శ్రీశైలం మల్లన్న భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆలయం మూసివేత, భక్తులకు దర్శనాలు రద్దు

Srisailam Temple Closed On March 3: శ్రీశైలం ఆలయం మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమయంలో ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, కళ్యాణోత్సవ టికెట్లు రద్దు చేశారు. గ్రహణం ముగిసిన తర్ాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం రాత్రి 9 నుంచి 10:30 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు.

హైలైట్:

శ్రీశైలం ఆలయం మూసివేత

మార్చి 3న చంద్రగ్రహణం

ఆ రోజు దర్శనాలు ఉండవు

Srisailam Temple Close

మార్చి 3న శ్రీశైలం ఆలయం మూసివేత

శ్రీశైలం మల్లన్న భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆలయాన్ని మూసివేయనున్నారు. మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆలయ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు. అంతేకాదు మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా.. ఆ రోజు ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవ టికెట్లను పూర్తిగా రద్దు చేసినట్లు ఈవో తెలిపారు.

మార్చి 3న చంద్రగ్రహణం రోజున తెల్లవారుజామున 3 గంటలకు శ్రీశైలం మల్లన్న ఆలయంలో సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు జరుగుతాయి. ఆలయంలో ఉదయం 4:30 నుంచి 5:30 వరకు మాత్రమే భక్తులకు అలంకార దర్శనానికి అనుమతి ఉంటుంది. అయితే చంద్రగ్రహణం తర్వాత రాత్రి 7:30 గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 9:00 గంటల నుంచి 10:30 గంటల వరకు తిరిగి భక్తుల్ని దర్శనాలకు అనుమతిస్తారు. అంతేకాదు మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీశైలంలో ఆ రోజంతా అన్నప్రసాద వితరణ ఉండదు. భక్తులు ఈ విషయాలన్నీ గమనించాలని.. తమకు సహకరించాలని ఆలయ ఈవో, అధికారులు కోరుతున్నారు. చంద్రగ్రహణం రోజు శ్రీశైలం మల్లన్న ఆలయం మాత్రమే కాదు.. సాక్షి గణపతి, హఠకేశ్వరం, ఫాలధార-పంచధార, శిఖరేశ్వరం వంటి ఉపాలయాలు కూడా చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తారు.

శ్రీశైలంలో మార్చి 16వ తేది నుంచి 20వ తేది వరకు ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉగాది ఉత్సవాలకు శ్రీశైల దేవస్థానం భారీ ఏర్పాటు చేస్తోంది. కాలిబాటగా వచ్చే భక్తుల సౌకర్యార్థం మంచినీటి సరఫరా, దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్ రమేష్ నాయుడు అన్నారు. భక్తులు సంయమనం పాటిస్తూ స్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని, ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఉగాదికి శ్రీశైలం వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నారు ఆలయ అధికారులు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *