Gundeninda Gudigantalu Serial Today 22 August Episode: రోహిణి గుట్టు రట్టు చేసిన బాలు.. నీ భార్యే పెద్ద ఫ్రాడ్.. కళ్లు తిరిగి పడిపోయిన మనోజ్

 Gundeninda Gudigantalu Serial Today 22 August Episode: రోహిణి గుట్టు రట్టు చేసిన బాలు.. నీ భార్యే పెద్ద ఫ్రాడ్.. కళ్లు తిరిగి పడిపోయిన మనోజ్

Gundeninda Gudigantalu Serial Today 22 August Episode: రోహిణి గుట్టు రట్టు చేసిన బాలు.. నీ భార్యే పెద్ద ఫ్రాడ్.. కళ్లు తిరిగి పడిపోయిన మనోజ్

Gundeninda Gudigantalu Serial Today Episode మనోజ్‌ని మళ్లీ మోసం చేయాలని రోహిణి ప్రయత్నిస్తుంది. పెద్ద డీలర్‌ అంటూ ఓ ఫ్రాడ్‌ను తీసుకు వస్తుంది రోహిణి. కానీ ఆ ఫ్రాడ్ బాలుకి మంచి ఫ్రెండ్. దీంతో రోహిణి గుట్టుని మళ్లీ బాలునే బయట పెడతాడు. మరోసారి మనోజ్ మోసపోకుండా కాపాడతాడు బాలు. ఇక రోహిణి చేసిన మోసం తల్చుకుని కళ్లు తిరిగి పడిపోతాడు మనోజ్. ఇంతలో రోహిణి దగ్గరకు వస్తుంటే.. ఛీ ఛీ అవతలకి పో అన్నట్టుగా చీదరించుకుంటాడు మనోజ్.
గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
ఫర్నీచర్ షాప్‌కి వెళ్లొచ్చు అని ప్రభావతి చెబుతుంది. దీంతో రోహిణిని తీసుకుని వమనోజ్ వెళ్తాడు. నా శపథం నెరవేర్చుకున్నా.. అత్తయ్య నోటితోనే వెళ్లమనేలా చేశా అని రోహిణి అనుకుంటుంది. నాకు ఎక్కడో తేడా కొడుతోంది మీనా అని బాలు అంటాడు. మీకు అన్నీ అనుమానాలే అని మీనా కొట్టి పారేస్తుంది. సరే గానీ నా ఫ్రాడ్ ఫ్రెండ్‌కి కలుద్దాం పదా అని బాలు అంటాడు. నేను రాను అని మీనా అంటే.. నాకు ఇంత అందమైన భార్య ఉందని తెలియాలి కదా అని బాలు అంటాడు. ఆటోకి డబ్బుల్లేక నడుచుకుంటూ వస్తాడేమో అని బాలు అనుకుంటే.. రిచ్ గా కారులోంచి దిగుతాడు ఫ్రాడ్ ఫ్రెండ్. అది చూసి బాలు షాక్ అవుతాడు. ఇదేంట్రా ఇలా దిగావ్.. అని బాలు అడిగితే.. కూటి కోసం కోటి విద్యలు కదరా అని ఫ్రాడ్ ఫ్రెండ్ అంటాడు. మొన్నే పెద్ద జైలు నుంచి రిలీజ్ అయ్యారా అని అంటాడు ఫ్రాడ్ ఫ్రెండ్ రాజు. ఎందుకు రా.. దొంగతనాలు సరిగ్గా చేయడం లేదా? ఇంకా దొరికిపోతున్నావా? అని ఇద్దరూ దొంగల కష్టాలు, బాధల్ని మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే గజ దొంగలు చాలా ఏళ్ల తర్వాత కలుసుకుని మాట్లాడినట్టు ఉందని తిడుతుంది మీనా.

ఫర్నీచర్ షాప్‌కి రిచ్ మెన్‌లా..
ఫర్నీచర్ షాప్‌కి రిచ్ మెన్‌లా..

అసలు ఏ పని మీద వెళ్తున్నావ్ రా అని బాలు అడుగతాడు. ఓ లేడి కిలాడి ఉందిరా.. ప్రభావతి అనే ఫర్నిచర్ షాప్‌కి వెళ్లి రిచ్ మ్యాన్‌లా నటించాలి.. అందుకు ఆ షాప్ ఓనర్ రోహిణి నాకు ఐదు వేలు ఇస్తుంది.. అసలే సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్‌తో సినిమాకి వెళ్లాలి.. ఆ డబ్బులు కూడా కావాలి.. కదా.. అందుకే నటించేందుకు వెళ్తున్నా అని అంటాడు. సర వెళ్లు.. నీ వల్ల మా నోటికి, మా ఇంట్లో వాళ్ల చేతికి కూడా పని దొరికింది అని బాలు అంటాడు. ఇక ఆ ఫ్రాడ్ ఫ్రెండ్ రాజు వెళ్లిన తర్వాత బాలు, మీనా కూడా అదే షాప్‌కి వెళ్తారు.

నువ్వు చూసుకుంటావ్ కదా..
నువ్వు చూసుకుంటావ్ కదా..

ఫర్నీచర్ షాప్‌కి వచ్చిన తర్వాత రోహిణి మరింత నాటకం ఆడుతుంది. మనోజ్ అంటే అంతులేని ప్రేమ ఉన్నట్టుగా డైలాగ్స్ కొడుతుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చాడా? అని ఏమీ తెలియని నంగనాచిలా అడుగుతుంది. నువ్వెందుకు ఇన్సూరెన్స్ చేయించుకోలేదు అని మనోజ్ అడిగితే.. అంత డబ్బు లేదు. .అయినా నీకు ఉంటే చాలు.. నాకు ఏమైనా అయితే నువ్వు చూసుకుంటావ్ కదా.. కానీ నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని డైలాగ్స్ మీద డైలాగ్స్ కొడుతుంది. ఇదిగో విబూది పెట్టుకో అని మనోజ్ ఇస్తాడు. ఎక్కడిది అని ఏమీ తెలియని దానిలా అడుగుతుంది రోహిణి.

కరిగిపోయిన మనోజ్..

హోమం చేయించావ్ అంట కదా. అదే ఇది.. పంతులు తెచ్చి ఇచ్చాడు అని మనోజ్ అంటాడు. చెప్పొద్దు అని అన్నానే.. అని రోహిణి నాటకం ఆడుతుంది. ఒకరి కోసం చేసింది చెప్పుకోవడం నాకు నచ్చదు అని రోహిణి భలే అబద్దాలు చెబుతుంటుంది. అవన్నీ పిచ్చివాడిలా నమ్మేస్తుంటాడు మనోజ్. నా కోసం కళ్లు కూడా ఇస్తాను అని అన్నావంట కదా.. అని మనోజ్ అంటే. కళ్లేంటి ప్రాణం కూడా ఇస్తా అని రోహిణి అంటుంది. పాపం రోహిణి నా గురించే ఆలోచిస్తుంది.. నేనంటే ప్రాణం.. కానీ నేను మాత్రం రోహిణి అనుమానిస్తూ, అవమానిస్తూ, బాధ పెడుతున్నా అని మనోజ్ కాస్త కరిగిపోతాడు.

రెచ్చిపోయిన రాజు..

ఇంతలో ఫ్రాడ్ రాజు వస్తాడు. పెద్ద రిచ్ మెన్‌లా బిల్డప్ ఇస్తాడు. రోహిణి కూడా నాలుగు ఎక్కువేసి చెబుతుంది. రాజు గారు మీ ఫాం హౌస్‌లు ఉన్నాయా? అని రోహిణి అడిగితే.. బోర్ కొట్టి అనాథాశ్రమానికి, వృద్దాశ్రమానికి రాసిచ్చా అని బిల్డప్ ఇస్తుంటాడు రాజు. మీరు చాలా గ్రేట్ సార్.. అని అంటాడు మనోజ్. మీరు బిత్తిరి చూపులు చూస్తున్నారు.. మీ ఆయన్ను చూస్తుంటే అసలు నాలుగు కుర్చీలు కూడా అమ్మే వారిలా లేడు.. నేను మిమ్మల్ని చూసి మాత్రమే డీల్ ఇస్తున్నా అని రోహిణి గురించి పొగుడుతూ చెప్తాడు రాజు.

డీల్ పేపర్స్ ఇవే..

మా ఆయన చూడటానికి అమాయకుడిగా కనిపిస్తాడు కానీ చాలా తెలివి ఉంటుంది అని రోహిణి అంటుంది. అవును సర్.. నేను జీనియస్.. నాలుగు డిగ్రీలు ఉన్నాయి.. పెద్ద బిజినెస్ మెన్‌ని అని చెబుతుంటాడు. డీల్ పేపర్స్ చూడండి.. అని ఇస్తాడు. రాజుకి చదువు రాదు.. అన్నీ ఏబీసీడీలే కనిపిస్తున్నాయే.. సంతకం ఎక్కడ పెట్టాలో అని రాజు అనుకుంటాడు. సంతకం ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు రాజు. అడ్వాన్స్ ఐదు లక్షలు ఇవ్వాలి సర్ అని మనోజ్ చెప్తాడు. నాన్ సెన్స్ పది లక్షలు ఇస్తా అని అంటాడు రాజు.

చెక్‌ను చించేసిన బాలు..

ఇందులో బాలు వచ్చి ఆ చెక్ తీసుకుంటాడు. నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావ్ రా అని మనోజ్ అంటాడు. మీకు ఇక్కడేం పని అని రోహిణి అడుగుతుంది. నీ గుట్టు రట్టు చేయడానికే వచ్చా అని బాలు అంటాడు. ఇది చెక్కా? నాలుక గీసుకోడానికి కూడా పనికి రాదు అని దాన్ని చించిపారేస్తాడు. రేయ్ అది పది లక్షల చెక్కు.. ఎప్పుడైనా అంత డబ్బు చూశావా రా అని అంటాడు మనోజ్. చూసేలోపు నువ్వే రెండు సార్లు మింగేశావ్ కదరా అని బాలు అంటాడు. అసలు మీకు వేరే పనే లేదు.. మా దాంట్లోకి ఎందుకు వస్తున్నారు అని రోహిణి అంటుంది.

డీల్ పేపర్ చదవరా..

మనకు ఎందుకు అండి.. వెళ్లి పోలీసుల్ని, మీడియా వాళ్లని పిలవండి.. ఎలాగూ రోహిణి బాగానే మేకప్ వేసుకుని వచ్చింది.. మన రాజన్న కూడా టిప్ టాప్‌గా ఉన్నాడు.. ఎలాగూ ప్రపంచంలోని నెంబర్ వన్ అమాయకుడిలా ఉన్న మనోజ్‌ని ఈ ప్రపంచానికి చూపిద్దాం అని బాలు అంటుంది. ఇది డీల్ పేపరా? రేయ్.. ఇది చదవరా అని రాజుకి ఇస్తాడు బాలు. రాజు చదవలేకపోతాడు. వీడు ఫ్రాడ్.. వీడికి చదువు రాదు.. ఇదంతా నాటకం అని బాలు చెప్తాడు. దీంతో మనోజ్ షాక్ అవుతాడు. ఏదో ఒకటి చేసి కవర్ చేయాలని రోహిణి అనుకుంటుంది.

నీ భార్యే ఫ్రాడ్..

కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు అని రోహిణి అంటుంది. అవునా? నిజమారా? అని రాజుని బాలు అడుగుతాడు. చెప్పండి రాజు అని రోహిణి అంటుంది. చెప్పలేను అని రాజు అంటాడు. వాడు నా ఫ్రెండ్.. ఇదంతా నీ భార్య ఆడిస్తున్న నాటకం అని బాలు అంటాడు. అవును.. ఆమె నాకు ఐదు వేలు ఇచ్చింది.. ఇలా నాటకం ఆడమని చెప్పింది.. ఇధి రెంట్‌కి తెచ్చిన కోటు, అది రెంట్ కారు అని అంటాడు. అంటే నువ్వు ఫ్రాడా? అని మనోజ్ అడిగితే.. నేను కాదు.. నీ భార్యే ఫ్రాడ్ అని అంటాడు రాజు.

Screenshot 2026-08-22 073643
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *