రంజాన్: పేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపిన నారా లోకేష్..
రంజాన్: పేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపిన నారా లోకేష్..
రంజాన్ పండుగ సందర్బంగా ఓ నిరుపేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపారు మంత్రి నారా లోకేష్. గతేడాది రంజాన్ పండుగ సందర్భంగా మంగళగిరిలో షేక్ షెహన్సా అనే ముస్లిం ఇంటిని సందర్శించారు నారా లోకేష్. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే తమకు కొత్త ఇల్లు కట్టించి ఇవ్వాలని షెహన్సా కుటుంబం నారా లోకేష్‌ను కోరింది. దీంతో ఏడాది తిరగకుండానే వారికి కొత్త ఇంటిని అందించారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆ కుటుంబం నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.
Nara lokesh New house muslim family
మంగళగిరి ముస్లిం ఇల్లు నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మైనార్టీ కుటుంబానికి కొత్త ఇల్లు కట్టించి.. ఆ కుటుంబంలో రంజాన్ పండుగ వెలుగులు నింపారు. గతేడాది రంజాన్ సందర్భంగా నారా లోకేష్.. మంగళగిరి బస్టాండ్ సమీపంలోని షేక్ షహెన్సా అనే ముస్లిం ఇంటిని నారా లోకేష్ సందర్శించారు. షహెన్సా కుటుంబసభ్యులతో ముచ్చటించిన నారా లోకేష్.. ఇఫ్తార్ విందు స్వీకరించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. షహెన్సా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు నివసిస్తున్న ఇంటిని పరిశీలించారు నారా లోకేష్. ఇల్లు పాతపడిపోయి ఉండటంతో వివరాలను తెలుసుకున్నారు.
అది తమ పూర్వీకులు నిర్మించిన రేకుల ఇల్లు అని.. ప్రభుత్వం తరుఫున తమకు కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని షహెన్సా కుటుంబం ఈ సందర్భంగా నారా లోకేష్‌ను కోరింది. దీంతో ఆ కుటుంబం బాధ్యతను తాను తీసుకుంటానన్న నారా లోకేష్.. వారికి కొత్త ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే.. ఏడాది లోపు కొత్త ఇంటిని నిర్మించి.. షహెన్సా కుటుంబానికి అప్పగించారు. దీంతో షహెన్సా కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. నారా లోకేష్ తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని షహెన్సా కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ షహెన్సా కుటుంబానికి కట్టించిన కొత్త ఇంటి వీడియోను, ఆ కుటుంబం ఆనందాన్ని ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు.
‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల...
March 22, 2026