రాశిఫలాలు 21 మే 2026: ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మిథునం, సింహం సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు

 రాశిఫలాలు 21 మే 2026: ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మిథునం, సింహం సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు

రాశిఫలాలు 21 మే 2026: ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మిథునం, సింహం సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు

horoscope today 21 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel May21
horoscope today 21 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు వృద్ధి, గండ యోగాలు ఏర్పడనున్నాయి. ఇదే సమయంలో సూర్యుడు, బుధుడి, గురు గ్రహం అనుగ్రహంతో మిథునం, సింహం సహా కొన్ని రాశుల వారికి మెరుగైన ఫలితాలు రావొచ్చు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభించనుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి నుంచి మూడో స్థానంలో సంచారం చేస్తున్న గురువు ప్రభావంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు గురు గ్రహం అనుగ్రహం లభించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడొచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీకు స్నేహితులు, అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉది. మీరు కొత్త వ్యక్తులతో బంధాన్ని కొనసాగిస్తారు. మీ ఆదాయం గణనీయంగా పెరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు కష్టపడి చేసే పనులకు మంచి ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలపై మరింత శ్రద్ధ వహించాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కష్టానికి తగిన ఫలాలు పొందొచ్చు. మీరు చేసే పనులన్నీ విజయవంతంగా ముగిసే అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి, గౌరవం పెరుగుతాయి. వ్యాపారులకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు తాము చేసిన పనులకు ప్రశంసలు లభించొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు, సహోద్యోగుల నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు. మీరు కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. స్నేహితులతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. పెట్టుబడుల నుంచి మీరు భారీ లాభాలు పొందొచ్చు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ మనసులో సంతోషంగా ఉంటుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు చేసే పనుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. కష్టమైన పనులను కుటుంబ సభ్యుల సాయంతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. పెద్దల నుంచి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. మీరు చేసే పనులన్నింట్లో అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా సంతోషిస్తారు. ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి యాత్రకు వెళ్లొచ్చు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. ఈరోజు ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకుంటారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ కాలంలో మీరు విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకావం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఆకస్మికంగా పెద్ద మార్పులు రావొచ్చు. మీరు కోరుకున్నప్రదేశానికి బదిలీ కావొచ్చు. మీ ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ముఖ్యమైన పనులకు సంబంధించి స్నేహితులతో చర్చిస్తారు. వారి మద్దతుతో మీ పనులను సకాలంలో పూర్తి చేయొచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ కుటుంబ సభ్యుల సహకారంతో అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారంతో కార్యాలయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మీ ప్రయాణం వల్ల సానుకూల ఫలితాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు పాత బకాయిల నుంచి విముక్తి లభించొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు రావొచ్చు. ఈ సమయంలో మీరు మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో ఈరోజు మీరు చాలా ఓపికగా ఉండాలి. ఆర్థిక పరంగా కొంత నష్టాలు ఎదురవ్వొచ్చు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మీ తోబుట్టువులతో విభేదాలు తలెత్తొచ్చు. మీ పనులను తెలివిగా నిర్వహించకపోతే కొంత ఆందోళన పెరగొచ్చు.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని దేవుని ప్రభావంతో వ్యాపారులకు కొంత ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. డబ్బు గురించి ఆందోళనల కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఒక చిన్న ప్రయాణం చేయాలనుకున్నా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలతో రాణించాలంటే మరింత కష్టపడాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *