Podarillu Serial Today 31 August Episode: బుజ్జమ్మా అంటూ కంటతడి.. తాయారు కట్టిన రాఖీని విసిరి కొట్టిన నారాయణ.. గుండెలు పిండేసే ఎమోషన్
Podarillu Serial Today 31 August Episode: బుజ్జమ్మా అంటూ కంటతడి.. తాయారు కట్టిన రాఖీని విసిరి కొట్టిన నారాయణ.. గుండెలు పిండేసే ఎమోషన్
Podarillu Serial Today Episode పొదరిల్లు సీరియల్లో సోమవారం నాటి ఎపిసోడ్లో నారాయణకు రాఖీ కట్టేందుకు వస్తుంది తాయారు. రాఖీ కట్టి ప్రేమగా మాట్లాడి.. తర్వాత అసలు రూపాన్ని బయటపెడుతుంది తాయారు. ఇంటి పేపర్ల మీద సంతకం పెట్టమని అడుగుతుంది. దీంతో నారాయణ గుండె ముక్కలు అవుతుంది. కడుపులో ఇంత విషాన్ని పెట్టుకుని వచ్చి రాఖీ కట్టావా? అంటూ ఆ రాఖీని విసిరి కొడతాడు నారాయణ. చెల్లి మీద ప్రేమను చెబుతూ నారాయణ కన్నీరు పెట్టుకుంటాడు. చివరకు నారాయణకి గాయత్రి ఆ రాఖీని కడుతుంది.

ఇంటికి వచ్చిన తాయారు..
ఇంటి ముందు ఆడబిడ్డ వచ్చి ఉంది.. కనీసం కాళ్లు కడుక్కోడానికి నీళ్లు కూడా ఇవ్వరా? అని తాయారు అడుగుతుంది. దీంతో మాధవ వెళ్లి నీళ్లు ఇస్తాడు. ఏ.. నేను రావడం మీ నాన్నకి ఇష్టం లేదా? మీ నాన్న వచ్చి ఇవ్వడా? అని తాయారు అంటుంది. దీంతో నారాయణ బయటకు వస్తాడు. వచ్చి నీళ్లు ఇస్తాడు. దీంతో తాయారు కాళ్లు కడుక్కుని లోపలకు వస్తుంది. అందరూ కలిసి హాల్లో కూర్చుంటారు. ఇప్పుడు ఈ ఇంటికి కల వచ్చినట్టు ఉంది అని అంటుంది మహా. హారతి పళ్లెం ఇవ్వమ్మా? అని మహాని తాయారు అడుగుతుంది.
రాఖీ కట్టిన తాయారు..
నారాయణకు రాఖీ కడుతుంది తాయారు. నేను చెప్పిన ఒక్క మాటతో అమ్మ వచ్చింది.. మనస్పూర్తిగా రాఖీ కట్టించుకో మామయ్య అని గాయత్రి అంటుంది. దీంతో నారాయణ అనుమానంగానే కాస్త చేతులు పైకి ఎత్తుతాడు. ఇక తాయారుని చూసి నారాయణ ఎమోషనల్ అవుతాడు. ఇది కదా కావాల్సింది.. ఫోటోలు తీయండని కన్నా, కేశవకి మహా చెబుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. రాఖీ కట్టిన తర్వాత అందరికీ బొట్టు పెడుతుంది, స్వీట్లు తినిపించుకుంటారు. మాధవ, కేశవ, చక్రి కలిసి డబ్బులు ఇస్తారు, మహా ఓ కొత్త చీర ఇస్తుంది.
సంతకం పెట్టు..
రాఖీ కట్టినందుకు నీ కొడుకులు డబ్బులు, నీ కోడలు చీర ఇచ్చింది.. మరి నువ్వేం ఇవ్వవరా అని తాయారు అడుగుతుంది. బంగారం మాత్రం అడగకు.. కొనేలా లేదు అని చక్రి అంటాడు. ఈ వయసులో నాకు బంగారం ఎందుకు రా అని తాయారు అంటుంది. మరి ఏం కావాలో అడుగు అత్త అని పెద్ది అంటాడు. ఆ పేపర్ల మీద సంతకం పెట్టు.. నా వాటా నాకు ఇవ్వు.. మీ బావకి ఎలాగో వయసు అవుతోంది.. ఈ స్థలంలో ఓ కొట్టు పెట్టుకుని బతికేస్తా అని తాయారు తన అసలు రంగుని బయట పెడుతుంది.
నువ్వు బాగుంటే చాలా?
బుజ్జమ్మా.. ఏ తోబుట్టువు అయినా.. దీనస్థితిలో ఉండి.. నీ మొగుడు చేతకాని వాడు అయి ఉంటే.. నీకంటూ నిలువ నీడ, తినడానికి బుక్కెడ అన్నం లేకపోతే.. అన్నగా ఏదైనా చేసేవాడ్ని.. కానీ అన్నీ ఉన్న నువ్వు ఇలా అడుగుతున్నావ్.. అంటే నువ్వు బాగుంటే చాలా? నీ అన్న, అన్న కొడుకులు బాగుండొద్దా? నీ రక్త సంబంధం ఎలా పోయినా పర్లేదా? అయినా ఈ రాఖీ పండుగ, అన్నాచెల్లెళ్ల బంధాన్ని నీ స్వార్థం కోసం దిగజార్చకు బుజ్జమ్మ.. ఎంత స్వార్థంగా మారిపోయాావే బుజ్జమ్మ అని నారాయణ ఎమోషనల్ అవుతాడు.
ఆ రోజులు గుర్తుకు వచ్చాయి..
అత్తయ్య వస్తుంది.. రాఖీ కడుతుంది.. అని నా కొడుకులు అంతా సంతోషించారు.. కానీ నీ మనసులో ఎలాంటి దుర్బుద్దితో వస్తావో నాకు తెలుసు..అయినా రాఖీ పండుగ కదా.. అని నువ్వు వస్తున్నావ్ అని.. నీలోని మన రక్తం.. నాకు పాత రోజుల్ని గుర్తు చేసింది.. నీకు జాతరలో కొనిచ్చిన రోజులు.. మనం సంతోషంగా ఉన్న రోజులు.. గాయత్రి పుట్టినప్పుడు నా భార్య వేసిన సిగ్గు బిల్ల.. నా కోడలు పుట్టిందని సంతోషించిన రోజులు అన్నీ గుర్తుకు వచ్చాయి.. బుజ్జమ్మ అని నారాయణ కన్నీరు పెట్టుకుంటాడు.
బంధాన్ని దిగజార్చకు..
తోడ బుట్టిన వాడి క్షేమం గురించి రాఖీ కట్టాలి కానీ.. ఇలా కడుపులో విషం పెట్టుకుని కడతావా? నీ స్వార్థం కోసం అన్నాచెల్లెళ్లి బంధాన్ని దిగజార్చకు.. నీలాంటి దాని కోసం నా కడుపున పుట్టిన వాళ్లకి అన్యాయం చేయలేను.. నేను బతికి ఉండగా.. ఈ ఇంటిని ముక్కలు కానివ్వను.. నేను చచ్చిన తర్వాత కూడా నా ఆత్మ ఈ ఇంటి నుంచే రక్షణగా తిరుగుతుంది అని నారాయణ అంటాడు. నాకు తెలుసు రా నువ్వు ఇలానే అంటావ్.. నీ మనసు కరగదు అని తాయారు అంటుంది.
రాఖీని విసిరి కొట్టిన నారాయణ..
నువ్వు నాకు రాసిస్తే ఇక మనం కలిసిపోదాం.. మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోదాం.. నేను పెట్టిన శాపం వెనక్కి తీసుకుని.. అందరికీ పెళ్లిళ్లు చేసి.. అందరి పెళ్లికి నేనే పెద్దలా ఉందాం అని అనుకున్నా.. నీ మనసు మారదు.. నువ్వు నాకు ఆస్తి ఇవ్వవు అని తెలుసు రా.. నువ్వే ఇదంతా బొంద మీద పెట్టుకుని వెళ్తావా? అని తాయారు తిడుతుంది. అమ్మా.. ఇంకో ఒక్క మాట మాట్లాడినా బాగుండదు అని గాయత్రి అంటుంది. తాయారుని గాయత్రి పట్టుకుని తీసుకు వెళ్లాలని చూస్తుంది. తాయరు కట్టిన రాఖీని కూడా నారాయణ విసిరేస్తాడు.
నేను కడతాను మామయ్య..
నన్ను క్షమించు మామయ్య.. ఇలా జరుగుతుందని అనుకోలేదు.. నేను చెప్పాను కదా.. అని.. అమ్మ మారిపోయిందని అనుకున్నా.. కానీ ఇలా తన బుద్ది చూపిస్తుందని అనుకోలేదు.. నీకు మీ చెల్లి కట్టకపోతే ఏంటి.. నేనే ఈ ఇంటి ఆడబిడ్డని అనుకో.. నేనే నీకు రాఖీ కడతాను మామయ్య అని గాయత్రి అంటుంది. ఆ మాటలకు నారాయణ గుండె కరిగిపోతుంది. కన్నీరు కారుస్తూనే చేయిని పైకి ఎత్తుతాడు. ఇక నారాయణకు ఆడ బిడ్డలాాా మారి రాఖీ కడుతుంది గాయత్రి. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది