రాశిఫలాలు 06 మార్చి 2026: ఈరోజు వృద్ధి యోగం వేళ మేషం, వృశ్చికం సహా ఈ 4 రాశులకు శుభ సంకేతాలు
రాశిఫలాలు 06 మార్చి 2026: ఈరోజు వృద్ధి యోగం వేళ మేషం, వృశ్చికం సహా ఈ 4 రాశులకు శుభ సంకేతాలు
horoscope today 06 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వృద్ధి యోగం వేళ కేతువు ప్రభావంతో మేషం, వృశ్చికం సహా ఈ 4 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి నుంచి చంద్రుడు సప్తమ స్థానం నుంచి బలమైన సంయోగం ఏర్పరచనున్నాడు. ఈ సమయంలో వ్యాపారులకు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరగొచ్చు. సాయంత్రం 5:30 గంటలకు చంద్రుడు కన్య నుంచి తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారు ఈరోజు కొత్త ప్రణాళికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లడం వల్ల మనసులో ప్రశాంతతను అనుభవిస్తారు. చట్టపరమైన వివాదాల్లో మీకు అనుకూలంగా తీర్పు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభించొచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుక్రుడు, శని అనుగ్రహంతో కెరీర్ పరంగా పురోగతి సాధించే అవకాశాలున్నాయి. అయితే ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ బడ్జెట్‌కు తగ్గట్టు ఖర్చులు చేయాలి. బుధుడు తిరోగమనంలో ఉన్న సమయంలో ప్రమాదకర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించి చేసే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు ఈరోజు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. వ్యాపారులు తమ ఒత్తిడిని ఇంటి వరకు తీసుకెళ్లకండి. మీ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. బుధుడి తిరోగమనం కారణంగా ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అధిక పెట్టుబడి రిస్క్‌లను పూర్తిగా నివారించాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. భవిష్యత్తులో మీరు కొత్త అవకాశాలు పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయాలి. బుధుడి తిరోగమనం సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఆస్తి సంబంధిత విషయాల్లో ఇతరులపై ఆధారపడకండి. ఈరోజు ఆధ్యాత్మిక విషయాలకు కొంత సమయం కేటాయించడం మంచిది. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుంచి కొంత ఇబ్బంది ఎదురవుతుంది.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారు ఈరోజు చాలా ఓపికగా ఉండాలి. ఇతరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. బుధుడు ఈ రాశి నుంచి ఆరో స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఎవరికీ అప్పులు ఇవ్వకండి. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయాలి. పాత పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. ఈరోజు క్లిష్టమైన సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. రాత్రి సమయంలో చంద్రుడు ఇదే రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బుధుడు తిరోగమనం సమయంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే భాగస్వామి నుంచి ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు పొందే అవకాశాలున్నాయి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కొన్ని ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అయితే మీరు రాజకీయాలకు దూరంగా ఉండాలి. మీ లక్ష్యాలపై మాత్రమే ఫోకస్ పెట్టాలి. ఆస్తి లేదా ఇంటి పునరుద్ధరణకు సంబంధించి ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బుధుడి తిరోగమనం కారణంగా ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పాత బకాయిలను తిరిగి చెల్లించే ప్రయత్నం చేయాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు క్లిష్ట లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఈ రాశి నుంచి మూడో స్థానంలో గ్రహాల కలయిక కారణంగా కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి. మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు రాత్రి చంద్రుడి సంచారం కారణంగా శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. రెండో స్థానంలో బుధుడు తిరోగమనం కారణంగా ఆర్థిక లావాదేవీల్లో ఏదైనా తప్పులు జరగొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ రోజువారీ ఇంటి పనులను సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధించొచ్చు. అయితే ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల ఆందోళన పెరగొచ్చు.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని తప్పులు జరగొచ్చు. కాబట్టి ముందే అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. కుజుడి ప్రభావంతో మీ ధైర్యం పెరుగుతుంది. అయితే రాహువు ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొంత రిస్క్ తీసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ తెలివితేటలను ఉపయోగించి అనేక సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. బుధుడి తిరోగమనం కారణంగా పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. పాత బకాయిలను తీర్చేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.