Today Horoscope : నేటి రాశి ఫలాలు తేదీ 13.10.2023 బుధవారం
horoscope today 13 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సిద్ధ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
1.మేషరాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు తల్లిదండ్రుల అంచనాలను అందుకునేందుకు ప్రయత్నం చేస్తారు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు మీ కోపాన్ని నియంత్రించాలి. అప్పుడే మీకు గౌరవం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలొస్తాయి. మీ భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేయొచ్చు. ఈరోజు సాయంత్రం మీరు స్నేహితులతో కలిసి భగవంతుని దర్శనానికి వెళ్లొచ్చు.
ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పార్వతీదేవిని పూజించాలి.
Sun Transit in Virgo కన్య రాశిలో సూర్యుడి సంచారంతో ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం..!
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీరు పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం వ్యాపారంలో పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. రాజకీయ ప్రత్యర్థులు ఈరోజు మీపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేయొచ్చు. మీరు ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, దానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్య కోసం మంచి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
ఈరోజు మీకు 98 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి.
===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారికి ఈరోజు సోదరులతో ఏమైనా మనస్పర్దలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలను వినొచ్చు. దీని వల్ల మీ మనోబలం పెరుగుతుంది. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీరు సామాజిక కార్యకలాపాలపై శ్రద్ధ వహించాలి. ఈరోజు తల్లిదండ్రుల సలహా తీసుకోవడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రం’ పఠించాలి
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారికి ఈరోజు పిల్లల పెళ్లికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వ్యాపారులకు సాయంకాలం సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. శుభకార్యాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. అయితే భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి క్షీణించొచ్చు.
ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి దుర్వా సమర్పించాలి.
==========================================================================
సింహరాశి ఫలాలు 2023
ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయొచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. మీ బంధువులతో ఈరోజు చాలా కాలంగా ఉండే గొడవలన్నీ ఈరోజు ముగిసే అవకాశం ఉంది. ఈరోజు ఎవరి దగ్గరైనా రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, ఈరోజు అస్సలు తీసుకోకండి. మరోవైపు మీరు బంధువుల నుంచి కొన్ని ప్రతికూల వార్తలు వినొచ్చు.
ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ విష్ణువును పూజించాలి.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో ఆహ్లాదకరమైన పరిస్థితిని అనుభవిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెరగొచ్చు. దీని వల్ల మీకు సంతోషం కలిగిస్తుంది. వ్యాపారులకు ఈరోజు ఆకస్మిక ధనలాభం వస్తుంది. అయితే మీకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ముందుకు సాగాలి.
ఈరోజు మీకు 64 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ శివ చాలీసా పఠించాలి.
Vipreet Raj Yoga 2023 కన్య రాశిలో విపరీత రాజయోగం వేళ ఈ రాశుల దశ ఒక్కసారిగా మారిపోతుందట..
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో వ్యాపారులు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల ఇబ్బందుల్లో పడొచ్చు. ఈ కారణంగా మీరు డబ్బు సంబంధిత ఖర్చులను పెంచుకోవచ్చు. ఈరోజు పని చేసే వ్యక్తులు రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని వేధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులు ఈరోజు కష్టపడి పని చేసిన తర్వాత మంచి విజయం సాధించగలరు. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే, తిరిగి దాన్ని పొందే అవకాశం ఉంది. దీని వల్ల మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీరు సాయంత్రం నుంచి కొంత ఉపశమనం పొందుతారు.
ఈరోజు మీకు 74 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో విద్యార్థులు పరీక్షల్లో రాణించేందుకు కష్టపడి పని చేయాలి. ఉద్యోగులు పెద్ద సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో మంచి విజయం సాధిస్తారు. మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సోదరుల వివాహానికి సంబంధించి కుటుంబంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే, అది ఈరోజు తొలగిపోయే అవకాశం ఉంది. మీ ఇంట్లో చిన్నారులతో సాయంత్రం సరదాగా గడుపుతారు.
ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.
====================================================================================
9.ధనుస్సు రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు ఎవరి దగ్గరి నుంచైనా అప్పు తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే, దాన్ని తిరిగి చెల్లించేందుకు ప్రయత్నించాలి. మీరు తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే, కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వ్యాపారులు ఈరోజు అకస్మాత్తుగా పెద్ద ఆర్డర్లను పొందొచ్చు. దీని వల్ల మీరు సంతోషంగా ఫీలవుతారు. ఈరోజు సాయంత్రం సామాజిక కార్యక్రమాల కోసం కొంత దూరం ప్రయాణం చేయొచ్చు.
ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ జపమాలను పఠించాలి.
======================================================================================
10.మకరం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు ఆస్తికి సంబంధించి ఏవైనా వివాదాలుంటే, అప్పుడే పరిష్కరించుకోవచ్చు. దీని వల్ల మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉపాధి కోసం పని చేసే వ్యక్తులు ఈరోజు అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ఈ కారణంగా మీకు ఉపాధిలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు ఈరోజు పై అధికారులతో వాదనలు పెట్టుకోవచ్చు.
ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి.
==========================================================================================
11.కుంభం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో ఉద్యోగులు మహిళా స్నేహితుల నుంచి విజయాన్ని పొందగలరు. ఈరోజు మీరు పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారులు ఈరోజు ఏదైనా కొత్త ప్రణాళికను ప్రారంభించాలనుకుంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావొచ్చు. కొన్ని ముఖ్యమైన పనుల గురించి శుభవార్తలు వింటారు.
ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.
======================================================================================
12.మీనం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొత్త పనులలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే, మీరు దాని నుంచి కచ్చితంగా ప్రయజనాలు పొందుతారు. మరోవైపు మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీరు ఆహార అలవాట్ల కారణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కొందరు వ్యక్తులను కలవడం వల్ల కచ్చితంగా ప్రయోజనం పొందుతారు.
ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గురువు, సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు పొందాలి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
===========================================================================================