Chukkala Amavasya 2026 | రేపే చుక్క‌ల అమావాస్య‌.. ఈ పూజ చేస్తే అమ్మాయిల‌కు వివాహం ఖాయం..!

Chukkala Amavasya 2026 | రేపే చుక్క‌ల అమావాస్య‌.. ఈ పూజ చేస్తే అమ్మాయిల‌కు వివాహం ఖాయం..!

Chukkala Amavasya 2026 | అమ్మాయిలూ.. మీకు వివాహం( Marriage ) కావ‌డం లేదా..? ఈ శ్రావ‌ణ మాసం( Sravana Masam 2026 )లో పెళ్లిపీట‌లు ఎక్కాల‌ని ఉందా..? అయితే మీకో అద్భుత‌మైన అవ‌కాశం వ‌చ్చింది. ఆగ‌స్టు 12న వ‌చ్చే చుక్క‌ల అమావాస్య( Chukkala Amavasya 2026 ) రోజున గౌరీపూజ( Gowri Vrata Puja ) నిర్వ‌హిస్తే.. మీరు కోరుకున్న‌ట్టు వివాహం జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ట‌.

Chukkala Amavasya 2026 | రేపే చుక్క‌ల అమావాస్య‌.. ఈ పూజ చేస్తే అమ్మాయిల‌కు వివాహం ఖాయం..!

| జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం ప్ర‌తి అమావాస్య‌కు ఒక ప్ర‌త్యేక విశిష్ట‌త ఉంటుంది. అయితే ఆషాఢ మాసం( Ashada Masam )లో వ‌చ్చే చివ‌రి అమావాస్య‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. ఈ చివ‌రి అమావాస్య‌ను చుక్క‌ల అమావాస్య‌( Chukkala Amavasya 2026 ) గా కూడా ప‌రిగ‌ణిస్తారు. ఆగ‌స్టు 12న వ‌చ్చిన ఈ చుక్క‌ల అమావాస్య పెళ్లికాని అమ్మాయిల‌కు ఎంతో లాభం క‌లిగిస్తుంద‌ని పండితులు పేర్కొంటున్నారు. 12వ తేదీన గౌరీ పూజ( Gowri Vrata Puja ) చేస్తే వివాహం( Marriage ) కోరుకునే అమ్మాయిల‌కు వెంట‌నే వివాహం అవ‌డం ఖాయ‌మ‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ గౌరీ పూజ ఎలా చేయాలో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

చుక్క‌ల అమావాస్య రోజున పెళ్లి కాని యువ‌తులు త‌ల స్నాన‌మాచ‌రించాలి. ఆ త‌ర్వాత ఇంట్లోనే గౌరీ పూజ‌ను చేయాలి. శుద్ధ‌మైన ప‌సుపును తీసుకొని గౌరీదేవి రూపాన్ని త‌యారు చేయాలి. బియ్య‌పు పిండితో కుడుములు త‌యారు చేయాలి. అనంత‌రం గౌరీపూజ నిర్వ‌హించి.. కుడుముల‌ను అమ్మ‌వారికి నైవేద్యంగా స‌మ‌ర్పించాలి. పూజ అనంత‌రం ర‌క్ష‌ను ధ‌రిస్తే.. వివాహం కోరుకునే అమ్మాయిల‌కు వెంటనే పెళ్లి జ‌రుగుతుంద‌ని పండితులు పేర్కొంటున్నారు.

అంటే చుక్క‌ల అమావాస్య మ‌రుస‌టి రోజు నుంచి ప్రారంభ‌మ‌య్యే శ్రావ‌ణ మాసం( Sravana Masam 2026 )లో పెళ్లి పీట‌లు ఎక్కే అవ‌కాశం ఉంటుంది. ఇక ఆగ‌స్టు 12న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే అనుకోని ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. పుణ్య నదుల్లో నదీ స్నానం చేయడం .. పేదలకు అన్నదానం.. చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *