రాశిఫలాలు 25 జూన్ 2026: ఈరోజు నిర్జల ఏకాదశి వేళ కర్కాటకం సహా ఈ 5 రాశులకు ధనలాభ యోగం
రాశిఫలాలు 25 జూన్ 2026: ఈరోజు నిర్జల ఏకాదశి వేళ కర్కాటకం సహా ఈ 5 రాశులకు ధనలాభ యోగం
horoscope today 25 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. గురు గ్రహం తన ఉచ్ఛ రాశిలో ఉండటం, చంద్రుడు నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో సూర్యుడు మిథున రాశిలో, గురుడు, బుధుడు, శుక్ర గ్రహాలు రెండో స్థానంలో సంచారం చేయనున్నాయి. ఈ గ్రహాల ప్రభావంతో ఉభయచారి, సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించబడొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీకు సహోద్యోగుల సహకారం లభించొచ్చు. ఈ కారణంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయొచ్చు. సప్తమ స్థానం నుంచి చంద్రుని సంచారం కారణంగా మానసిక బలం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. సహోద్యోగులతో సహకారంతో మీకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి నిర్జల ఏకాదశి వేళ శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కారణంగా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. సూర్య గ్రహం ప్రభావంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. నిర్జల ఏకాదశి వేళ మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. గ్రహాల అనుకూలత కారణంగా ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. మీరు కొన్ని బహుమతులు కూడా పొందొచ్చు. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ, సామరస్యం కొనసాగుతాయి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు నిర్జల ఏకాదశి వేళ శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఉన్నతాధారుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ తెలివితేటలు పెరుగుతాయి. మీరు చేసే పనుల వల్ల భవిష్యత్తులో సానుకూల ఫలితాలొస్తాయి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి నిర్జల ఏకాదశి వేళ శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీ పెండింగ్ పనులు తిరిగి ప్రారంభం కావొచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రధాన కోరికలలో ఒకటి ఈరోజు నేరవేరొచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనికి శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది. ఈ రాశి నుంచి చంద్రుడు లగ్న స్థానంలో సంచారం చేయనున్నాడు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ బడ్జెట్ తగ్గట్టు ఖర్చులు ప్లాన్ చేసుకుంటారు. మీరు చేసే పనిలో పూర్తి ఏకాగ్రత ఉండేలా చూసుకోవాలి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శ్రీ మహా విష్ణుమూర్తి ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. కెరీర్ పరంగా మరింత పురోగతి సాధించొచ్చు. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు శుభకార్యాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సురాశి వారికి ఈరోజు శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు లభించనున్నాయి. ఈ కారణంగా మీరు చేసే పనులన్నింట్లో అపారమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. తొందరపాటుతో కూడిన లావాదేవీలు చేయడం లేదా ఆలోచించకుండా డబ్బు అప్పు ఇవ్వకుండా చూసుకోవాలి. మీరు చాలా ఓపికగా ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా మీ శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. అనవసర విషయాలకు స్పందించకండి. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందొచ్చు.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధించొచ్చు. శ్రీ హరి అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరొచ్చు. ఈరోజు మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మతపరమైన కార్యక్రమంలో కూడా పాల్గొనొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కొత్త ఆలోచనలు అందరి ద్రుష్టిని ఆకర్షిస్తాయి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు రావొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీ నైపుణ్యాలను ఆదాయ వనరుగా మార్చుకోవడానికి మార్గాలను కనుగొంటారు. శని దేవుడి అనుగ్రహంతో మీ శ్రమకు తగిన ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా పురోగతి సాధించొచ్చు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించొచ్చు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.