Podarillu Serial Today సెప్టెంబర్ 28 ఎపిసోడ్: గోపిక విషయంలో ఇరుక్కున్న చక్రి.. ఏడ్పించిన మహా.. సైకిల్‌పై మాధవ, మనీషా సవారి
Podarillu Serial Today సెప్టెంబర్ 28 ఎపిసోడ్: గోపిక విషయంలో ఇరుక్కున్న చక్రి.. ఏడ్పించిన మహా.. సైకిల్‌పై మాధవ, మనీషా సవారి
Podarillu Serial Today Episode పొదరిల్లు సీరియల్లో సోమవారం నాటి ఎపిసోడ్లో చక్రి మొత్తం డల్‌గా ఉంటాడు. గోపిక మాటలకు చక్రి భయపడిపోతాడు. ప్రాణంగా ప్రేమిస్తున్నా.. మీరంటే ఇష్టం అని గోపిక చెప్తుంది. నేను మాత్రం కేవలం ఫ్రెండ్‌గానే చూశా అని చక్రి చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకో వైపు కేశవ కోసం శైలు ఇంట్లోంచి సున్నుండలు దొంగతనం చేసి తీసుకు వస్తుంది. మరో వైపు మాధవ కోసం ప్రేమగా రసగుల్లా చేసుకుని తీసుకు వస్తుంది మనీషా. ఆ తర్వాత మనీషాని సైకిల్ మీద కూర్చో పెట్టుకుని మాధవ తీసుకు వెళ్తుంటాడు.

కన్ఫ్యూజ్ అయిన చోటు..
కేశవ శైలు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండటం చూసి.. ఇది మన షాపేనా? నేనే తప్పుగా వచ్చానా? అని అనుకుంటాడు చోటు. ఇక అలా చోటు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే.. వెళ్తూ ఉంటే.. అందగాడ అని పిలుస్తుంది శైలు. పార్ట్నర్ ఇది మన షాపేనా? అని చోటు అంటాడు. అవును ఇది మన షాపే అని శైలు అంటుంది. ముందు బండి రెడీ అయింది.. డెలీవరికి ఇచ్చి రా అని చెప్తాడు కేశవ. సరే అన్నా.. అని స్కూటీ తీసుకుని వెళ్తాడు చోటు. నన్ను ఎందుకు రా దూరం పెట్టావ్ ముంగీసా అని ప్రేమగా అడుగుతుంది. అంతా నీ వల్లే అని అంటాడు కేశవ.
నువ్వు నా వైపు ఉంటావా?
నేనంటే నీకు ఎంత ఇప్టం.. నేను అంటే ఇష్టమా? మీ అన్నయ్య అంటే ఇష్టమా? రేపు ఎప్పుడైనా గొడవ జరిగితే.. నువ్వు నా వైపు ఉంటావా? మీ అన్నయ్య వైపు ఉంటావా? అని అడుగుతుంది శైలు. ఏంటే సున్నుండలు ఇచ్చి మళ్లీ గొడవ పడాలని చూస్తున్నావా? అని కేశవ అంటాడు. చెప్పురా ముంగీసా.. నా వైపు ఉంటావా? మీ అన్నయ్య వైపు ఉంటావా? అని శైలు అంటుంది. అన్నయ్య ఇంట్లోవాడు కదా అని కేశవ అంటాడు. అంటే నేను కాదా? కనీసం మాట వరసకు అయినా నా వైపు ఉంటా అని అనడం లేదు.. ముంగీస గాడు అని తిడుతూ ఉంటుంది శైలు.
ఇంకో వైపు జ్వరంతో నారాయణ బాధ పడుతుంటాడు. ఆఫీసు నుంచి వచ్చిన మహా ఆ పరిస్థితిని చూసి చలించిపోతుంది. ఇంట్లోనే ఉంటున్నావ్ మీ నాన్నని చూసుకోవచ్చు కదా అని అంటుంది మహా. నేను ఎప్పుడైనా నాన్న అని పిలిచానా? అని కన్నా అంటాడు. అసలు మీ అన్న చక్రికి ఏమైంది.. ఫోన్ ఎందుకు నాట్ రీచబుల్ అని వస్తోందని మహా అనుకుంటుంది. ఇక నారాయణ కోసం టీ, బ్రెడ్ చేసి తీసుకు వస్తుంది మహా. ఇక అంతలో చక్రి వస్తే.. ఎక్కడికి వెళ్లావ్.. ఫోన్ ఎందుకు నాట్ రీచబుల్ అని వస్తోందని మహా అంటుంది. మాకు ఇంకేం పనులుండవా? అని చక్రి చిరాగ్గా అంటాడు. ఏం రాచకార్యాలున్నాయి.. మీకే రాజ్యాలున్నాయని మహా కౌంటర్ వేస్తుంది.
ఒంటరిగా ఎలా పంపించను..
అన్నయ్య ఫోన్ ఫ్లై మోడ్‌లో ఉంది వదిన అని కన్నా అంటాడు. ఇక మహా బయటకు వెళ్లి థర్మామీటర్ తీసుకుని వస్తా అని అంటుంది. మీరు వద్దు.. నేను వెళ్లి తీసుకు వస్తాను అని అంటాడు చక్రి. మరి దీని కోసమే ఇందాక ఫోన్ చేసిందని మహా అంటుంది. నేను వెళ్లి తీసుకు వస్తా అని మహా అంటే.. మిమ్మల్ని ఒంటరిగా ఎలా పంపించను.. అని చక్రి అంటాడు. ఆఫీసుకి లారీ నిండా మనుషుల్ని తోడుగా పంపిస్తున్నారా? అని అంటుంది మహా. నేను వెళ్తాను అని ఇంకేం కావాలని అడుగుతాడు చక్రి. ఫ్రూట్స్, థర్మా మీటర్ తీసుకు రండి అని చెప్తుంది మహా.
ప్రేమగా రసగుల్లా..
మాధవ కోసం మనీషా స్పెషల్‌గా రసగుల్లా చేసి తీసుకు వస్తుంది. ఇక తెలుగులో మాట్లాడేందుకు మనీషా కష్టపడుతుంది. వచ్చింది.. తెచ్చాడు.. తినమని చెప్పండి అంటూ ఇలా రకరకాలుగా తెలుగు మాట్లాడుతుంది. ఇక మాధవ కష్టపడి అర్థం చేసుకుంటాడు. ఇది నాకు ఇష్టమని మీకు ఎవరు చెప్పారంటూ మాధవ అడుగుతాడు. మహాలక్ష్మీని అడిగి తెలుసుకున్నా అని మనీషా చెప్తుంది. చాలా బాగుందని మాధవ తిని చెప్తే.. ఇంకోటి తీసుకోండని అంటుంది మనీషా. చాలా బాగుంది అంటూ మాధవ ఆమెని పొగిడేస్తుంటాడు. ఇక మనీషా ఏమో సిగ్గు పడుతూ ఉంటుంది.
సైకిల్ మీద ప్రేమ సవారీ..
మరి నువ్వు మళ్లీ తిరిగి ఎలా వెళ్తావ్.. నీకు భయం కాదా? అని మనీషాని మాధవ అడుగుతాడు. మీరున్నారు కదా నాకు భయం ఎందుకు అని మనీషా అంటుంది. ఇక సైకిల్ మీద ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను అని మాధవ అంటాడు. వెనకాల కూర్చో అని పెద్ది అంటే.. లేదు ముందే కూర్చుంటా అని మనీషా అంటుంది. ఇక అలా సైకిల్ మీద ప్రేమ సవారీ చేస్తుంటారు. నీ కళ్లు నీలి సముద్రం అనే పాట బ్యాక్ గ్రౌండ్లో ప్లే అవుతుంటే.. పెద్ది, మనీషా ఇద్దరూ సిగ్గు పడుతూ అలా సైకిల్ మీద వెళ్తుంటారు.
అమ్మలా చూసుకున్న మహా..
బాగా పని అయింది.. ఒళ్లు నొప్పులుగా ఉన్నాయ్ రా అని కేశవ అంటాడు. కన్నా మసాజ్ చేస్తుంటాడు. ఇక నారాయణ తన రేడియో ఆన్ చేస్తాడు. ఇంతలో మహా వచ్చి మళ్లీ టెంపరేచర్ చెక్ చేస్తుంది. నార్మల్‌కి వచ్చింది.. ఈ బ్యాబ్లెట్ వేసుకుని, జావ తాగండని మహా అంటుంది. తగ్గింది కదా.. మందు ఏసే టైంలో మందులు ఎందుకు అని నారాయణ అంటాడు. మళ్లీ వెళ్లి తాగుతా అని అంటున్నారు.. ఈ పీపాని పట్టుకుని పాపా అని అంటే ఎలా అని కేశవ కౌంటర్ వేస్తాడు. ఈ ట్యాబ్లెట్ వేసుకుని జావా తాగాల్సిందే అని మహా బెదిరిస్తుంది. దీంతో సైలెంట్‌గా వేసుకుని బయటకు వెళ్లి జావా తాగేస్తా అని అంటాడు నారాయణ.
అందరూ నవ్వుతూ, హాయిగా ఉంటే.. చక్రి మాత్రం డల్‌గా ఉంటాడు. రేయ్ ఆ బస్టాండ్ అమ్మాయికి ఫోన్ చేయరా కన్నా అని మహా అంటుంది. ఇక్కడ ఒకతను ప్రేమలో పిచ్చివాడు అవుతున్నాడని, ఇన్ని రోజులు లీవ్ పెడితే ఎలా అని అడుగుదాం అని మహా కౌంటర్ వేస్తుంది. అందుకు కాదండి.. అని చక్రి అంటాడు. మరి ఇంకెందుకు ఇంత డల్‌గా ఉన్నారు.. ఒకరు ఇలా ప్రేమలో కష్టపడుతుంటే మేం ఎలా చూస్తూ ఉంటాం అని కావాలనే చక్రికి కౌంటర్లు వేస్తుంది మహా. ఇక అంతటితో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది.