రాశిఫలాలు 19 మే 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో సింహం, తులా సహా ఈ 4 రాశులకు శుభవార్తలు

 రాశిఫలాలు 19 మే 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో సింహం, తులా సహా ఈ 4 రాశులకు శుభవార్తలు

రాశిఫలాలు 19 మే 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో సింహం, తులా సహా ఈ 4 రాశులకు శుభవార్తలు

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి నుంచి ఈరోజు చంద్రుడు మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో గజకేసరి యోగం ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుజుడి అనుగ్రహంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మరోవైపు ఈ రాశి నుంచి రెండో స్థానంలో సూర్య, బుధ గ్రహాల కలయికతో వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు సూర్యుడు, బుధుడి ప్రభావంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులు ఈరోజు కొత్త ప్రాజెక్ట్ లేదా ప్రణాళికపై పనిని ప్రారంభించొచ్చు. మీ మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి రెండో స్థానంలో గురు, చంద్రుల కలయిక జరగనుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఒక నిర్దిష్ట విషయం గురించి మానసిక సంఘర్షణ ఎదురవుతుంది. కెరీర్ పరంగా ఎదగాలంటే మరింత కష్టపడాలి. ఉద్యోగులు సరికొత్త ఆలోచనలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. బంధువులు లేదా సన్నిహితులకు సంబంధించి కొన్ని చిన్నపాటి ఆందోళనలు ఉండొచ్చు. ఈరోజు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరగొచ్చు. శుక్రుడు, బుధుడి ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి నుంచి చంద్రుడు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ ఖర్చులు పెరగొచ్చు. మీ కోరికలలో కొన్ని నెరవేరే అవకాశాలున్నాయి. మీరు చేసే పనుల్లో కొన్ని వాయిదా పడొచ్చు. ఈరోజు మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. మీ కుటుంబంలో పెద్దల నుంచి మద్దతు లభిస్తుంది. భౌతిక సుఖాలు, విలాసాల పట్ల మీ కోరిక పెరుగుతుంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ రాశిలో కేతువు ఉన్నప్పటికీ గజకేసరి యోగం, రుచక యోగం ప్రభావంతో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. అయితే అనవసరమైన రిస్కులు తీసుకోవడం మానుకోవాలి. ఈ రాశి నుంచి చంద్రుడు పదకొండో స్థానంలో గురువు, శుక్రులతో కలయిక జరపడం వల్ల వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. సూర్యుడు, బుధుడు దశమన స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ప్రభుత్వ సంబంధిత పనులలో మీరు విజయం సాధిస్తారు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి భాగ్య స్థానంలో సూర్యుడు, బుధుడు కలయిక జరపనున్నాడు. మీ మేధస్సుతో అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం లభించొచ్చు. కొంత కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఉపశమం లభించే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి దశమ స్థానంలో త్రిగ్రాహి యోగం కారణంగా వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుక్రుడు, గురుడు, చంద్రుడి కలయిక కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీ మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి లభించే అవకాశాలున్నాయి. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. మీ జీవిత భాగస్వామి నుంచి ఆశించిన మద్దతు పొందుతారు. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ కోరికలలో ఒకటి నెరవేరొచ్చు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి నుంచి అష్టమ స్థానంలో గురు, శుక్ర, చంద్ర గ్రహాల కలయిక జరగనుంది. ఈ సమయంలో ఎవరికైనా వాగ్దానాలను చేసేటప్పుడు బాగా ఆలోచించిన తర్వాతే చేయాలి. ఒక ముఖ్యమైన విషయం గురించి కొంత ఆందోళన ఉండొచ్చు. మీరు ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటి ఆహారాన్ని తగ్గించాలి. మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి నుంచి సప్తమ స్థానంలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. చంద్రుడి ప్రభావంతో గజకేసరి యోగం, కళా యోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారంతో పనులన్నీ పూర్తవ్వొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు మతపరమైన పనులపై ఆసక్తి కనబరుస్తారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉండే అవకాశం ఉంది. వారు మీ పనులకు ఆటంకాలు కలిగించొచ్చు. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మీరు చేసే పనులను ఎంతో ఉత్సాహంతో ప్రారంభించినప్పటికీ, అవి పూర్తి కాకపోవడంతో నిరాశ చెందొచ్చు. ఆస్తి సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి నుంచి పంచమ స్థానంలో సూర్య, బుధ గ్రహాల కలయికతో విశేష ప్రయోజనాలు కలగొచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యా రంగంలో పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించొచ్చు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించొచ్చు. హనుమంతుని అనుగ్రహంతో వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. చంద్రుడు, గురు గ్రహాల ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీకు స్నేహితుల నుంచి అవసరమైన మద్దతు లభించొచ్చు.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు కుజుడి అనుగ్రహంతో శుభప్రదంగా ఉంటుంది. మీ తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో చంద్రుడితో పాటు శుక్రుడు, గురుడు ఉండటం వల్ల వివిధ సౌకర్యాలు, సదుపాయాలను పొందడానికి డబ్బు ఖర్చు చేస్తారు. పనికి సంబంధించిన చేసే ప్రయాణాల్లో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు పెంచుకోవడానికి మంచి అవకాశాలు లభించొచ్చు. మీ మాటల విషయంలో సంయమనం పాటించాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *