రాశిఫలాలు 22 మే 2026: ఈరోజు ధన యోగం ప్రభావంతో తుల, మకరం సహా ఈ 5 రాశులకు ఆర్థిక లాభాలు

 రాశిఫలాలు 22 మే 2026: ఈరోజు ధన యోగం ప్రభావంతో తుల, మకరం సహా ఈ 5 రాశులకు ఆర్థిక లాభాలు

Today Horoscope (May 22, 2026): శుక్రవారంనాటి రాశిఫలాల ప్రకారం మేష రాశి వారికి ఉద్యోగ, వృత్తి రంగాల్లో అనుకూల పరిస్థితులు ఉండగా, వృషభ రాశి వారికి బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి కెరీర్‌లో మంచి పురోగతి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభించనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపనున్నాయో తెలుసుకోండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి ఇలా..

దిన ఫలాలు (మే 22, 2026): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపార కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక వ్యవహారాలను ఒకేసారి పూర్తి చేయాల్సి రావడం వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకుంటే మంచిది. ఇంటా బయటా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. అను కున్న పనులు పూర్తవుతాయి. గృహ, వాహన సౌకర్యాల కోసం ప్లాన్ చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఎవరికీ గుడ్డిగా నమ్మవద్దు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. సరికొత్త ఆలోచనలతో వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి పెడతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఊహించని విధంగా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఉద్యోగంలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడ తాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని తేలికగా పూర్తి చేస్తారు. బంధువులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ బాగా పెరుగుతుంది. రావలసిన డబ్బు ఎక్కువగానే ఉన్నప్పటికీ సకాలంలో డబ్బు అందక కొద్దిగా ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. గట్టి ప్రయత్నంతో వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తి చేస్తారు. బంధుమిత్రులు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం బాగా ఆశాజనకంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా అనుకోని అదృష్టం పడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన రాబడి ఉంటుంది. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశముంది. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఉద్యోగంలో జీవిత భాగస్వామి శుభ వార్తలు వింటారు.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో బాగా లాభాలు గడిస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి కంపెనీల ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కొద్దిగా మందగిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లలు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో జీవిత భాగస్వామి ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా మాటకు బాగా విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు సాయం చేయడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *