Podarillu Today మార్చి 27 ఎపిసోడ్: అయ్యయ్యో నారాయణని పొడిచేసిన ఆది.. కాలేజ్‌లో కలకలం.. మహా కోసం ఫైటింగ్

 Podarillu Today మార్చి 27 ఎపిసోడ్: అయ్యయ్యో నారాయణని పొడిచేసిన ఆది.. కాలేజ్‌లో కలకలం.. మహా కోసం ఫైటింగ్

Podarillu Today మార్చి 27 ఎపిసోడ్: అయ్యయ్యో నారాయణని పొడిచేసిన ఆది.. కాలేజ్‌లో కలకలం.. మహా కోసం ఫైటింగ్

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి కాలేజ్‌కి బయలుదేరుతుంది మహా. మాధవ సహా అందరూ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఒంటరిగానే వెళ్తానంటుంది. దీంతో చివరికి కారు బుక్ చేసి తెలుసున్న డ్రైవర్‌తో చక్రి పంపిస్తాడు. అయితే మహాకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నారాయణ మధ్యలో కారు ఎక్కి మహాతో పాటు యాదగిరి గుట్ట వెళ్తాడు. ఎవరిని తోడు రావద్దంటే మీరు ఎందుకొస్తున్నారని మహా అడుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం.

Podarillu Today

అయ్యయ్యో నారాయణని పొడిచేసిన ఆది.. కాలేజ్‌లో కలకలం.. మహా కోసం ఫైటింగ్

Podarillu March 27th Episode: శైలజ ఇరికించడంతో మహా, కన్నా కలిసి కేశవని బుస్సు-ముంగీస అంటూ ఆడుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక రాత్రి పడుకునేముందు కూడా కన్నా అలా ఏడిపించడంతో కేశవ మొత్తానికి బరస్ట్ అవుతాడు. ఇదిగో వీళ్లిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారన్నయ్యా అని మాధవతో అంటాడు. మేము ఏం చేశాం.. మీ తమ్ముడే ఆ అమ్మాయితో సినిమాకి వెళ్లాడని మహా అంటుంది. ఎవరు నేనా.. ఆ బ్రహ్మరాక్షసితోనా అని కేశవ అంటాడు. ఎవర్రా ఆ బ్రహ్మరాక్షసని మాధవ అడిగేసరికి ఉందిలే అన్నయ్య.. నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక శత్రువని కేశవ అంటాడు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు అంటాడు మాధవ. దీంతో బుస్సుతో జరిగిన గొడవ, తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టి తిరగడం, ఆ డబ్బుల కోసం తన ఫోన్ లాక్కోవడం ఇలా మొత్తం కథంతా అందరికీ చెప్తాడు కేశవ. అయినా కానీ మహా, కన్నా మాత్రం ఇదేం నమ్మేలా లేదే అంటూ మళ్లీ ఆటపట్టిస్తారు. నేను నిజమే చెప్పానని కేశవ అనడంతో సర్లే పడుకోండి అని మాధవ అంటాడు.

ప్లీజ్ ఒంటరిగా వెళ్లకండి

ప్లీజ్ ఒంటరిగా వెళ్లకండి

ప్లీజ్ ఒంటరిగా వెళ్లకండి
ఇక తెల్లారగానే పూజ చేసి కాలేజ్‌కి వెళ్లేందుకు మహా సిద్ధమవుతుంది. అయితే చక్రి-కేశవ వచ్చి మరోసారి మహాని రిక్వెస్ట్ చేస్తారు. మా మాట విని మీరు ఒంటరిగా వెళ్లకండి.. మేము ఎవరో ఒకరు తోడొస్తామని అంటారు. వద్దు నేనేమైనా యుద్ధానికి వెళ్తున్నానా అని మహా అంటుంది. కేశవ మరీ మరీ చెప్పడంతో మహా తన తండ్రి గురించి చెప్తుంది. మా నాన్న కూడా ఇలానే చేసేవారు.. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఆయనే తోడు వచ్చారు లేదంటే అన్నయ్యని పంపించేవారు.. అందుకే నాకు బయటి ప్రపంచం పెద్దగా తెలియదు.. ఆ జాగ్రత్తే నా కొంపముంచింది. ఇప్పుడు మీరు కూడా అలా చేయొద్దు.. నేను జాగ్రత్తగా వెళ్లొస్తానని మహా అంటుంది.

మా ఉంటే ఇలా ఒంటరిగా పంపిచేవాళ్లమా?

మా ఉంటే ఇలా ఒంటరిగా పంపిచేవాళ్లమా?

మా ఉంటే ఇలా ఒంటరిగా పంపిచేవాళ్లమా?
అయినా సరే కేశవ-చక్రి మాత్రం కన్విన్స్ కారు. మాకు అమ్మ లేదు ఉంటే ఎలా ఉంటుందో తెలీదు ఎలా చూస్తుందో తెలీదు ఎలా పెంచుతుందో తెలీదు.. అసలు ఈ ఇల్లు ఎలా ఉంచుతుందో తెలీదు.. ఇన్నాళ్లకి మీ రూపంలో వచ్చిందనుకుంటున్నాం.. మా అమ్మ ఉంటే దున్నపోతుల్లా నలుగురం ఉండి ఒక్కర్ని కూడా తోడు లేకుండా పంపిస్తామా.. అని కేశవ ఎమోషనల్ అవుతాడు. ఈ మాటలకి మహా కూడా కరుగుతుంది. రేయ్ నువ్వు కారు బుక్ చెయ్.. అని చక్రికి చెప్తాడు కేశవ. దీంతో మహా కూడా కాదనలేకపోతుంది. వెంటనే చక్రి బయటికొచ్చి తను పని చేసే ట్రావెల్ ఏజెన్సీ ఓనర్‌కి కాల్ చేస్తాడు.

మొత్తానికి కారు సాధించిన చక్రి

మొత్తానికి కారు సాధించిన చక్రి

మొత్తానికి కారు సాధించిన చక్రి
చక్రి ఫోన్ చేశాడని చూడగానే ఓంకారేశ్వర్ భయపడతాడు. రేయ్ ఏంటి ఇలా ఫోన్ చేశావని అడిగితే నాకు కారు కావాలి అంటాడు. అయితే షోరూమ్‌‌కి వెళ్లి కొనుక్కో అంటాడు. అది కాదు నాకు మన ట్రావెల్స్‌లో ఒక కారు కావాలి.. నా భార్య యాదగిరి గుట్ట వెళ్లలని చక్రి అంటాడు. వామ్మో అక్కడికి అయితే అసలు ఇవ్వను.. ఒకసారి నీకు కారు ఇచ్చి అక్కడికి పంపిస్తే ఏం జరిగిందో నాకు తెలుసు.. నేను మాత్రం కారు ఇవ్వను అంటాడు ఓనర్. దీంతో చక్రి తన టాలెంట్ ఉపయోగించి నాలుగు సెంటిమెంటు డైలాగులు కొట్టేసరికి ఇక ఓనర్ సరే పంపిస్తాను.. నా కారుకి మాత్రం చిన్న గీత కూడా పడకూడదని మరీ మరీ చెప్తాడు.

డ్రైవర్‌కి తెగ జాగ్రత్తలు చెప్పిన చక్రి

డ్రైవర్‌కి తెగ జాగ్రత్తలు చెప్పిన చక్రి

డ్రైవర్‌కి తెగ జాగ్రత్తలు చెప్పిన చక్రి
ఇంతలో కారు వస్తుంది. రేయ్ ఉపేంద్ర నువ్వు వచ్చావా.. సరే అన్నీ జాగ్రత్తగా చూసుకున్నావు కదా .. బండిలో ఆయిల్, స్టెపినీ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి కదా అని అడుగుతాడు. అన్నీ ఉన్నాయ్ కానీ డీజిల్‌కి ముందే నీ దగ్గర డబ్బులు తీసుకోమన్నాడు ఓనర్.. అని చెప్తాడు. దీంతో చక్రి డబ్బులిస్తాడు. సరే ఎక్కువ జనాలు ఉన్న చోట ఆపకు, జాగ్రత్తగా తీసుకెళ్లు, ఏమైనా ప్రాబ్లమ్ అయితే కాల్ చెయ్ అని చక్రి అంటాడు. అయ్యో నేను ఎక్కడికో వెళ్తున్నట్లు ఎందుకు ఇన్ని జాగ్రత్తలని మహా అంటుంది. మొత్తానికి మహాకి దారిలో తినడానికి ఒక బాక్సు, వాటర్ బాటిల్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్లి రమ్మని చెప్తారు.

గొడవ చేసి కారు ఎక్కిన నారాయణ

గొడవ చేసి కారు ఎక్కిన నారాయణ

గొడవ చేసి కారు ఎక్కిన నారాయణ
కారు ఇలా వీధి దాటగానే నారాయణ అడ్డంగా నిలబడి కారు ఆపేస్తాడు. డోర్ ఓపెన్ చెయరా అని డ్రైవర్‌ని అడిగితే లేదు చేయనని చెప్తాడు. దీంతో కత్తి మెడపైన పెట్టి చేస్తావా లేదా అని బెదిరిస్తాడు. దీంతో డోర్ ఓపెన్ చేయగానే కారులో కూర్చుంటాడు. మీరు ఎక్కడికని మహా అడిగితే మీరు ఎక్కడికో నేను అక్కడికే అంటాడు. ఎవరినీ తోడు రావద్దని నేను చెప్పా కదా అని మహా అంటుంది. నేనేం తోడు రావట్లేదే అని నారాయణ అంటాడు. ఇదిగో తీసుకో అమ్మా అని ఆపిల్స్, బిస్కెట్స్ ఇస్తాడు. నాకు ఏం వద్దు అంటూ మహా చెప్తుంది.

మాధవకి ఫోన్ చేసి చెప్పిన మహా

మాధవకి ఫోన్ చేసి చెప్పిన మహా

మాధవకి ఫోన్ చేసి చెప్పిన మహా
మరోవైపు చక్రి-మాధవ బండి మీద ఎక్కడికో వెళ్తుంటే మహా ఫోన్ చేస్తుంది. పెద్ది చిన్న సమస్య వచ్చింది.. కారుని మధ్యలో ఆపి మీ నాన్న ఎక్కారు. చేతిలో కత్తి పట్టుకొని డ్రైవర్‌ని బెదిరించి మరీ బండి ఎక్కారు.. నాకు భయంగా ఉంది అంటుంది. అవునా ఆయన ఎందుకు వస్తున్నాడు నీతో.. అయినా ఆయన్ని ఇన్నిరోజులుగా చూస్తున్నావ్ ఇంకా భయం పోలేదా అమ్మా.. సరే నాన్న సంగతి నేను చూసుకుంటాను.. నువ్వేం కంగారుపడకని మాధవ చెప్తాడు. కానీ మహా మాత్రం నారాయణని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.

నారాయణని కత్తితో పొడిచేసిన ఆది

నారాయణని కత్తితో పొడిచేసిన ఆది

నారాయణని కత్తితో పొడిచేసిన ఆది
తరువాయి భాగం ప్రోమోలో మహా వాళ్లు కాలేజ్‌కి రాగానే ప్యూన్.. ఆదికి ఫోన్ చేస్తాడు. మీ చెల్లెలు కాలేజ్‌కి వస్తే కాల్ చేసి చెప్పమన్నారు కదా.. ఇప్పుడే వచ్చింది సార్ అని చెప్తాడు. దీంతో ఆది వెంటనే కాలేజ్‌కి వస్తాడు. నాన్న, మేము అక్కర్లేదు కానీ మేము చదివించిన చదువు మాత్రం కావాలా.. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వస్తే అప్పుడు నిన్ను లాక్కెళ్లి ఇంట్లో పడేయాలని ఎదురుచూస్తుననాను రావే అంటూ మహా చేయి పట్టుకుంటాడు ఆది. ఇది చూసి నారాయణ రెచ్చిపోతాడు. చూశావా అమ్మా ఇందుకో నేను తోడుగా వస్తానని చెప్పా.. రేయ్ నేనుండగా నా కోడలి పిల్లని ఎలా తీసుకెళ్తావురా అంటూ ఆది కాలర్ పట్టుకుంటాడు నారాయణ. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో కత్తితో నారాయణని పొడిచేస్తాడు ఆది. ఇది చూసి మహా భయపడిపోతుంది. మరి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *