదట చాలా కూల్‌గా అడుగుతాడు లాయర్. కుదరదంటే కుదరంటుంది ప్రభావతి.

ప్రభావతిని వణికించిన లాయర్..

ప్రభావతిని వణికించిన లాయర్..
ప్రభావతి మనస్తత్వం తెలిసిన లాయర్.. ఇక భయపెట్టడం స్టార్ట్ చేస్తాడు. ‘కేసు వెనక్కి తీసుకోకపోతే చిన్న కుర్రాడి జీవితం నాశనం అయిపోతుంది. పైగా అతడు దొంగతనం ఉద్దేశంతో నేరం చెయ్యలేదు.. మీ మీద కోపంతోనే చేశాడు. అలాగే మీరు చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా ఇంటికి వెళ్లి చెప్పుతో కొట్టారు. అందుకు బస్తీ వాళ్లంతా సాక్ష్యం. ఎలా దొంగలించిన డబ్బు తిరిగి ఇచ్చేశాడు కాబట్టి.. తిరిగి మీ మీద కేసు పడే అవకాశం ఉంది’ అంటూ వణికిస్తాడు. అయినా ప్రభావతి భయపడుతుంది తప్పితే తగ్గదు. కేసు వెనక్కి తీసుకుంటాను అనదు.

శివ వేట కత్తితో దాడి.. ప్రభావతి పరుగో పరుగు..

శివ వేట కత్తితో దాడి.. ప్రభావతి పరుగో పరుగు..
ఇక కామాక్షీ చురకలు, జ్యోకులు మామూలుగా ఉండవు. ‘మా వదిన చాలా మంది సార్.. మీరు అన్నట్లే ఆ శివ లక్ష తిరిగి ఇచ్చేశాడు.. ఆ డబ్బునే మూడు రోజుల వడ్డీకి తిప్పుతూ వడ్డీ ఇస్తున్నాను మా వదినకి.. ఇలాగే దొంగసొమ్ము అయినా ఇంట్లో నొక్కేసిన సొమ్ము అయినా నాదగ్గరే దాచి, వడ్డీలకు తిప్పిస్తుంది మా వదిన’ అంటూ అంతా చెబుతూ ఉంటుంది. ఇక లాయర్ తగ్గదు. ‘చూడండి ప్రభావతి గారు.. అసలే శివ మీ మీద కోపంతో ఇదంతా చేశాడని తెలిసింది. రేపు శిక్ష పడిన తర్వాత తిరిగి వచ్చి ఏ వేట కత్తితోనో మీ మీదకు వచ్చి మిమ్మల్ని చంపేస్తే ఏం చేస్తారు?’ అంటాడు. అంతే ప్రభావతి ఊహల్లోకి పోతుంది. నిజంగానే శివ వేట కత్తితో రోడ్డు మీద పరిగెత్తించి పరిగెత్తించి నరికేసినట్లు ఊహించుకుని కెవ్వుమంటుంది.

రూ.2 లక్షలకు బేరం..

రూ.2 లక్షలకు బేరం..
శివ తనని నరికి చంపినట్లు ఊహించుకోగానే.. చెమటలు తుడుచుకుని గటగటా నీళ్లు తాగేస్తుంది ప్రభావతి. వెంటనే లాయర్.. ‘పోనీ జరిగిన నష్టానికి డబ్బు ఇప్పిస్తాను.. రూ.50 వేలు సరిపోతాయా?’ అంటాడు. కాస్త తగ్గుతుంది ప్రభావతి. ‘చాలవు’ అంటుంది. లక్ష చాల? అంటాడు లాయర్. అలా రెండు లక్ష వరకూ బేరం ఆడి.. ప్రభావతి తగ్గకపోవడంతో.. ‘సరే మీ ఇష్టం.. కేసు ఎలా వెనక్కి తీయించాలో నాకు తెలుసులెండి’ అని అసిస్టెంట్‌తో వెళ్లబోతుంటాడు. రెండు లక్షలకు కక్కుర్తిపడిన ప్రభావతి.. ‘కామాక్షీ వాళ్లని పిలువు’ అంటుంది. కామాక్షి పిలుస్తుంది.

బాలుకి కాల్ చేసి విషయం చెప్పిన లాయర్..

బాలుకి కాల్ చేసి విషయం చెప్పిన లాయర్..
‘డబ్బు తీసుకున్న సంగతి ఎవరికీ తెలియకూడదు మరి’ అంటుంది ప్రభావతి.. లాయర్‌తో. ‘సరే’ అంటూ బాలు ఇచ్చిన రూ.5 లక్షల్లో రెండు లక్షలు ప్రభావతి చేతిలో పెడతాడు. వెంటనే ప్రభావతి.. మీనాక్షికి ఇచ్చి.. ‘ఈ డబ్బు నీ దగ్గరే దాచిపెట్టు.. నేను కేసు వెనక్కి తీసుకుని వస్తాను’ అని వాళ్లతో పాటు స్టేషన్‌కి వెళ్తుంది. సంతకం పెట్టి శివను విడిపిస్తుంది. ఇక లాయర్.. బాలుకి కాల్ చేసి.. ‘మీ అమ్మగారు కేసు వెనక్కి తీసుకున్నారు.. శివ సేఫ్’ అంటాడు. మొదట బాలు నమ్మడు. ‘మీరు మా అమ్మ ప్రభావతి దగ్గరకే వెళ్లారా? ఆవిడ ఎలా మారింది.? ఎలా ఒప్పుకుంది?’ అని ఆరా తీస్తాడు.

శివను తీసుకుని పార్వతమ్మ ఇంటికి వెళ్లిన మీనా, బాలు..

శివను తీసుకుని పార్వతమ్మ ఇంటికి వెళ్లిన మీనా, బాలు..
లాయర్ మనసులో.. ‘నేను రెండు లక్షలు బొ*** పెట్టుకుంటే మారింది’ అనుకుంటూ.. ‘నిజంగానే మీ అమ్మగారు మారి సంతకం చేశారు.. శివను తీసుకెళ్లొచ్చు’ అని చెబుతాడు. అక్కడే ఉన్న మీనా, సత్యాలకు విషయం చెప్పగానే సంతోషిస్తారు. రవి, శ్రుతిలతో పాటు మనోజ్, రోహిణీలు కూడా.. ప్రభావతి కేసు వెనక్కి తీసుకుంది అంటే మొదట నమ్మరు. తర్వాత ఇది ఎలా సాధ్యం అని తల పట్టుకుంటారు. ఇక రోహిణీ అయితే వెటకారంగా.. ‘దొంగలను అరెస్ట్ చేస్తే కరెక్ట్.. అలా ఎలా వదిలేశారు అత్తయ్యా’ అంటుంది. దాంతో మీనా కోపంగా.. ‘మీ నాన్న మూడు నెలలుగా జైల్లోనే ఉన్నారు కదా.. పోలీసులు పిచ్చోళ్లు కాదులే.. పరివర్తన కోసమే జైలులో ఉంచినట్లు ఉన్నారు’ అని చురకలు వేసి నోరు మూయిస్తుంది. ఇక బాలు, మీనాలు స్టేషన్‌కి వెళ్లి శివను తీసుకుని .. పార్వతమ్మ ఇంటికి వెళ్తారు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *