రాశిఫలాలు 04 మార్చి 2026:కుంభంలో కుజుడు-రాహువు కలయిక వేళ వృశ్చికం, మకరం సహా కొన్ని రాశుల వారు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త

horoscope today 04 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు కన్యా రాశిలో చంద్రుడి సంచారం, కుంభంలో రాహువు, కుజుడి కలయిక కారణంగా ద్వాదశ రాశుల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

horoscope today 04 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు బుధుడి తిరోగమనం, కుంభంలో రాహువు, కుజుడి కలయిక కారణంగా మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు చాలా ఓపికగా, జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు సూర్యుడి అనుగ్రహంతో కొందరికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం దుష్ట గ్రహాల సహవాసంలో ఉన్నాడు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లిష్ట పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి పంచమ స్థానం అశుభంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా మీ పిల్లల నుంచి నిరాశపరిచే వార్తలను వినొచ్చు. అయితే సాయంత్రం నాటికి కొన్ని పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఈరోజు తాము చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. వ్యాపారులు కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు కొందరు వ్యక్తులను కలవడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారు ఈరోజు బుధుడి ప్రభావంతో కొంత ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకుంటారేమో అనే ఆందోళన ఉంటుంది. అయితే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. సాయంత్రం నాటికి మీ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశికి అధిపతిగా ఉండే చంద్రుడు ఈరోజు మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభించొచ్చు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. పిల్లల పట్ల బాధ్యతలు నెరవేరొచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం మీ ప్రియమైన వారిని కలుస్తారు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వింటారు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి అధిపతిగా ఉండే సూర్యుడి అనుగ్రహంతో మీకు కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. మీ మాటతీరుతో చాలా మందిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో మీకు సమాజంలో గౌరవం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు ప్రత్యేక విజయాలు సాధించొచ్చు. అంతేకాదు శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. సూర్యుని ప్రభావంతో ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి బుధుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు తాము చేసే నిరంతర ప్రయత్నాల వల్ల మంచి విజయాలు సాధించొచ్చు. మీ పిల్లలు కూడా ఆహ్లాదకరమైన వార్తలను వింటారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మరోవైపు కోర్టు సంబంధిత కేసులలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుక్రుడి అనుగ్రహంతో మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులందరితో ఆనందం పెరుగుతుంది. ఆర్థిక పరమైన సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చేసే దూర ప్రయాణాల వల్ల సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శని, చంద్రుడి ప్రభావంతో ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. ఇలాంటప్పుడు మంచి వైద్యుడిని సంప్రదించాలి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి నుంచి గురుడు అష్టమ స్థానంలో తిరోగమనం కారణంగా మీకు రావాల్సిన బకాయిలు ఆలస్యం కావొచ్చు. మరోవైపు చంద్రుడు పదకొండో స్థానంలో సంచారం చేస్తూ కొన్ని శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు గురుడి అనుగ్రహంతో ప్రత్యర్థుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించే అవకాశాలున్నాయి. మీకు బంధువుల నుంచి గణనీయమైన మొత్తంలో ఆదాయం లభించొచ్చు. సాయంత్రం నుంచి రాత్రి వరకు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శని దేవుని అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాలలో మంచి విజయం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు ఎవరితోనూ వాదనలు పెంచుకోకుండా ఉండాలి. రాత్రివేళలో మీ ప్రియమైన అతిథులను కలిసే అవకాశం ఉంటుంది. మీ తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శని దేవుని ప్రభావంతో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొందరు వ్యక్తులతో వివాదాలు పెరగొచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొన్ని ప్రతికూల వార్తలు వినడం వల్ల మీరు ఆకస్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపారులు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుక్రుడి ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో చాలా కాలంగా ఉన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బంధువులతో వాదనలు పెంచుకోకుండా ఉండాలి. ఈరోజు మతపరమైన ప్రదేశాలకు వెళ్లి దానధర్మాలు చేయొచ్చు. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *