రాశిఫలాలు 05 మే 2026: ఈరోజు సిద్ధ యోగం ప్రభావంతో వృషభం, తులా సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు
రాశిఫలాలు 05 మే 2026: ఈరోజు సిద్ధ యోగం ప్రభావంతో వృషభం, తులా సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు
horoscope today 05 May 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శివ, సిద్ధ యోగాల ప్రభావంతో వృషభం కర్కాటకం సహా ఈ 5 రాశులకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel May5
horoscope today 05 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు మేష రాశిలో బుధుడు, సూర్యుడు కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం కారణంగా వృషభం సహా 5 రాశుల వారికి ఆర్థిక పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. ఈరోజు కొత్త పనిని ప్రారంభించడానికి, పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు శివ, సిద్ధ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మీరు చేసిన పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ విషయాల గురించి కొంత ఆందోళన చెందొచ్చు. అవి చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కేతువు, శుక్రుడి ప్రభావంతో మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ పాత బకాయిలను తిరిగి చెల్లించే అవకాశాలున్నాయి. మీ ఆస్తికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు తోబుట్టువులకు దూరంగా ఉన్నట్లయితే, ఆ బంధాన్ని ముగించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీకు కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు, మొదటి స్థానంలో గురుడి సంచారం కారణంగా ఈరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులను ఆశ్చర్యపరచొచ్చు. సమాజంలో మీకు గౌరవ, మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. మీ చిన్న పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వినొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే, మరింత ఏకాగ్రతతో ఉండాల్సిన సమయం ఇది. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి నుంచి గురుడు 12వ స్థానంలో గురుడు, సప్తమ స్థానంలో చంద్రుడు సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే మీకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉండొచ్చు. మీపై పనికి సంబంధించి అదనపు బాధ్యతలు పడొచ్చు. వ్యాపారులు ఈరోజు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరోవైపు మీకు రావాల్సిన బకాయిలు తిరిగి చెల్లించే సూచనలున్నాయి. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి నుంచి చంద్రుడు ఆరో స్థానంలో, శని అష్టమ స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ కారణంగా సింహ వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే ఊహించని ఖర్చులు మీ మార్గానికి ఆటంకం కలిగించొచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు కష్టపడి చదవాల్సి ఉంటుంది. మీ ఇంటికి అకస్మాత్తుగా ఒక అతిథి రాకతో వాతావరణం ఉత్సాహంగా మారుతుంది.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశాలున్నాయి. మీ మాటలు, ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ తల్లిదండ్రులు మీకు మద్దతుగా ఉంటారు. ఈ కారణంగా మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఉండే విభేదాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. మారుతున్న వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చు. మీ పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. బుధాదిత్య యోగం ప్రభావంతో అత్యున్నత ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు హనుమంతుని అనుగ్రహం లభించే అవకాశం ఉంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు కొన్ని పెద్ద ఒప్పందాలు ఖరారు చేసుకోవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ పిల్లలను సంతోషపెట్టడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఎవరో చెప్పిన విషయాల గురించి కాకుండా, మీ మనసుతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు మాటల విషయంలో ప్రత్యేక నియంత్రణ పాటించాలి. వ్యాపారులకు ఈరోజు ఊహించిన మేరకు లాభాలు రానున్నాయి. స్టాక్ మార్కెట్లో లేదా వ్యాపార రంగంలో భారీ లాభాలను ఆర్జించే అవకాశాలున్నాయి. మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు విజయం సాధించొచ్చు. మీ బాధ్యతలన్నింటినీ విజయవంతంగా నెరవేర్చే అవకాశం ఉంది. హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కారణంగా మీకు శుభ ఫలితాలొస్తాయి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీకు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభించొచ్చు. మీరు చేసే పనులకు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉది. ఈరోజు మీరు కొన్ని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాల్సి రావొచ్చు. అయితే బడ్జెట్ బ్యాలెన్స్ చేయాలి. మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభ యోగాల కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. హనుమంతుని అనుగ్రహం కారణంగా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వినిపించొచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు అధిపతిగా ఉండే శని దేవుడు, ప్రస్తుతం మీన రాశిలో రెండో స్థానంలో ఉండటం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించొచ్చు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరగొచ్చు. మరోవైపు దానధర్మాల కోసం మీరు కొంత ఖర్చులు కూడా చేయాల్సి రావొచ్చు.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం భారీగా పెరిగే అవకాశాలున్నాయి. దీంతో మీ ఆర్థిక బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ప్రతి అడుగులోనూ స్నేహితులు, సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.