రాశిఫలాలు 31 మే 2026: ఈరోజు మహాలక్ష్మీ యోగం ప్రభావంతో వృషభం, ధనస్సు సహా ఈ 5 రాశులకు ధనలాభ అవకాశాలు

 రాశిఫలాలు 31 మే 2026: ఈరోజు మహాలక్ష్మీ యోగం ప్రభావంతో వృషభం, ధనస్సు సహా ఈ 5 రాశులకు ధనలాభ అవకాశాలు

రాశిఫలాలు 31 మే 2026: ఈరోజు మహాలక్ష్మీ యోగం ప్రభావంతో వృషభం, ధనస్సు సహా ఈ 5 రాశులకు ధనలాభ అవకాశాలు

horoscope today 31 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీనారాయణ, గజలక్ష్మీ యోగాల ప్రభావంతో మిథునం, ధనస్సు సహా ఈ 5 రాశులకు ఆకస్మిక ధనలాభం లభించొచ్చు. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horosocpe in Telugu May31
horoscope today 31 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజున అధిక జ్యేష్ఠ పౌర్ణమి వేళ మిథున రాశిలో బుధుడు, శుక్రుడు కలిసి గజలక్ష్మీ, లక్ష్మీనారాయణ యోగాలను ఏర్పరచనున్నారు. అంతేకాదు శుక్రుడు కుజుడు మధ్య ఉభయచారి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మిథునం, ధనస్సు సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు గొప్ప ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి శుక్రుడు మూడో స్థానంలో మహాలక్ష్మీ యోగాన్ని ఏర్పరచనున్నాడు. శుభ యోగాల కారణంగా మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో మీకు స్నేహితుల సాయంతో ఉపశమనం లభించే అవకాశం ఉంది. మీ తోబుట్టువులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. మీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

​వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సూర్య దేవుని ప్రత్యేక అనుగ్రహం వల్ల మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ రాశి నుంచి కుజుడు 12వ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఖర్చులు పెరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. సూర్యుడి అనుగ్రహంతో మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. బుధుడు, శుక్ర, గ్రహాల ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. కొత్త పరిచయాలు మీకు ప్రయోజనకరంగా మారొచ్చు. మరోవైపు మీకు పని ఒత్తిడి పెరగొచ్చు

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కుజుడి ప్రభావంతో మీకు ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. అయితే మీ ఖర్చులపై నియంత్రణ పాటించాలి. మీరు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. బుధుడు, గురుడు, శుక్రుడి కలయిక కారణంగా మీకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాల వల్ల కొన్ని కొత్త అవకాశాలు ఏర్పడొచ్చు. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది. మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన పలితాలు పొందే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. చాలా కాలంగా కొత్త వాహనం కొనాలని కోరుకుంటున్న వారి కోరికలు ఈరోజు నెరవేరే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన పాత వివాదాలన్నింటికీ పరిష్కారలం లభించొచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు బుధుడు, గురుడు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. మీ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు తాము చేసే పనిలో సహోద్యోగుల నుంచి సహకారం, స్పష్టత లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందొచ్చు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఆకస్మిక ధనలాభం కలగొచ్చు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశాలున్నాయి. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు సూర్యదేవుని అనుగ్రహం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ జీవితంలో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉండటం వల్ల, ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ పనుల్లో వేగం పెరగొచ్చు. ఈరోజు తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. బుధ, గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి రావొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరగొచ్చు. మీ తోబుట్టువులతో సంబంధాలు సఖ్యతతో కొనసాగుతాయి. పనిభారం కారణంగా మీరు శారీరక అలసటను అనుభవించొచ్చు..

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ స్నేహితులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. కోర్టు సంబంధిత కేసులో మీకు అనుకూలంగా తీర్పు రావొచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. మీ కష్టానికి అద్భుతమైన ఫలితాలు రావొచ్చు. మరోవైపు మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సత్సంబంధాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలు రావొచ్చు. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీకు కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో తమ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన వ్యక్తులు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. లేదంటే మీరు నష్టపోయే అవకాశాలన్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *