పేపర్ ప్లేట్‌లో తినటం ఇంత డేంజరా.? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్.. వీడియో వైరల్
పేపర్ ప్లేట్‌లో తినటం ఇంత డేంజరా.? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్.. వీడియో వైరల్
టిఫిన్ సెంటర్లు, శుభకార్యాలలో మనం విందు ఆరగించే పేపర్ ప్లేట్ల గురించి ఓ డాక్టర్ చెప్తు్న్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పేపర్ ప్లేట్లలో భోజనం చేయటం ఆరోగ్యానికి హానికరమని చెప్తూ.. వాటిని క్యా్న్సర్ ప్లేట్లుగా అభివర్ణించారు ఆ డాక్టర్. విక్రాంత్ సింగ్ ఠాకూర్ అనే డాక్టర్ చెప్పిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేపర్ ప్లేట్లకు బదులుగా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ సూచించారు.
Vikrant Singh Thakur speaking about paper plates
పేపర్ ప్లేట్‌లో తినడం ప్రమాదమా
సాధారణంగా మనం పెళ్లిళ్లు. ఇతరత్రా ఏవైనా శుభకార్యాలకు వెళ్లిన సమయంలో.. ఆహారం తినేటప్పుడు మనకు కచ్చితంగా ఎదురయ్యేది పేపర్ ప్లేట్.. అంతెందుకు వీధి చివర టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ తినేటప్పుడు కూడా మనకు వడ్డించేది ఆ పేపర్ ప్లేటులోనే.. అయితే ఆ పేపర్ ప్లేట్ ఎంత డేంజరో ఓ డాక్టర్ చెప్తు్న్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ అనే డాక్టర్ చెప్పిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మార్చి 29వ తేదీ ఉదయం 1 గంట 43 నిమిషాల సమయంలో ఈ వీడియో షేర్ చేయగా.. మార్చి 29వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఈ వీడియోను ఎక్స్ వేదికగా సుమారు 3 లక్షల 50 వేల మంది వీక్షించారు.
ఇక ఈ వీడియోలో పేపర్ ప్లేట్ ఎంత డేంజర్ అనేది విక్రాంత్ సింగ్ ఠాకూర్ చెప్తు్న్నారు. ఇది పేపర్ ప్లేట్ కాదు.. క్యాన్సర్ ప్లేట్ అని చెప్తున్నారాయన. ప్లాస్టిక్ కవర్ కప్పిన ఈ ప్లేటులో వేడి పదార్థాలు వడ్డించినప్పుడు.. వేడి కారణంగా ప్లాస్టిక్ కరిగి కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్లాస్టిక్‌లో మైక్రో ప్లాస్టిక్స్, పాలిమర్ కెమికల్స్ ఉంటాయని.. వీటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. హార్మోన్ల అసమతుల్యత సంభవించే అవకాశం ఉందంటున్నారు. రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందంటున్నారు.
ఈ పేపర్ ప్లేట్లను వీధులలో పడేయటంతో ఆవులు వంటి పశువులు తినడం ద్వారా చనిపోయే ప్రమాదం ఉందని వివరించారు. అలాగే ఇలాంటి వాటిని కాల్చటం ద్వారా వీటిలోని కలుషితాలు గాలిలో కలిసి ఊపిరితిత్తులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని.. గాలి కాలుష్యం కలుగుతుందని చెప్తున్నారు. వీటికి బదులుగా చెరుకుతో చేసినవి, వెదురుతో చేసిన ప్లేట్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు.
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పిలిచేవారు కూడా ఇలాంటి పేపర్ ప్లేట్లకు బదులుగా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తు్న్నారు. ప్లా్స్టిక్ వలన మన ఆరోగ్యంతో పాటుగా పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుందని కామెంట్ చేస్తున్నారు.