Dasoju Sravan | మీనాక్షి నటరాజన్‌కు దండం పెట్టి చెబుతున్న.. రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించండి
Dasoju Sravan | మీనాక్షి నటరాజన్‌కు దండం పెట్టి చెబుతున్న.. రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించండి
Dasoju Sravan | సీఎం రేవంత్‌రెడ్డి సైకోలా మారిపోయాడని.. మీనాక్షి నటరాజన్ స్పందించి రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సూచించారు. ఎవరెవరికో అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారని.. రేవంత్ లాంటి వ్యక్తిని వదిలిపెట్టడం కరెక్టు కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

- ఆయన సైకోలా మారిపోయాడు.. రేవంత్‌ను తన భాషే భస్మం చేస్తుంది
- రేవంత్‌ది సోషల్ జస్టిస్ కాదు.. అనుముల జస్టిస్
- చేవెళ్ల, షాబాద్ ప్రాంతాల్లో భూముల మీద వాలుతున్నరు
- ముత్యాల ముగ్గు మూవీలో రావుగోపాల్‌రావు లాంటోడు రేవంత్‌రెడ్డి
- సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి ఉంటే నేను గుండు గీసుకుంటా
- మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చెడుగుడు
Dasoju Sravan | సీఎం రేవంత్‌రెడ్డి సైకోలా మారిపోయాడని.. మీనాక్షి నటరాజన్ స్పందించి రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సూచించారు. ఎవరెవరికో అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారని.. రేవంత్ లాంటి వ్యక్తిని వదిలిపెట్టడం కరెక్టు కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనది సోషల్ జస్టిస్ అని మాట్లాడుతున్నారని.. రేవంత్‌ది అనుముల జస్టిస్ అని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి ఉంటే నేనే గుండు గీసుకుంటానన్నారు. లేదంటే రేవంత్ గుండు గీసుకుంటారా? అని సవాల్ విసిరారు. నిన్న ములుగు, పరకాలలో ముఖ్యమంత్రి బూతుల పరంపర కొనసాగించారని ఎద్దేవా చేశారు. ఈమేరకు సోమవారం తెలంగాణ భవన్‌లో దాసోజు మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ను చెడుగుడు ఆడుకున్నారు.
రేవంత్ రెడ్డికి సోషల్ జస్టిస్‌కు అర్థం తెలుసా? రేవంత్ రెడ్డిది సోషల్ జస్టిస్ కాదు.. అనుముల జస్టిస్. రేవంత్ రెడ్డి.. ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాల్ రావు లాంటోడు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఎందుకు.. దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావును ఎదుర్కో.
రేవంత్ రెడ్డి అల్పులా.. సజ్జనుడా చెప్పాలి. గాంధీ పెట్టిన పార్టీకి ముఖ్యమంత్రివేనా రేవంత్ రెడ్డి? వీధి రౌడీలా మాట్లాడటం రాజకీయమా. తెలంగాణ గాంధీ కేసీఆర్ తన వెంట్రుక పీకలేడని రేవంత్ రెడ్డి మాట్లాడతాడా? తన నెత్తి మీద తనే చేయి పెట్టుకొని రేవంత్ రెడ్డి మసి అయిపోతాడు. రేవంత్ రెడ్డి భాషే రేవంత్‌ను భస్మం చేస్తుంది. రేవంత్ రెడ్డిని తన భాషే భస్మం చేస్తుంది. 18 గంటలు పని చేసి రాష్ట్రానికి ఏం చేశావు? 78 సార్లు డిల్లీకి మూటలు మోసావు.
మోసగాళ్లకే మోసగాడు..
రేవంత్ రెడ్డి సాధించింది అనుముల కుటుంబం దోపిడి. మోసగాళ్లకు మోసగాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లాంటి కేటుగాడు మరొకరు లేరు. కోర్టుల్లో కేసులు వేయించి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలను ఆపేశారు. పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణను బొక్కా బోర్లా పడేశారు. చేవెళ్ల, షాబాద్ ప్రాంతాల్లో గద్దల లెక్క వాలి భూములను దోచుకుంటున్నారు. మ్యానిఫెస్టోలో సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని పెట్టలేదు..అలా పెట్టామని చెబితే అరగుండుతో తిరుగుతా.
నా గొంతు కోసి కోదండరాంను ఎమ్మెల్సీ చేశాడు..
ముఖ్యమంత్రి తన అనుచరుడు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించాడు. వీ హనుమంతరావుకు రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి డబ్బు సంచులు దొబ్బి ఎవరెవరి గొంతు కోశాడో నాకు తెలుసు. నా గొంతు కోసి కోదండరాంను ఎమ్మెల్సీ చేశాడు. కోదండ రామ్‌ను శిఖండిలా పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నాడు.
మహేష్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ ప్రెసిడెంట్‌గా చేశాననటం దొరరికం. ఫ్యూడల్ మనస్తత్వం. రేవంత్ రెడ్డి.. నీ ఆస్తులపై చర్చకు రావాలి. త్వరలోనే కాందీశీకుల భూములపై పడతారు. అందరి ఇళ్లలో పంచాయతీలు ఉంటాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అందరి ఇళ్లలో తొంగి చూస్తున్నావా.. తిరుపతి రెడ్డి బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డి కుటుంబం ఎందుకు వెళ్లలేదు. రాహుల్, మీనాక్షి జోక్యం చేసుకుని రేవంత్ తీరును మారిస్తే మంచిది. లేదంటే కాంగ్రెస్‌కు సమాధి తప్పదు.
తిరుపతి రెడ్డి బర్త్ డే ఫ్లెక్సీలు ఎందుకు తీసి వేయించావు. కేటీఆర్, హరీష్ రావు ఉద్యమకారులు. రేవంత్ ఎప్పటికైనా తెలంగాణ ద్రోహే. కేసీఆర్‌కు తెలంగాణ అంతా ఓకే కుటుంబం అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో బొమ్మెర రామమూర్తి, గోసుల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.