T20 World Cup Records : టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిన ఆ నలుగురు.. రన్ ఛేజింగ్ సెంచరీల వీరులు వీరే!
T20 World Cup Records : టీ20 ఫార్మాట్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఉండే ఒత్తిడిని అధిగమించి, ఈ 19 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నలుగురు మొనగాళ్లు మాత్రమే రన్ ఛేజ్‌లో వంద మార్కును అందుకున్నారు. ఆ నలుగురు వీరులు, వారి రికార్డుల వివరాలు తెలుసుకుందాం.
20 World Cup Records : టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిన ఆ నలుగురు.. రన్ ఛేజింగ్ సెంచరీల వీరులు వీరే!
T20 World Cup Records : ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా పరుగుల వేటలో సెంచరీ సాధించడం అనేది ఒక అరుదైన ఫీట్. టీ20 ఫార్మాట్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఉండే ఒత్తిడిని అధిగమించి, ఈ 19 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నలుగురు మొనగాళ్లు మాత్రమే రన్ ఛేజ్‌లో వంద మార్కును అందుకున్నారు. ఆ నలుగురు వీరులు, వారి రికార్డుల వివరాలు తెలుసుకుందాం.
అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్)
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టార్గెట్ ఛేదిస్తూ సెంచరీ బాదిన మొట్టమొదటి ఆటగాడిగా ఇంగ్లాండ్ బ్యాటర్ అలెక్స్ హేల్స్ చరిత్రకెక్కాడు. 2014వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హేల్స్ ఈ అద్భుతాన్ని చేశాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హేల్స్ కేవలం 64 బంతుల్లోనే 116 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ అప్పట్లో ఒక సంచలనం.
క్రిస్ గేల్ (వెస్టిండీస్)
సిక్సర్ల కింగ్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఈ జాబితాలో ఉండటం పెద్ద వింతేమీ కాదు. 2016 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ తన విశ్వరూపం చూపించాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ, గేల్ కేవలం 48 బంతుల్లోనే 5 ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఛేజింగ్‌లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు కూడా గేల్ పేరిటే ఉంది.
పతుమ్ నిస్సంక (శ్రీలంక)
దాదాపు పదేళ్ల తర్వాత 2026 టీ20 వరల్డ్ కప్‌లో మళ్ళీ ఛేజింగ్ సెంచరీ నమోదైంది. శ్రీలంక యువ ఓపెనర్ పతుమ్ నిస్సంక ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ జట్టుపై ఈ ఘనత సాధించాడు. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ నిస్సంక చేసిన ఈ 100 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఈ సీజన్లోనే హైలైట్‌గా నిలిచింది. ఒకే వరల్డ్ కప్ సీజన్లో ఇద్దరు బ్యాటర్లు ఛేజింగ్‌లో సెంచరీలు చేసే పరంపరకు నిస్సంక శ్రీకారం చుట్టాడు.
హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)
ఇక ఈ జాబితాలో చేరిన తాజా సంచలనం ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్. ఫిబ్రవరి 24, 2026న పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో బ్రూక్ విశ్వరూపం చూపాడు. కేవలం 51 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రన్ ఛేజింగ్‌లో సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా బ్రూక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో ఇంగ్లాండ్ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా కూడా ఆయన గుర్తింపు పొందాడు.