Weekly Lucky Zodiac Signs: వచ్చే వారంలో ఆదిత్య మంగళ యోగం ప్రభావంతో వృషభం, సింహం సహా కొన్ని రాశులకు అదృష్ట సంకేతాలు

 Weekly Lucky Zodiac Signs: వచ్చే వారంలో ఆదిత్య మంగళ యోగం ప్రభావంతో వృషభం, సింహం సహా కొన్ని రాశులకు అదృష్ట సంకేతాలు

Weekly Lucky Zodiac Signs: వచ్చే వారంలో ఆదిత్య మంగళ యోగం ప్రభావంతో వృషభం, సింహం సహా కొన్ని రాశులకు అదృష్ట సంకేతాలు

Weekly Lucky Zodiac Signs జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెలలో ఒక అరుదైన గ్రహ కూటమి ఏర్పడనుంది. వీటిలో త్రిగ్రాహి యోగం(మూడు గ్రహాల కలయిక), ఆదిత్య మంగళ యోగాలు ఉన్నాయి. ఈ శుభ యోగాల కారణంగా వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశ ఉంది.

Weekly Lucky Zodiac Signs వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏప్రిల్ మొదటి వారంలో కుజుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో శని, సూర్యుడు, కుజుడు కలిపి మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఇప్పటికే సూర్యుడు, శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. తాజాగా కుజుడు ఏప్రిల్ 2వ తేదీన గురువారం నాడు ఈ రాశిలోకి ప్రవేశించడంతో సూర్యుడు, కుజుడి కలయిక జరగనుంది. ఈ కారణంగా ఆదిత్య మంగళ యోగం ఏర్పడనుంది. ఈ గ్రహాల కదలిక కారణంగా సింహం, తులా సహా 5 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యంలో మెరుగ్గా ఉంటుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ మొదటి వారంలో వేళ ఏ రాశుల వారికి అదృష్టం పెరుగుతుందనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడే చూసెయ్యండి.

వృషభ రాశి(Taurus)
వృషభ రాశి(Taurus)

వృషభ రాశి(Taurus)
​వృషభ రాశి వారు ఏప్రిల్ మొదటి వారంలో తాము చేసే పనుల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. కొంత కాలంగా ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కొంటుంటే వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. మీ కుటుంబ వాతావరణం మెరుగ్గా ఉంటుంది. ఈ వారం మీరు చేసే ప్రయణాల వల్ల మంచి ఫలితాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకునేందుకు మంచి అవకాశాలొస్తాయి. కాబట్టి చాలా ఓపికగా ఉండాలి. వ్యాపారులకు తమ ప్రణాళికలను అమలు చేయడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వారం చివరికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారొచ్చు.

సింహ రాశి(Leo)
సింహ రాశి(Leo)

సింహ రాశి(Leo)
​సింహ రాశి వారికి ఏప్రిల్ మొదటి వారంలో త్రిగ్రాహి యోగం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి సాధించొచ్చు. మీ కోరికలకు అనుగుణంగా జీవితంలో మార్పులు సంభవిస్తాయి. మీ ఆదాయం పెరిగే బలమైన అవకాశం ఉంది. ఈ కాలంలో కొత్త వాహనం కొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ వారం మీరు చేసే ప్రయాణం వల్ల మంచి ఫలితాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

తులా రాశి(Libra)

తులా రాశి(Libra)
తులా రాశి వారికి ఏప్రిల్ ప్రారంభంలో శుభప్రదంగా ఉంటుంది. త్రిగ్రాహి యోగం ప్రభావంతో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఉద్యోగులకు తమ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఉన్న విభేదాలన్నీ తొలగిపోవచ్చు. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(Scorpio)

వృశ్చిక రాశి(Scorpio)
వృశ్చిక రాశి వారు వచ్చే వారం త్రిగ్రాహి యోగం, ఆదిత్య మంగళ యోగాల ప్రభావంతో శుభ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మహిళల నుంచి మీకు మంచి సాయం లభించొచ్చు.

కుంభ రాశి(Aquarius)

కుంభ రాశి(Aquarius)
కుంభ రాశి వారికి సూర్యుడు, కుజుడు ఏర్పరిచే ఆదిత్య మంగళ యోగం కారణంగా సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. ఆర్థిక పరంగా మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మరోవైపు ఏదో ఒక సమస్య కారణంగా మీకు కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. ఈ వారం మీరు చేసే ప్రయాణాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *