రాశిఫలాలు 30 జూలై 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో మేషం, కన్య సహా ఏ రాశులకు శుభం? ఎవరికి ప్రతికూలం?
రాశిఫలాలు 30 జూలై 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో మేషం, కన్య సహా ఏ రాశులకు శుభం? ఎవరికి ప్రతికూలం?
horoscope today 30 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఆయుష్మాన్, సౌభాగ్య యోగాల ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
horoscope today 30 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఆయుష్మాన్, సౌభాగ్య యోగాలు ఏర్పడనున్నాయి. కర్కాటక రాశిలో హంస రాజయోగం, గురు, సూర్య, చంద్ర గ్రహాల ప్రభావంతో కేంద్ర యోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మేషం, కన్య సహా ఈ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభించొచ్చు. ఉద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీరు కోరుకున్న చోటుకు బదిలీ కావొచ్చు.
శుభ యోగాల ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందే అవకాశాలున్నాయి. అంతేకాదు మీరుప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
పరిహారం : ఈరోజు విష్ణు సహస్రనామం పఠించాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారు ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. శుభ యోగాల కారణంగా మీ కష్టానికి ఫలితం దక్కే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని కీలక బాధ్యతలు లభించే అవకాశం ఉంది. వీటిని మీరు చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు.
ఈ కాలంలో మీరు చేసే పనుల్లో తొందరపడకుండా ఉండాలి. చాలా విషయాల్లో ఓపికగా ఉండాలి. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి.
పరిహారం : ఈరోజు శివయ్యను పూజించాలి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. శుభ యోగాల ప్రభావంతో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధించొచ్చు. వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తున్న వారికి గొప్ప అవకాశాలు లభించొచ్చు.
నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు రావొచ్చు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
పరిహారం : ఈరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ పరమేశ్వరుడిని పూజించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి రానుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
చాలా కాలంగా భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది.
పరిహారం :ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో అవసరానికి మించి ఖర్చులు చేయకూడదు. ఉద్యోగులు తొందరపడి ఎలాంటి పనీ చేయకూడదు.
వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశాలున్నాయి. మీ మాటతీరును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం కలగొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీరు కోల్పోయిన డబ్బు తిరిగి పొందొచ్చు.
ఈరోజు ఏర్పడే అద్భుతమైన యోగాల వల్ల వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని వినాయకుడిని పూజించాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు గురు, చంద్రుల అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు.
ఈరోజు తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగులకు కార్యాలయంలో సమయం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం పొందడానికి సీనియర్ల సలహాలు, సూచనలు పాటించాలి.
పరిహారం : ఈరోజు శివుడిని పూజించాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు విష్ణుమూర్తి అనుగ్రహంతో అనేక రంగాల్లో అదృష్టం కలిసి రానుంది. పెండింగులో ఉన్నమీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీకు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది.
శుభ యోగాల కారణంగా మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు పొందొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు కోరుకున్న చోటకు బదిలీ కావొచ్చు.
పరిహారం : ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకుని, శివ చాలీసా పఠించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ పనులన్నీ చాలా శ్రద్ధగా పూర్తి చేస్తారు. పనికి సంబంధించి సీనియర్ల సలహా పాటించాలి. వాటిని అమలు చేయడానికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ప్రణాళికలు వేసుకోవచ్చు.
వ్యాపారవేత్తలకు ఈరోజు ముఖ్యమైన రోజు కానుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు గురు గ్రహం అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.
మీ వ్యక్తిగత జీవితంలో మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల నియంత్రణలో మీరు విజయం సాధించొచ్చు. మీ ప్రియమైన వారి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందొచ్చు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేయాల్సి ఉంటుంది.
పరిహారం :ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రావొచ్చు. మీరు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. మీరు చాలా విషయాల్లో పొదుపు పాటించాలి. అప్పుడే మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు.
ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఉన్నతాధికారుల మద్దతు లభించే అవకాశం ఉంది. మీరు ఒక పెద్ద ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు.
పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు చంద్రుడు, గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. శుభ యోగాల కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
ఆస్తి సంబంధిత లావాదేవీలలో మీకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. పెండింగులో ఉన్న పనులన్నీ తిరిగి ప్రారంభం కావొచ్చు.
పరిహారం : ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.