Brahmamudi Today ఫిబ్రవరి 26 ఎపిసోడ్: కన్నుమూసిన కావ్య, రాజ్.. రుద్రాణిని చంపేసి బిడ్డని కాపాడిన కావ్య.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌లు
Brahmamudi Today ఫిబ్రవరి 26 ఎపిసోడ్: కన్నుమూసిన కావ్య, రాజ్.. రుద్రాణిని చంపేసి బిడ్డని కాపాడిన కావ్య.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌లు
బ్రహ్మముడి సీరియల్
దుగ్గిరాల ఫ్యామిలీని అల్ల కల్లోలం చేసి సర్వనాశనం చేసింది రుద్రాణి. రాజ్ ప్రాణాలను తీయడానికి చూసిన రాహుల్.. తాను తవ్విన గోతిలో తానే పడ్డట్టుగా రాజ్ చేతిలో కాల్చివేయబడ్డాడు నిన్నటి ఎపిసోడ్‌లో. ఇక ఈరోజు (ఫిబ్రవరి 26) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. రాహుల్‌ని కాల్చేసి బాధపడుతూ ఉంటాడు రాజ్. ఇంతలో వెనుక నుంచి రుద్రాణి.. రాజ్ తలపై బలంగా కొడుతుంది. దెబ్బకి కావ్య పక్కనే పడిపోతాడు రాజ్. కొన ఊపిరితో ఉన్న రాహుల్‌ని చూసి అల్లాడిపోతుంది రుద్రాణి. ‘ సారీ మమ్మీ.. నీ ప్లాన్‌ని సక్సెస్ చేయలేకపోయాను’ అంటూ కన్ను మూస్తాడు రాహుల్. దాంతో రుద్రాణి.. రాహుల్ రాహుల్ అంటూ బోరున ఏడుస్తూ రేయ్ అంటూ.. రాజ్ దగ్గరకు వెళ్తుంది. ఎందుకురా..ఎందుకు నా కొడుకుని చంపేశావ్.. ఎవ్వర్నీ వదిలిపెట్టను.. అంటూ రాజ్ తలపై పిచ్చ కొట్టుడు కొడుతుంది. వదిలెయ్ రుద్రాణీ అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడుతుంది అపర్ణ. దాంతో రుద్రాణి.. ‘నా వారసుడ్ని మీరు చంపారు కదా.. ఇప్పుడు నీ వారసురాల్ని నేను చంపుతాను’ అంటూ అపర్ణ చేతిలో ఉన్న పసిపిల్లలకు గన్ గురిపెడుతుంది రుద్రాణి.
లే కళావతీ.. లే.. మన పిల్లల్ని కాపాడూ
లే కళావతీ.. లే.. మన పిల్లల్ని కాపాడూ
ఇంతలో కొన ఊపిరితో ఉన్న రాజ్.. కావ్య చేయి పట్టుకుని.. ‘మన పిల్లల్ని కాపాడలేకపోయాను కళావతీ.. నువ్వే వాళ్లని కాపాడాలి కళావతీ.. నీ కడుపులో పెరుగుతున్న కూతురి కోసం నీ ప్రాణం ఇవ్వాలనుకున్నావ్ కదా.. ఇప్పుడు ఆ పాపే ప్రమాదంలో ఉంది.. కాపాడు కళావతీ.. కాపాడు. మన ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు.. శాశ్వతంగా ఉండిపోతుంది అని అన్నావ్ కదా.. ఇప్పుడు ఆ ప్రేమే ప్రమాదంలో ఉంది. లే కళావతీ వెళ్లి కాపాడు లే.. లే’ అని అంటాడు. ఇక అపర్ణ అయితే.. ‘వద్దు రుద్రాణీ.. నీకు దండం పెడతాను. పిల్లల్ని చంపొద్దు’ అని ప్రాధేయపడుతుంది.
పసి పిల్లలు రుద్రాణి.. వదిలిపెట్టూ.. నీ కాళ్లు పట్టుకుంటా
‘ఏంటే వదిలేసేదీ.. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఏడ్చాను.. కానీ ఇంట్లో నుంచి గెంటేశావ్.. అప్పుడు జాలి అనిపించలేదా నీకు? ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదు.. అందర్నీ చంపేస్తా’ అని అంటుంది రుద్రాణి. ‘పసి పిల్లలు రుద్రాణీ.. నీ కాళ్లు పట్టుకుంటాను.. వదిలెయ్’ అని కన్నీటిపర్యంతం అవుతుంది అపర్ణ. అటు రాజ్.. లే కళావతీ.. లే.. పిల్లల్ని కాపాడు అని పెద్దగా అరుస్తాడు. ఆ పిలుపుతో కళావతిలో చలనం కలుగుతుంది. కర్ర తీసుకుని రుద్రాణి చేతిలో ఉన్న గన్‌ని గురిపెట్టి కొడుతుంది. దాంతో గన్ కిందపడిపోతుంది. అయితే ఆ సీన్ తీయడం రాలేదో ఏమో కానీ.. సీన్ చూపించకుండా జరిగింది ఇదే అన్నట్టుగా మమ అనిపించారు. ఇక కావ్య..‘ ‘ఏవండీ.. నా ప్రాణం అడ్డుగా పెట్టైనా సరే.. పిల్లల్ని కాపాడతాను’ అంటూ పైకి లేస్తుంది.
‘ఏంటే వదిలేసేదీ.. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఏడ్చాను.. కానీ ఇంట్లో నుంచి గెంటేశావ్.. అప్పుడు జాలి అనిపించలేదా నీకు? ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదు.. అందర్నీ చంపేస్తా’ అని అంటుంది రుద్రాణి. ‘పసి పిల్లలు రుద్రాణీ.. నీ కాళ్లు పట్టుకుంటాను.. వదిలెయ్’ అని కన్నీటిపర్యంతం అవుతుంది అపర్ణ. అటు రాజ్.. లే కళావతీ.. లే.. పిల్లల్ని కాపాడు అని పెద్దగా అరుస్తాడు. ఆ పిలుపుతో కళావతిలో చలనం కలుగుతుంది. కర్ర తీసుకుని రుద్రాణి చేతిలో ఉన్న గన్‌ని గురిపెట్టి కొడుతుంది. దాంతో గన్ కిందపడిపోతుంది. అయితే ఆ సీన్ తీయడం రాలేదో ఏమో కానీ.. సీన్ చూపించకుండా జరిగింది ఇదే అన్నట్టుగా మమ అనిపించారు. ఇక కావ్య..‘ ‘ఏవండీ.. నా ప్రాణం అడ్డుగా పెట్టైనా సరే.. పిల్లల్ని కాపాడతాను’ అంటూ పైకి లేస్తుంది.
నీ కొడుకు చచ్చాడూ.. మిగిలింది నువ్వే
ఏంటే కాపాడేదీ.. నేను బతికి ఉండగా వాళ్లని కాపాడలేవ్.. నా కొడుకుని దూరం చేసిన నీ ఫ్యామిలీలో ఒక్కర్ని కూడా బతికనివ్వను అని అంటుంది రుద్రాణి. నువ్వు నీ కొడుకు పుణ్యాలు చేశారా? వందల ఏళ్లు బతకడానికి? మమ్మల్ని చంపాలని చూశారు.. అందుకే వాడికి మా ఆయన చేతిలో సరైన గతే పట్టింది అని అంటుంది కావ్య. ఇంతసేపు కావ్య పడుకునే ఉంది కదా.. మరి రాజ్.. రాహుల్‌ని చంపేసిన విషయం ఈమె ఎలా తెలుసు? అనే లాజిక్‌లు లాగొద్దే.. అదంతే అలా తెలిసిపోద్దంతే. ‘నీ కొడుకు చచ్చాడు.. ఇక మిగిలింది నువ్వే.. అడుక్కుతినాల్సిన మిమ్మల్ని అక్కున చేర్చుకుంది ఈ కుటుంబం. నీకు బతికే అర్హతలేదు’ అని అంటుంది కావ్య.
ఇప్పుడు చేయవే నీ కొడుకుని మహారాజుని.. పాడెపై పెట్టి ఊరేగించు
ఆ మాటతో రుద్రాణి.. ‘ఆపెహే.. నువ్వేమైనా మీర్జాపూర్ రాణివా? కుండలకు రంగులేసుకునేదానివి. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అని అంటుంది. ‘అవునే.. నేను కుండలు అమ్ముకున్నా.. కానీ నీలా దిగజారలేదు’ అని అంటుంది కావ్య. ఇలాంటి నీతి మాటలు చెప్పే ఈ ఇంటికి మహారాణివై కూర్చుకున్నావ్.. నువ్వువి మారవే.. నువ్వు వచ్చినప్పటి నుంచే నేను అనుకున్నదేదీ జరగలేదు.. నువ్వులేకపోతే నా కొడుకుని ఎప్పుడో ఆ ఇంటికి మహారాజుని చేసేదాన్ని అని అంటుంది రుద్రాణి. ‘ఇప్పుడు చేయవే.. కళ్ల ముందు శవంలా పడిఉన్నాడుగా.. ఇప్పుడు చెయ్ మహారాజుని.. తీసుకెళ్లి పాడెపై పెట్టి మహారాజుని చెయ్’ అని అంటుంది కావ్య.
త్రిశూలంతో రుద్రాణిని చంపేసిన కావ్య.. ఓన్లీ వన్స్ ఫసక్
నా కొడుకునొక్కడ్నే ఎందుకు పాడె ఎక్కిస్తానే.. వాడికి తోడుగా మీ అందర్నీ పంపిస్తా అంటూ కావ్య పీక నొక్కేయబోతుంది రుద్రాణి. కావ్యని దూరంగా నెట్టేయడంతో వెళ్లి అమ్మవారి ముందున్న త్రిశూలం ముందు పడుతుంది. ‘ఏయ్.. నీ కళ్ల ముందే నీ కూతుర్ని చంపుతున్నా.. గుండెలు పగులేలా ఏడు’ అని కావ్య కూతుర్ని చంపేయబోతుంది రుద్రాణి. దాంతో కావ్య.. అమ్మవారి ముందున్న త్రిశూలం తీసుకుని వెళ్లి రుద్రాణిని కసక్ మని పొడిచి చంపేస్తుంది. రుద్రాణిని కసితీరా పొడిచి పొడిచి చంపేస్తుంది కావ్య. అటు అన్న చావుని.. ఇటు తల్లి చావుని కళ్లారా చూస్తుంది శ్రియ.
నా కథ ఇక్కడితో ముగిసిపోయింది అత్తయ్యా.. అడ్డడ్డే కావ్య కూడా ఫసక్
ఆ తరువాత అపర్ణ దగ్గరకు వెళ్లి.. ఆమె చేతిలో ఉన్న బిడ్డని పట్టుకుని.. ‘నా కూతురి బాధ్యతని మీ చేతుల్లో పెడుతున్నాను అత్తయ్యా’ అని అంటుంది కావ్య. అలా అనకే.. నీకేం కాదు.. హాస్పిటల్‌కి వెళ్దాం అని అంటుంది అపర్ణ. ‘మీ అబ్బాయితో నాకు మూడు ముళ్లు పడినప్పుడే నాకు బ్రహ్మముడి పడిపోయింది అత్తయ్యా.. తను లేకపోతే నేను ఉండను. నా చావు నాకు కనిపిస్తుంది అత్తయ్యా.. నా కథ ఇక్కడితో ముగిసిపోయింది అత్తయ్యా.. దయచేసి నాకొక మాట ఇవ్వండి.. ఏం జరిగినా సరే మీరు నా కూతురితోనే ఉండాలి. తను భవిష్యత్‌ని మీరు ఆశపడినట్టుగా తీర్చిదిద్దాలి. మన దుగ్గిరాల ఇంటిపేరుని నా కూతురికి అందివ్వండి అత్తయ్యా.. అందివ్వండి.. మా ఇవ్వండి’ అని అంటుంది కావ్య. అపర్ణ చేతిలో చేయి వేసి మాట ఇవ్వగానే.. కావ్య కన్నుమూస్తుంది.