రాశిఫలాలు 14 అక్టోబర్ 2026: నవరాత్రుల్లో నాలుగో రోజున త్రికోణ యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు!
రాశిఫలాలు 14 అక్టోబర్ 2026: నవరాత్రుల్లో నాలుగో రోజున త్రికోణ యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు!
మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, చంద్రుడిపై గురు గ్రహం ప్రభావం ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోవచ్చు. మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మరోవైపు ప్రత్యర్థులు మరియు పొరుగువారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : ఈరోజు దుర్గా చాలీసా పఠించాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.ఈ రాశి నుంచి చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శుక్రుడు,చంద్రుడి కలయిక కారణంగా మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది.
మీ కుటుంబ జీవితంలో సామరస్యం, ప్రేమ పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. మీకు బంధువుల నుంచి ప్రయోజనాలు లభించొచ్చు. మీ ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.
పరిహారం : ఈరోజు దుర్గా మంత్రాలను పఠించాలి.
మిథున రాశి నుంచి ఈరోజు చంద్రుడు ఆరో స్థానం నుంచి సంచారంచ చేయనున్నాడు. ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో విభేదాలు రావొచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించకపోవచ్చు.
మీ ప్రేమ జీవితంలో మాత్రం సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి నుంచి చంద్రుడు నీచ స్థానంలో ఉన్నప్పటికీ, గురుడి ప్రభావంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి.
మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు దుర్గా మంత్రాలను పఠించాలి.
సింహ రాశి నుంచి చంద్రుడు ఈరోజు నాలుగో స్థానంలో నుంచి సంచారం చేయనున్నాడు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చేసే పనిలో పురోగతి సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.
ఈరోజు మీరు చేసే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీకు పొరుగువారి నుంచి మద్దతు లభిస్తుంది. మీ పిల్లలతో సరదాగా సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది.
పరిహారం : ఈరోజు దుర్గా దేవికి ప్రత్యేక పూజలు చేయాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుంచి చంద్రుడు మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ రాశికి అధిపతి అయిన బుధుడు రెండో స్థానంలో ప్రవేశించనున్నాడు. సూర్యుడు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు.
ఈ గ్రహాల ప్రభావంతో మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది.
పరిహారం : ఈరోజు దుర్గా దేవి ప్రత్యేక రూపానికి పూజలు చేయాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి నుంచి చంద్రుడు ఈరోజు రెండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో శుక్రుడు, బుధుడి కలయిక జరగనుంది. సూర్యుడు పన్నెండో స్థానంలో ఉండటం కారణంగా మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. నిత్యావసర వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడొచ్చు.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు చంద్రుడు, గురు గ్రహాల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ మనసులో సంతోషకరంగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.
మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. తోబుట్టువులతో వాదనలలో పాల్గొనడం మానుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయలను బేరీజు వేసుకోవాలి.
పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ రాశికి అధిపతిగా ఉండే గురుడి ప్రభావంతో మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అయితే మీ ఖర్చులు కూడా పెరగొచ్చు.
మీ కుటుంబ విషయాల గురించి ఆందోళన ఉండొచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బయటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుంచి పదకొండో స్థానంలో సంచారం చేయనున్నాడు. గురు, కుజ గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది.
మీకు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ తండ్రి నుంచి ప్రయోజనాలు మరియు మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు.
పరిహారం : ఈరోజు దుర్గా మంత్రాలను పఠించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. పాత పెట్టుబడులు మరియు పరిచయస్తుల వల్ల మీకు ఉపయోగపడొచ్చు. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులు పెరగొచ్చు.
మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీరు స్నేహితులతో సరదాగా గడుపుతారు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు. మీ ప్రేమ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి.
పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. గురు గ్రహం ప్రభావంతో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.
మీ కుటుంబ జీవితంలో ప్రేమ, సామరస్యం నెలకొంటాయి. మీరు పాత పరిచయస్తులను కలుసుకోవచ్చు. మీరు మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
పరిహారం : ఈరోజు దుర్గా మంత్రాలను పఠించాలి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.