రాశిఫలాలు 20 మే 2026: ఈరోజు శూల యోగం ప్రభావంతో మిథునం, మీనం సహా ఈ 5 రాశులకు విజయం కలిసి రానుందా?

 రాశిఫలాలు 20 మే 2026: ఈరోజు శూల యోగం ప్రభావంతో మిథునం, మీనం సహా ఈ 5 రాశులకు విజయం కలిసి రానుందా?

రాశిఫలాలు 20 మే 2026: ఈరోజు శూల యోగం ప్రభావంతో మిథునం, మీనం సహా ఈ 5 రాశులకు విజయం కలిసి రానుందా?

horoscope today 20 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీనారాయణ రాజయోగం ప్రభావంతో మిథునం, తులా సహా ఈ 5 రాశులకు అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Ma20
horoscope today 20 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు, బుధుడు కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. దీంతో పాటు శూల, గండ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా మిథునం, తులా సహా ఈ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. రాహువు, కేతువు ప్రభావంతో మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

​మేష రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ మనోధైర్యం పెరుగుతుంది. మీ మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు సాహాసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థిక పరమైన ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. శుక్రుడి అనుగ్రహంతో వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. కెరీర్ పరంగా మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగేందుకు కొత్త మార్గాలు లభిస్తాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందొచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వాహనం కొనేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో పురోగతి లభించొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి లభించే అవకాశం ఉంది. మీకు రావాల్సిన డబ్బును తిరిగి పొందొచ్చు. మీ ఆదాయం పెరగడం వల్ల సంతోషంగా ఉంటారు. సమాజంలో మీ కీర్తి, గౌరవం పెరుగుతాయి. స్నేహితులతో మీ సంబంధాలు బలపడతాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు సంబంధాలొచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి ఒప్పందాలు చేసుకోవచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీరు చేసే పనుల్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి చంద్రుడు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. గతంలో మీరు చేసిన పనులకు మంచి ప్రయోజనాలు లభించొచ్చు. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ఉన్నతాధికారులు మీపై ఒత్తిడి తీసుకురావొచ్చు. మీ వైవాహిక జీవితంలో సామరస్యం నెలకొంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి, గౌరవం పెరిగే అవకాశం ఉంది. స్నేహితుల సాయంతో మీరు అనేక పనులను పూర్తి చేయొచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పెట్టుబడులకు సంబంధించి మంచి రాబడి రావొచ్చు. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయం లభించొచ్చు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పురోగతి లభించొచ్చు. మీరు చేసే పనులన్నింటికీ మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన, వినోదాత్మకమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ బంధువులతో సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు సూర్యుడు, బుధుడి కలయిక కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు మంచి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఒక నిర్దిష్ట విషయంపై మీ మనసు కొంత గందరగోళంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులు తిరిగి ప్రారంభం కావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. సహోద్యోగులు, సీనియర్ల సహకారంతో పనులన్నీ సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. అంతేకాదు కొత్త పనిని చేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. దీంతో మీరు ఆనందంగా గడుపుతారు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి నుంచి కుజుడు నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు సూర్యుడు, బుధుడి కలయికతో విద్యార్థులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు కొత్త వాహనం కొనేందుకు ప్లాన్ చేస్తారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీ పూర్వీకుల ఆస్తి నుంచి మెరుగైన ప్రయోజనాలు పొందొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు కనిపించడం వల్ల మీరు మంచి లాభాలు పొందుతారు. మీ ఆరోగ్యం మెరుగవ్వొచ్చు. ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించడంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో గజకేసరి యోగం ఏర్పడటం వల్ల అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి పని చేయడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *