రాశిఫలాలు 27 మే 2026: ఈరోజు గజకేసరి యోగం వల్ల మేషం, సింహం సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు

 రాశిఫలాలు 27 మే 2026: ఈరోజు గజకేసరి యోగం వల్ల మేషం, సింహం సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు

రాశిఫలాలు 27 మే 2026: ఈరోజు గజకేసరి యోగం వల్ల మేషం, సింహం సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు

horoscope today 27 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel May27
horoscope today 27 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రవి యోగం, సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. మరోవైపు బుధుడు, కుజుడు, చంద్రుడు, సూర్య గ్రహాల ప్రభావంతో బుధాదిత్య, గజకేసరి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. బుధుడి స్థానం బలపడటంతో మరికొన్నిరాశుల వారికి గణేశుని అనుగ్రహం లభిస్తుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించొచ్చు. ఈరోజు మీరు ఊహించని లాభాలను పొందొచ్చు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి రావొచ్చు. మీకు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభించొచ్చు. భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఇతరులతో బాగా కలిసిపోతారు. ఈరోజు మీరు చేసే పనిలో ఏదైనా కొత్తగా ప్రయత్నించొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడులకు నష్టం రావొచ్చు. ఈ కారణంగా మీకు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి నిరాశ ఎదురుకావొచ్చు. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస్తుంటే, అన్ని పత్రాలను ముందే చెక్ చేసుకోవాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ పనులన్నీ పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. పాత స్నేహితులు మీ ఇంటికి రావొచ్చు. ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానుకోవాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయొచ్చు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఈరోజు పెండింగులో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుంచి మద్దతు లభించడంతో మంచి విజయం సాధించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. సమాజంలో మీ కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. స్నేహితులతో మీ సంబంధాలు బలపడతాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల కఠినమైన మాటలు మిమ్మల్ని బాధపెట్టొచ్చు. ఆస్తి సంబంధిత వివాదాల సమయంలో ప్రశాంతంగా ఉండటం మంచిది. మీ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన వాదనలు లేదా వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మానుకోవాలి. మీరు ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం ఉంది. మీ పనులను ఉత్సాహంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఒకే సమయంలో అనేక బాధ్యతలు ఉండటం వల్ల మీకు అశాంతి పెరుగుతుంది. మీ కుటుంబ సంక్షేమం కోసం మరింత కష్టపడతారు. కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వీరి నుంచి అనేక ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి మంచి అవకాశాలు లభించొచ్చు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించాలనుకునే వారికి మంచి విజయం లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. అయితే మీ ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవాలి. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఇంట్లో ఉండే కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీకు ఆకస్మికంగా ఆర్థిక లాభాలు రావొచ్చు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు ఊహించిన విధంగా ఫలితాలు రావాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల కొంత నష్టపోవచ్చు. మీ పనిపై మరింత శ్రద్ధ వహించాలి. కొందరు పుకార్లను నమ్మడం, వ్యాప్తి చేయడం మానుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. ఉన్నతాధికారులతో అర్థవంతమైన సంభాషణ జరపాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు పెండింగులో ఉన్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు ఎదురైనా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయం గడపొచ్చు. వ్యాపారులకు ఆశించిన లాభాలు రావొచ్చు. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభించనుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధించొచ్చు. మీ పెండింగ్ పనులు సకాలంలో పూర్తవ్వొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీకు పూర్వీకుల నుంచి ఆస్తి లభించొచ్చు. వ్యాపారులకు గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభించనుంది. అవివాహితులకు మంచి వివాహ అవకాశాలొస్తాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *