రాశిఫలాలు 17 జూన్ 2026: ఈరోజు ధ్రువ యోగం ప్రభావంతో సింహం, తులా సహా ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం

 రాశిఫలాలు 17 జూన్ 2026: ఈరోజు ధ్రువ యోగం ప్రభావంతో సింహం, తులా సహా ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం

రాశిఫలాలు 17 జూన్ 2026: ఈరోజు ధ్రువ యోగం ప్రభావంతో సింహం, తులా సహా ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం

horoscope today 17 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ధ్రువ యోగం ప్రభావంతో సింహం, తులా సహా ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Jun17 (2)
horoscope today 17 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు ఈరోజు ధ్రువ యోగంతో పాటు అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా సింహం, తులా సహా ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. మీ జాతకంలో బుధుడి గ్రహ స్థానం బలపడుతుంది. అంతేకాదు వినాయకుడి అనుగ్రహాన్ని పొందొచ్చు. ఈ కారణంగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వ్యక్తులకు వినాయకుడి అనుగ్రహంతో మంచి లాభాలు రావొచ్చు. విదేశాలలో ఉద్యోగం పొందాలని కలలు కంటున్న వారికి శుభవార్తలు వినిపించొచ్చు. ఈరోజు మీరు ఆధ్యాత్మిక యాత్రలకు కూడా వెళ్లొచ్చు. ధ్రువ యోగం ప్రభావంతో వ్యాపారులు మంచి పురోగతి సాధిస్తారు. మీ కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అయితే మీరు కేవలం భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాపారులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీ పనులను వాయిదా వేయడం మానుకోండి. మీకు వరుసగా శుభవార్తలు వినిపించొచ్చు.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు కళాత్మక యోగం ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. మార్కెటింగ్, మీడియా, కన్సల్టింగ్ లేదా రచనా రంగాల్లో పనిచేసే వారికి గొప్ప ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు జీతం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపించొచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు అనేక లాభాలొచ్చే అవకాశం ఉంది. ఇదే రాశిలో కళాత్మక యోగం ఏర్పడుతోంది. కాబట్టి మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. మీ వ్యక్తిత్వం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీకు అప్పుల నుంచి విముక్తి లభించొచ్చు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. సమాజంలో మీకు కీర్తి, గౌరవాలు లభిస్తాయి. ధ్రువ యోగం ప్రభావంతో మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టకరంగా కలిసొచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. శుభ యోగాల కారణంగా మీకు స్వర్ణయుగం ప్రారంభం కానుంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలను పొందొచ్చు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి మీకు మంచి అవకాశాలొస్తాయి. మీకు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి రావొచ్చు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ధ్రువ యోగం ప్రభావంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. పని విషయంలో తొందరపడకండి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి కుజుడు ఆరో స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారొచ్చు. మీ కుటుంబంతో సంబంధాలు బలపడతాయి. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. కొందరు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి నుంచి గురుడు అష్టమ స్థానంలో తిరోగమనం చేయనున్నాడు. మరోవైపు ధ్రువ యోగం ప్రభావంతో గొప్ప ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు శారీరక సౌకర్యం కూడా లభిస్తుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభించొచ్చు. విదేశాలకు వెళ్లాలని యోచిస్తున్న వారికి మంచి అవకాశాలు లభించొచ్చు. ఈరోజు కొత్త ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మీకు మానసిక ప్రశాంతత లభించొచ్చు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మిథునంలో బుధుడు,కుంభంలో రాహువు ఉండటం కారణంగా మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు గురుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ మీ సంపదను పెంచేందుకు సహాయపడనున్నాడు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. శత్రువుల భయాలు తొలగిపోతాయి. అత్యంత బలమైన ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు. మీ కోరికలు నెరవేరే అవకాశాలున్నాయి..

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు తాము చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈరోజు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఇది మీ జీవిత భాగస్వామితో సైద్ధాంతి విభేదాలకు దారితీయొచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ సన్నిహితులు కొన్ని విషయాల గురించి మనస్తాపం చెందొచ్చు. మీరు ఇటీవల ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ఉంటే, నష్టాలను ఎదుర్కోవచ్చు. మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఉద్రిక్తతలు పెరగొచ్చు. కాబట్టి కుటుంబ కలహాలకు దూరంగా ఉండి, ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మీకు విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

 

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *