Gundeninda Gudigantalu Today మార్చి 31 ఎపిసోడ్: మీనాకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిన రోహిణీ.. గతాన్ని రివీల్ చేసిన బాలు.. ప్రభావతి ఔట్.

 Gundeninda Gudigantalu Today మార్చి 31 ఎపిసోడ్: మీనాకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిన రోహిణీ.. గతాన్ని రివీల్ చేసిన బాలు.. ప్రభావతి ఔట్.

Gundeninda Gudigantalu Today మార్చి 31 ఎపిసోడ్: మీనాకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిన రోహిణీ.. గతాన్ని రివీల్ చేసిన బాలు.. ప్రభావతి ఔట్.

Gunde Ninda Gudi Gantalu 2026 March 31 Episode: తన వల్ల ఇంటి పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోబోయిన శివను బాలు కాపాడతాడు. అతన్ని పోలీసులకు తెలియకుండా రాజేష్ ఇంట్లో దాస్తాడు. ఇక ఆ వెంటనే మీనాను ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ మీనాను దారుణంగా అవమానిస్తుంది ప్రభావతి. దొంగ ఫ్యామిలీ నుంచి వచ్చిన కోడలు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేందంటూ ప్రభావతి మీనాపై అరుస్తుంది. అప్పుడు బాలు.. శివ విషయంలో గతంలో జరిగింది మొత్తం తండ్రికి వివరిస్తాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. మంగళవారం(మార్చి 31) నాడు ఏం జరిగిందో చూద్దాం.
Gunde Ninda Gudi Gantalu 2026 March 31 Episode: (photo courtesy by star maa and JioHotstar)
గుండెనిండా గుడిగంటలు సీరియల్ (photo courtesy by star maa and JioHotstar)
Gunde Ninda Gudi Gantalu 2026 March 31 Episode: ప్రభావతి కోపంగా “చూశావా మీనా? నీ తమ్ముడు మా పరువును బజారున పడేశాడు. మా వంశం పేరు మట్టిలో కలిపేశాడు. దొంగల కుటుంబంతో మాకు వియ్యం ఏంటి? నువ్వు ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి” అని అంటుంది. అప్పుడే బాలు.. తన తండ్రి సత్యంతో మాట్లాడుతూ…”నాన్న.. శివ కావాలని దొంగతనం చేయలేదు. వాడిని అందరి ముందు దొంగ అని అవమానించడంతో, ఆ ఆవేశంలో అలా చేశాడు. కానీ వెంటనే తన తప్పు తెలుసుకుని డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఈ గొడవను ఇంత పెద్దది చేసింది ఎవరో కాదు.. ఈ ప్రభావతే” అంటూ అసలు విషయాన్ని తండ్రికి వివరిస్తాడు. సత్యం ఆగ్రహంగా ప్రభావతి వైపు చూడటంతో ఆమె కాసేపు నోట మాట రాక మౌనంగా ఉండిపోయింది. కానీ మధ్యలో మనోజ్ వెటకారంగా మాట్లాడుతూ.. “తప్పు తెలుసుకుంటే సరిపోతుందా బాలు? దొంగతనం చేసింది నిజమే కదా. వాడు దొంగే.. వాడి వల్ల మన పరువు పోయింది” అని బాలుతో అంటాడు. బాలు మనోజ్ కళ్లలోకి చూస్తూ.. “రేయ్ మనోజ్ , వాడు నీలా డబ్బు ఎత్తుకెళ్లి పారిపోలేదు. తన తప్పు తెలుసుకుని తిరిగి ఇచ్చేశాడు. పెద్దవాళ్లు తప్పు చేస్తే సర్దిచెప్పే ఈ ఇంట్లో.. చిన్నపిల్లాడు ఆవేశంలో చేస్తే దొంగ అని ముద్ర వేస్తారా? ఇది ఏ రకమైన న్యాయం?” అంటూ మనోజ్‌పై విరుచుకుపడతాడు.

పోలీసులు ఎంట్రీ…

పోలీసులు ఎంట్రీ...

పోలీసులు ఎంట్రీ…
రోహిణి కూడా మనోజ్‌కు వత్తాసు పలకబోగా, బాలు తనదైన స్టైల్లో ఆమె నోరు మూయించాడు. అప్పుడే మీనా బాలు తండ్రి సత్యంతో బాధతో.. “మావయ్యా.. మా తమ్ముడు చేసింది తప్పే.. నేను కాదనడం లేదు. కానీ ఒక్కసారి చేసిన తప్పుకు మా నాన్న ప్రాణం పోయింది. ఇప్పుడు మళ్లీ అదే నెపంతో మా కుటుంబాన్ని ఇలా రోడ్డున పడేస్తారా? వాడు నా తమ్ముడిగా పుట్టడం నా పాపమా? నేను అతనికి అక్కగా ఉండటం నా నేరమా ?” అని అడుగుతుంది. ఇంతలో పోలీసులు వచ్చి.. ‘శివ దొంగతనం వీడియో వైరల్ అయ్యింది కాబట్టి.. మేము శివను తీసుకుని వెళ్లడానికి ఆ ఇంటికి వెళ్లాం.. కానీ మీ బాలు ఇది ఇంటి సమస్య అని చెప్పాడు.. అయితే ఇంత వైరల్ అయిన కేసుకి మేము యాక్షన్ తీసుకోలేదని పైనుంచి ఒత్తిడి వస్తుంది. మీరు వచ్చి ఇంటి సమస్య అని రాసి ఇస్తే సరిపోతుంది’ అంటారు.

మీనా,బాలులు వేడుకున్నా ఆగకుండా.. కంప్లైంట్ రాసి ఇచ్చిన ప్రభావతి..
మీనా,బాలులు వేడుకున్నా ఆగకుండా.. కంప్లైంట్ రాసి ఇచ్చిన ప్రభావతి..

మీనా,బాలులు వేడుకున్నా ఆగకుండా.. కంప్లైంట్ రాసి ఇచ్చిన ప్రభావతి..
ప్రభావతి మాట్లాడుతూ.. “నేను కంప్లైంట్ ఇస్తాను. వాడు నా డబ్బులు దొంగిలించాడు. వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు” అని పోలీసులకు రాసి ఇచ్చేసింది. బాలు ఎంత బతిమలాడినా ఆమె వినలేదు. ‘అమ్మా అమ్మా వాడి జీవితం నాశనం అయిపోతుందమ్మా.. నీకు దన్నం పెడతాను వదిలెయ్ అమ్మా.. కంప్లైంట్ ఇవ్వద్దమ్మా’ అని బాలు.. ప్రభావతిని దన్నం పెట్టి మరీ రిక్వస్ట్ చేస్తాడు. కానీ వినదు ప్రభావతి. మీనా కూడా ఏడుస్తూ వేడుకుంటుంది. అయినా ఆగదు ప్రభావతి. కంప్లైంట్ లేఖ పట్టుకుని పోలీసులు వెళ్లిపోతారు. అక్కడే ఉన్న సత్యం కూడా సైలెంట్‌గానే ఉండిపోతాడు.

బాధలో గతాన్ని రివీల్ చేసిన బాలు.. (శివ గాడి చెయ్యి విరిచింది అందుకే)

బాధలో గతాన్ని రివీల్ చేసిన బాలు.. (శివ గాడి చెయ్యి విరిచింది అందుకే)
పోలీసులు కంప్లైంట్ లేఖ పట్టుకుని వెళ్లిపోవడంతో మీనా కుమిలి కుమిలి ఏడుస్తుంది. దాంతో బాలు బాధగా.. ‘నీ దగ్గర డబ్బు దొంగలించాడు అని తెలిసే నేను వాడి చెయ్యి విరిచేశాను.. నేను ఆల్ రెడీ వాడికి శిక్ష వేశాను అమ్మా.. మళ్లీ ఎందుకు ఇలా చేశావ్’ అంటాడు. బాలు బాధలో గతాన్ని రివీల్ చేశాడు. అప్పుడే సత్యం, ప్రభావతి, రోహిణీ, మనోజ్, రవి, శ్రుతీలకు.. ఆ రోజు శివను బాలు ఎందుకు కొట్టాడో అర్థమవుతుంది. ఆ విషయం అర్థం కాగానే సత్యంలో చాలా మార్పు వస్తుంది. మనసు కరుగుతుంది. మీనా ఏడుస్తుంటే బాలు ఓదార్పుగా.. ‘నువ్వు బాధపడకు.. నేను ఏదొకటి చేస్తాను.. నువ్వు లోపలికి వెళ్లు’ అంటాడు. దాంతో మీనా లోపలికి వెళ్లబోతుంది. ప్రభావతి మళ్లీ ఆవేశంగా.. ‘ఆగు.. ఆ ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదు’ అని మళ్లీ మొదటికొస్తుంది.

సత్యం ఆవేశం..

సత్యం ఆవేశం..
ప్రభావతి మీనాను ఇంటి నుంచి వెళ్ళిపోమని గద్దించడంతో సత్యం ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు.సత్యం కోపంగా.. “ప్రభావతి ఆపు ఇక, ఎప్పుడూ నా ఇల్లు.. నా ఇల్లు అంటావే.. ఈ ఇల్లు నువ్వు కట్టించావా? మీనా నా కోడలు, ఈ ఇంట్లో ఉండే హక్కు తనకుంది. ఆమె ఎక్కడికీ వెళ్లదు. నీకు నచ్చకపోతే నువ్వే వెళ్ళిపో. ఎక్కువ మాట్లాడితే నిన్నే బయటకు గెంటేస్తాను” అని అరుస్తాడు. దాంతో ప్రభావతి గుండె ముక్కలైపోతుంది. ‘ఒక దొంగకు అక్క అయినదానికోసం నన్ను బయటికి పొమ్మంటారా.. పోతాను’ అంటూ ఆవేశంగా పైకి వెళ్లి.. బ్యాగ్ తీసుకుని కిందకు దిగుతుంది. అప్పటికే బాలు.. ‘నాన్నా అమ్మని ఆపు.. ప్లీజ్ నాన్నా’అంటూనే ఉంటాడు. కానీ సత్యం కోపంగా అలానే నిలబడిపోతాడు.

ఇల్లు వదిలిపోయిన ప్రభావతి..

ఇల్లు వదిలిపోయిన ప్రభావతి..
మీనా కూడా.. ప్రభావతికి అడ్డుగా నిలబడి బతిమలాడుతుంది వెళ్లొద్దు అని. కానీ ప్రభావతి కోపంగా మీనా వైపు చూస్తుంది. దాంతో మీనా తల దించుకుంటుంది. మిగిలిన వాళ్లు అమ్మా… అత్తయ్యా అంటూ ఆపడానికి వెంటపబడతారు. కానీ ఆగదు ప్రభావతి. ‘హేయ్..’ అని పెద్దగా అరిచి.. ‘నన్ను ఎవరూ ఆపొద్దు’ అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సరాసరి అక్కడి నుంచి ప్రభావతి.. కోపంగా కామాక్షీ ఇంటికి వెళ్తుంది. ఇక కామాక్షీ ‘మీనాను గెంటెయ్యాలనుకోవడం నీదే తప్పు.. చివరికి నీ పరిస్థితే ఇలా అయ్యింది’ అని వెటకారం చేస్తుంది. ప్రభావతి కోప్పడటంతో.. ‘సర్లే రెస్ట్ తీసుకో పదా’ అని గదిలోకి తీసుకుని వెళ్తుంది.

మీనాకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిన రోహిణీ.. సత్యం ముందే ఓవర్ యాక్షన్..

మీనాకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిన రోహిణీ.. సత్యం ముందే ఓవర్ యాక్షన్..
ఇక మీనా రాత్రి అంతా ప్రభావతి వెళ్లిపోవడం గురించి చాలా ఏడుస్తుంది. బాలు ఓదార్చి అంతా సద్దుకుంటుంది అని చెప్పి నిద్రపుచ్చుతాడు. ఇక మరుసటి రోజు శృతి తల్లి శోభన.. సత్యం ఇంటికి వస్తుంది. రాగానే సత్యం ముందు కూర్చుని.. ప్రభావతి వదిన ఎక్కడ అని ఆరా తీస్తుంది. తను అలిగి వెళ్లిపోయింది అని చెప్పడం మానేసి.. సత్యం తెలివిగా.. ‘కామాక్షీ ఇంటి దగ్గర డ్యాన్స్ క్లాసులు చెబుతుంది కదా.. అందుకే రావడం లేట్ అవుతుంది.. అక్కడే ఉంది’ అని కవర్ చేసి చెబుతాడు. ఇంతలో రోహిణీ వచ్చి.. మాటల మధ్యలో శోభనతో.. ‘మా అత్తయ్య కోపంతో కామాక్షీ ఇంటికి వెళ్లిపోయింది’ అని చెప్పేస్తుంది. ‘ఆ శివ దొంగతనం వీడియో నేను చూశాను’ అని సత్యం ముందే వెటకారం చేయడం మొదలుపెడుతుంది శోభన.

పార్లర్ అమ్మ బాలుకి అడ్డంగా దొరికిందిగా..

‘పార్లర్ అమ్మ బాలుకి అడ్డంగా దొరికిందిగా..
‘ఆ శివ ఇప్పుడే కాదు గతంలో బండి కూడా దొంగలించాడు అట కదా’ అంటూ శోభన వాగుతూనే ఉంటుంది. సత్యం ఇబ్బంది పడుతుంటే.. రోహిణీ సంబరపడుతుంది ఆమె మాటలకు. అప్పుడే మీనా కిందకొస్తుంది. మీనాను చూడగానే.. రోహిణీ.. ‘మీనా.. ఆవిడకు కాస్త మంచినీళ్లు ఇస్తావా?’ అంటుంది. ‘దాహం తీరే ఉండాలే ఈ పాటికే.. నువ్వు చెప్పాల్సింది చెప్పే ఉంటావ్ కదా రోహిణీ’ అంటుంది మీనా కోపంగా. వెంటనే శోభన.. ‘మీ అత్తగారు ఇంత జరిగినా మీనాను ఇంట్లో ఉంచారు అంటే ఆవిడ నాకు చాలా గొప్పగా కనిపిస్తున్నారు రోహిణీ’ అంటుంది కావాలనే. ‘మీనాను ఇంట్లో ఉండనిచ్చినందుకే కదా మా అత్తగారు అలిగి వెళ్లిపోయింది’ అంటుంది రోహిణీ .. శోభనతో. ఇంతలో బాలు దిగుతాడు పైనుంచి. రోహిణీ మాటలు వింటాడు. వెంటనే శోభనతో.. ‘హో మీరా.. మా నాన్న ముందే మీకు మా పార్లర్ అమ్మ చాలానే చేరవేసి ఉంటుంది కదా?’ అంటూ చురకలు వేయడం స్టార్ట్ చేస్తాడు.

చచ్చింది గొర్రె.. బాలుతో మామూలుగా ఉండదు మరీ..

చచ్చింది గొర్రె.. బాలుతో మామూలుగా ఉండదు మరీ..
బాలు మాట్లాడుతూనే ఉంటాడు. ‘అవును.. మా మీనా తమ్ముడి సంగతులు చెప్పింది కానీ.. మలేషియాలో పాపం వాళ్ల నాన్న మూడు నెలలుగా చిప్పకూడు తింటున్నాడు అని చెప్పిందా?’ అంటాడు కావాలనే. వెంటనే మీనా.. ‘మీరు గనుక ఆ మాట అనగలిగారు.. నేను అనలేను కదా..’ అంటుంది తిక్కకుదిరిందా అన్నట్లుగా రోహిణీ వైపు చూస్తూ. ‘చెప్పలేదే’ అంటుంది శోభన షాక్ అవుతూ. రోహిణీ తల దించుకుంటుంది. ‘అవును మీ ఆయన ఈ మధ్య లంచం తీసుకుంటున్నాడని విన్నాను.. దొరికితే స్టేషన్లు అవీ అని తిరగాలి.. మా పార్లర్ అమ్మ నాన్నలా జైలు కూడి తినాలి.. మీ ఆయన్ని కాస్త హెచ్చరించండి’ అని శోభనకు కూడా చురకలు వేస్తాడు బాలు. రగిలిపోయిన శోభన.. ‘విన్నారా సత్యం గారు.. ఇదేనా మర్యాదా?’ అంటుంది కోపంగా.

శోభనకు మరో వాయింపు..

శోభనకు మరో వాయింపు..
శోభన.. సత్యంతో అలా అనగానే.. ‘అన్ని విన్నాను.. అందరి మాటలు విన్నాను.. నేను మీకు ముందే చెప్పాను.. శ్రుతి పైన ఉంది వెళ్లండి అని.. మీరు విన్నారు కదా.. ఇకనైనా మిగిలిన మర్యాద పోకుండా పైకి వెళ్లండి’ అని సలహా ఇస్తాడు సత్యం. దాంతో రగిలిపోతూ శ్రుతి తల్లి శోభన.. పైకి వెళ్లిపోతుంది. శ్రుతి, రవీలను కూర్చోబెట్టి.. ‘మీనా తమ్ముడు అంతటి దొంగతనం చేసి వీడియోలో వైరల్ అవుతుంటే.. ఇలాంటి కొప్పలో మీరెందుకు.. నా ఇంటికి వచ్చెయ్యండి’ అని రిక్వస్ట్ చేస్తుంది. దాంతో రవి, శ్రుతీలు రివర్స్ అవుతారు. ‘తప్పు చేసింది మీనా వాళ్ల తమ్ముడు మాత్రమే.. మీనా కాదు.. ఇలాంటి విషయాల్లో కలుగజేసుకోకపోవడం నీకే మంచిది’ అని శోభనను తిట్టి పంపేస్తారు.

పోలీస్ కస్టడీలో పార్వతమ్మ

పోలీస్ కస్టడీలో పార్వతమ్మ
మరోవైపు మీనాకు.. సుమతి కాల్ చేసి.. ‘అక్కా నేను అమ్మా స్టేషన్‌లో ఉన్నాం.. శివను అప్పగించే వరకూ అమ్మను వదిలిపెట్టం అని పోలీసులు చెబుతున్నారు.. నాకు చాలా భయంగా ఉంది అక్కా.. నువ్వు వెంటనే రా’ అని ఏడుస్తూ చెబుతుంది. ఇంతలో బాలు వచ్చి విషయం తెలుసుకుంటాడు. మీనాను తీసుకుని పోలీస్ స్టేషన్‌కి పరుగుతీస్తాడు. ఇక అక్కడ పార్వతమ్మ నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటుంది. బాలు, మీనా, సుమతి లోపలికి వెళ్తారు. మీనా ఏడుస్తూ తల్లిని హత్తుకుని కుమిలిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. ఇక ప్రోమోలో ‘శివను తీసుకొచ్చి అప్పగిస్తేనే పార్వతమ్మను వదులుతాం’ అని ఎస్ఐ.. బాలు వాళ్లకు గట్టిగా చెబుతాడు. మరి శివేమో రాజేష్ ఇంట్లో ఉన్నాడు. ఈ సమయంలో బాలు ఏం చేస్తాడు అన్నది ఉత్కంఠగా మారింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *