రాశిఫలాలు 01 మే 2026: ఈరోజు సిద్ధి యోగం వేళ వృషభం, సింహం సహా ఈ 4 రాశులకు లక్ష్మీదేవి ఆశీస్సులు

horoscope today 01 May 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సిద్ధి యోగం, బుద్ధ పౌర్ణమి వేళ సింహం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel May1
horoscope today 30 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు బుద్ధ పౌర్ణమి వేళ సిద్ధి యోగం, వ్యాతీపాత యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా వృషభం సహా కొన్నిరాశుల వారికి విశేష ఫలితాలొచ్చే అవకాశం ఉంది. శుక్రుడి స్థానం బలపడటంతో మరికొన్ని ప్రయోజనాలు లభించొచ్చు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ఒక దీర్ఘకాలిక పనిని ప్రారంభించొచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలొస్తాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. మీరు కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. నాయకత్వ బాధ్యతులు చేపట్టేందుకు మీకు మంచి అవకాశం లభించొచ్చు. ఈరోజు బుద్ధ పౌర్ణమి వేళ మీ కోరికలలో ఒకటి నెరవేరే అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరగొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ కూడా లభించొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు వ్యాపారంలో మంచి పురోగతి లభించొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా మీ ముఖ్యమైన పనులు పూర్తవ్వొచ్చు. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీరు మానసికంగా బలంగా తయారవుతారు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ ఆదాయ వనరులు మెరుగుపడే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవ్వొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందొచ్చు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరగొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భావోద్వేగ విజయాన్నిసాధించడం ద్వారా జీవితంలో ముందుకు సాగుతారు. వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు సాధించొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు గత సమస్యల నుంచి పరిష్కారం లభించడంతో ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారులు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వాహనాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. బంధువుల నుంచి మీకు నిరాశ కలిగించే వార్తలు వినిపించొచ్చు. పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. మరోవైపు ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరగడంతో కొంత ఆందోళన చెందుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు లేదా కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి పొందొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు రావొచ్చు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలొస్తాయి. గతంలో చేసిన అప్పుల నుంచి విముక్తి లభించొచ్చు. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. అయితే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు పాత బకాయిలను చెల్లించే అవకాశం ఉంది. దీంతో మీకు అనేకసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది..

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు పొందొచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *