రాశిఫలాలు 20 ఏప్రిల్ 2026: ఈరోజు సౌభాగ్య యోగం ప్రభావంతో వృషభం, మకరం సహా కొన్ని రాశులకు అనేక ప్రయోజనాలు
horoscope today 20 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సౌభాగ్య, శోభన, అతిగండ యోగాల ప్రభావంతో మకరం సహా ఈ 5 రాశులకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శుక్రుడు, చంద్రుడి ప్రభావంతో కొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా సౌభాగ్య, శోభన అతిగండ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ ద్వాదశ రాశులలో కొన్ని రాశులపై శివయ్య అనుగ్రహం లభించనుంది. మకరం సహా కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు శుక్రుడు, చంద్రుడి ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త ఆదాయ వనరులు పొందొచ్చు. ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే పనుల్లో శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ధైర్యం చేస్తారు. గ్రహాల అనుగ్రహంతో మీ పెండింగ్ పనులు కూడా పూర్తవ్వొచ్చు. అయితే మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్షయ తృతీయ రోజున చంద్రుడు, శుక్రుడి కలయికతో అనేక ప్రయోజనాలు చేకూరొచ్చు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. మీరు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేస్తున్న గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం మరింత పెరగొచ్చు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి నుంచి సూర్యుడు లాభ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు పన్నెండో స్థానంలో చంద్రుడు రవాణా కారణంగా మీరు ఆరోగ్య పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దానధర్మాలకు సంబంధించి ఖర్చులు పెరగొచ్చు. ఈరోజు మీరు చేసే పనుల్లో చాలా ఓపికగా ఉండాలి. మీరు చేసే పనులు నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు క్రమశిక్షణతో పని చేయాలి. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదమైన రోజు అవ్వొచ్చు. శుక్రుడి అనుగ్రహంతో మీకు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. బంధువుల నుంచి మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ బడ్జెట్ ప్రకారం, ఖర్చులు చేయాలి. ఇతర సేవా కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించాలి. మీరు చేసే పనుల్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. దశమ స్థానం నుంచి సూర్యుడి సంచారం కారణంగా మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా మెరుగైన పరిస్థితులు రావొచ్చు. సొంత నిర్ణయాల ద్వారా డబ్బు సంపాదించడానికి ఈరోజు గొప్పగా ఉంటుంది. ఈరోజు మీరు ఏదైనా ఒప్పందాలు చేసుకుంటే, చాలా రహస్యంగా ఉంచాలి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా పని చేయాలి. మీరు నాయకత్వ స్థానంలో ఉంటే, కొన్ని ఒప్పందాలను జాగ్రత్తగా చేయాలి. మీ ప్రతిభను చూపించుకోవడానికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశాలున్నాయి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి సూర్యుడు అష్టమ స్థానంలో ఉండటం కారణంగా సానుకూల ఫలితాలు రావొచ్చు. ఈ రాశి నుంచి శుక్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం కారణంగా విద్యార్థులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో రాణించొచ్చు. దశమ స్థానంలో గురు గ్రహం సంచారం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనిలో పురోగతి లభిస్తుంది. ఈరోజు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. రుణం లేదా బీమా క్లెయిమ్స్‌కు సంబంధించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే మీకు కొత్త ఆదాయ వనరులు లభించొచ్చు. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలొస్తాయి. కష్టమైన పనులను సులభంగా నిర్వహించొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా మీరు సానుకూల ఫలితాలు పొందొచ్చు. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధించొచ్చు.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో గురుడు సంచారం చేసే సమయంలో సంయమనం పాటించాలి. వ్యాపారులు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీరు పెట్టే పెట్టుబడులపై సమీక్ష చేసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఆహ్లాకరంగా ఉంటుంది.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన పరిస్థితులు లభించొచ్చు. మీ ఇంటి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. బడ్జెట్ ప్రకారం ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. కెరీర్ పరంగా పురోగతి సాధించాలంటే, మంచి ప్రణాళికలు వేసుకోవడానికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు, చంద్రుడి అనుగ్రహంతో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి రావొచ్చు. ఏదైనా విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించొచ్చు.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు, చంద్రుడి కలయికతో మీరు విలాసాల కోసం కొంత ఖర్చులు చేయాల్సి రావొచ్చు. అయితే పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉండదు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా పురోగతి సాధించాలంటే ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఈ రాశి నుంచి సూర్యుడు రెండో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త ఆదాయ వనరులు కనుగొనే అవకాశాలున్నాయి. మీరు చేసే పనుల్లో సానుకూలు రావొచచు. మీ పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. దీంతో మీరు సంతోషంగా ఉంటారు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.